ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందట. ఓ బడా బిజినెస్ మాన్‌తో ఆమె ఏడడుగులు నడవబోతోందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక ముద్దుల కుమార్తె అయిన కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసి, ఆ తర్వాత హీరోయిన్గా మారింది.
`నేను శైలజ` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. ఇక్కడ తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. `మహానటి` సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది.
ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదే ఆమె పెళ్లి వార్త. తన తల్లిదండ్రులు నిశ్చయించిన ఓ అబ్బాయిని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతోందట. సదరు అబ్బాయి బడా వ్యాపారవేత్త అని, అతడికి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, త్వరలోనే కీర్తి సురేష్ నుండి పెళ్లికి సంబంధించిన గుడ్‌న్యూస్ రానుందట. అదే నిజమైతే ఆమె అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమవుతుంది. కాగా, కీర్తి సురేష్ సినిమాల విషయానికి.. తెలుగులో ఈమె న్యాచురల్ స్టార్ నానికి జోడీగా `దసరా`, చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` సినిమాలు చేస్తోంది. మలయాళ, తమిళ భాషల్లోనూ ఈ బ్యూటీ పలు ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసింది.