NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Keerthy Suresh: మ‌ళ్లీ తెర‌పైకి కీర్తి సురేష్ పెళ్లి గోల‌.. ఈసారి వ‌రుడు ఎవ‌రంటే..?

Keerthy Suresh: మూడు పదుల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కానీ హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకటి. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో కీర్తి సురేష్ జన్మించింది. ఆమె తండ్రి జి. సురేష్ కుమార్ మలయాళ ఇండస్ట్రీలో నిర్మాతగా సత్తా చాటుతున్నారు. అలాగే కీర్తి సురేష్ తల్లి మేనక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. కీర్తి సురేష్ విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2013లో గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో నేను శైలజ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమా తోనే కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తనదైన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుని మరిన్ని అవకాశాలు అందుకుంది.

అటు తమిళంలో శివ కార్తికేయన్ కు జోడీగా రజిని మురుగన్ మూవీలో నటించి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి మూవీతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో నేమ్ అండ్ ఫ్రేమ్ సంపాదించుకుంది. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్న కీర్తి సురేష్.. త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతోంది. వరుణ్ ధావన్ కు జోడిగా బేబీ జాన్ అనే మూవీలో నటిస్తోంది.

తమిళ సూపర్ హిట్ తేరి చిత్రానికి హిందీ రీమేక్ ఇది. కలీస్ దశకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్ల‌ర్‌ మూవీ కి ప్రముఖ స్టార్ డైరెక్టర్ అట్లీ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న బేబీ జాన్ మూవీ మే నెలలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. అలాగే తమిళంలో దాదాపు మూడు సినిమాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లి గోల‌ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. మూడు పదుల వయసులో ఉన్న కీర్తి సురేష్ పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ గ‌త కొంత‌ కాలం నుంచి పదేపదే వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట మ్యూజికల్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తో కీర్తి సురేష్ ప్రేమలో ఉందని, వీరిద్ద‌రూ వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని కీర్తి సురేష్ తల్లిదండ్రులు కొట్టిపారేశారు.

ఆ తర్వాత ఒక పొలిటీషన్ తో కీర్తి సురేష్ పెళ్లి జరగ‌నుంద‌ని వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో తమిళ కమెడియన్ తో కీర్తి సురేష్ వివాహం జ‌రిగిపోయింద‌ని ప్రచారం జరిగింది. ఇలా పలుమార్లు కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. వాటికి కీర్తి సురేష్ పేరెంట్స్ చెక్ పెడుతూనే ఉన్నారు. అయినా సరే ఆ వార్తలు ఆగడం లేదు. ఇప్పుడు మరోసారి కీర్తి సురేష్ పెళ్లి గోల మొదలయింది. తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ తో దాదాపు 13 సంవత్సరాల నుంచి కీర్తి సురేష్ ప్రేమలో ఉందని.. ఇప్పుడు అతనితోనే పెళ్లికి సిద్ధం అవుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే కీర్తి సురేష్ నుంచి పెళ్లి ప్రకటన కూడా రానుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం..? అసలు కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ ఎవరు..? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N