NewsOrbit
Entertainment News సినిమా

Ketika Sharma: న‌క్క‌తోక తొక్కిన కేతిక శ‌ర్మ‌.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ మూవీ ఛాన్స్‌?!

Ketika Sharma: ఇటీవ‌ల కాలంలో యంగ్ హీరోయిన్ల హ‌వా బాగా పెరిగిపోయింది. ఈ లిస్ట్‌లో కేతిక శ‌ర్మ ఒక‌రు. ఢిల్లీలో జ‌న్మించిన ఈ బ్యూటీ.. మొడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్‌` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `లక్ష్య`లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించ‌లేక‌పోయాయి.

కానీ, కేతిక శ‌ర్మ మాత్రం యూత్‌లో సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌కు జోడీగా `రంగ రంగ వైభవంగా` అనే చిత్రంలో న‌టిస్తోంది. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వ‌కుండానే కేతిక శ‌ర్మ న‌క్క‌తోక తొక్కి ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీతో ఛాన్స్ కొట్టేసింద‌ని అంటున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ప‌న‌వ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో `వినోదాయ సీతాం` రీమేక్ ఒక‌టి. స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన త‌మిళ చిత్ర‌మిది.

2021లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజ‌యం సాధించ‌గా.. ఇప్పుడీ దీనిని తెలుగుతో రీమేక్ కాబోతోంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించ‌బోతున్నారు. అయితే ఈ చిత్రంలో సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు జోడీగా కేతిక శ‌ర్మ‌ను ఎంపిక చేశార‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

author avatar
kavya N

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri