కేతిక శర్మ.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, అంతకుమించి నటనా ప్రతిభ ఉన్నా.. ఈ అమ్మడుకు సక్సెస్ మాత్రం రావడం లేదు.
రొమాంటిక్ మూవీ తో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన కేతిక శర్మ.. తొలి సినిమాతో హిట్ అందుకోలేకపోయినా యూత్ లో మంచి క్రేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ నాగశౌర్యకు జోడిగా `లక్ష్య` సినిమాలో నటించింది. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
ఇక రీసెంట్గా మెగా మేనల్లుడుకు జోడిగా కేతిక శర్మ నటించిన `రంగ రంగ వైభవంగ` సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్తా పడింది. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ ఫ్లాపులను అందుకున్న కేతికకు ప్రస్తుతం అర్జెంట్ హిట్ ఎంతైనా కావాలి. ఈ నేపథ్యంలోనే ఆఫర్ల కోసం ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరిబోతకు తెరలిపింది.
తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారు మతులను చెడగొడుతుంది. తాజాగా కూడా ట్రెండీ దుస్తులను ధరించి బిగుతైన పరువాలతో టెంప్టెంగ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.
కేతిక అందాలకు ఫిదా అయిపోయిన నెటిజన్లు ఆమె పిక్స్‌పై లైకుల వర్షం కురిపిస్తూ కామెంట్లు మోత మోగిస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా కేతిక లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కేసేయండి.