తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్, యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్ లో కేతిక శర్మ ముందు ఉంటుంది. ఈ అమ్మడు డబ్స్మాష్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కానీ కేతిక శర్మకు మాత్రం కావాల్సినంత ఫేమ్ దక్కింది.

అనంతరం ఈ బ్యూటీ `లక్ష్య`, `రంగరంగ వైభవంగా` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ రెండు సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కేతిక శర్మకు ఆఫర్లు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా మరోసారి తన అందాలతో కేకలు పెట్టించింది. లైట్ కలర్ లెహంగా చోళీ ధరించిన కేతిక.. ఎగసిపడే ఎద అందాలు, నాభి సొగసులతో చెమటలు పట్టించే విధంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రకారు కేతిక అందాలకు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పిక్స్ పై లైకులు వర్షం కురిపిస్తున్నారు.

https://newsorbit.com/entertainment-news/ketika-sharma-get-big-offer-from-pawan-kalyan-movie.html