పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కేతిక శర్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `రొమాంటిక్` సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. కేతిక శర్మకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది.
తొలి సినిమాలోనే గ్లామర్ షోతో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత `లక్ష్య` సినిమాతో అందరినీ పలకరించింది. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇప్పుడు మూడో ప్రయత్నంగా `రంగ రంగ వైభవంగా`తో అలరించేందుకు రెడీ అవుతోంది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, గిరీశాయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సెప్టెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. కేతిక శర్మ ముందు నుంచీ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది.
ముఖ్యంగా హాట్ హాట్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తాజాగా కూడా లెహంగా చోలీ ధరించి ఎగసిపడే ఎద అందాలతో రొమాంటిక్‌గా పోజులు ఇస్తూ కుర్రకారు గుండెల్లో మంట పెట్టేసింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించి పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి లేటెందుకు కేతిక శర్మ లేటెస్ట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.