Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమై వారం రోజులు గడిచింది. మొత్తం 14 మంది హౌస్ లోకి ఎంటర్ అవ్వగా మొదటి వారం నామినేషన్ లో ఎనిమిది మంది ఉండగా.. ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్.. మొదటివారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా నాగార్జున ప్రకటించారు. పెద్దగా తెలుగు రాకపోవడంతో పాటు హౌస్ లో చలాకీగా యాక్టివ్ గా ఉండకపోవడం ఆమె ఆటకు మైనస్ అయింది. అంతేకాదు మొదటి వారంలోనే మిగతా కంటెస్టెంట్లతో సరిగ్గా కలవలేకపోయింది. దీంతో ఆమె ఆడియన్స్ ఓట్లు రాబట్టలేక… ఆదివారం ఎపిసోడ్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన కిరణ్ రాథోడ్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రిన్స్ యావర్ చాలా మంచి కంటెస్టెంట్ అని పొగడటం జరిగింది. హౌస్ లో సిదా కంటెస్టెంట్స్ ఎవరు..? ఉల్టా కంటెస్టెంట్స్ ఎవరో.. అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే షకీలా కూడా అందరికంటే చాలా మంచి వ్యక్తి అని తెలిపింది. హౌస్ లో షకీలా తర్వాత నటుడు శివాజీ తోనే ఎక్కువగా కనెక్ట్ అయినట్లు కిరణ్ చెప్పుకొచ్చింది. శివాజీ చాలా మంచివాడని..ఆయన సీదా కంటెస్టెంట్ అని పేర్కొంది. శుభశ్రీ కూడా సీదా కంటెస్టెంట్ అని తెలిపింది.
ఇంకా హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ ప్రశాంత్, రతిక, తేజ, శోభాలు ఉల్టా కంటెస్టెంట్స్ అని తెలిపింది. ప్రశాంత్ మొదటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని కామెంట్ చేసింది. హౌస్ లో ప్రశాంత్ అతి చేస్తున్నట్లు వెళ్తూ వెళ్తూ అతని పరువు తీసేటట్లు కామెంట్లు చేయడం జరిగింది. రతిక కూడా ఓవర్ కాన్ఫిడెన్స్… యాటిట్యూడ్ చూపిస్తుందని స్పష్టం చేసింది. ఇక శోభా శెట్టి మొదటి నుంచి ఉల్టా కంటెస్టెంట్ లానే కనిపిస్తుంది అని తెలిపింది. అలాగే తేజ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని కచ్చితంగా కిరణ్ రాథోడ్ చెప్పుకోచ్చింది.