Krishna Mukunda Murari: ముకుందా నందిని దగ్గరకు వెళ్తుంది. సిద్దు ఎక్కడ సిద్దు వెళ్లిపోయాడా వీళ్ళందరూ పంపించేశారా అని సిద్దు గురించి మాట్లాడుతున్న మాటలను ముకుందా వింటుంది. ఇక అదే విషయాన్ని భవాని దగ్గరకు వచ్చి చెబుతుంది. అత్తయ్య అసలు ఎవరు ఈ సిద్దు అని భవానిని ముకుందా అడుగుతుంది.
మరోవైపు గౌతమ్ సార్ మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నానని నందిని విషయంలో ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ఏడుస్తూ చెబుతుంది కృష్ణ మురారి కి.. ఇక మురారి కి చెప్పి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది ఏం కాదు అంతా సెట్ అవుతుంది అని మురారి తనకు భరోసా ఇస్తాడు.
ఇక ఉదయం లేచి నందు దగ్గరకు వెళుతుంది. కృష్ణ అప్పుడే నువ్వు బైక్ మీద వెళ్తావా ఆటోలో వస్తావా అని అడగగా బైక్ మీద వచ్చింది. సిద్దు అన్నట్టుగా చెబుతుంది నందు. సిద్దు మనం వెళ్ళిన హాస్పిటల్ లో ఉన్నాడు అని నందిని చెబుతుంది నన్ను నీతో పాటు హాస్పటల్కి తీసుకువెళ్ళు అని నందిని అడుగుతుంది. నిన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకువెళ్తే ఇంట్లో అందరూ అరుస్తారు కదా అని కృష్ణ అనగానే.. అవును ఒకసారి సిద్దు నేను బయట కనిపించినప్పుడు బాబాయి వాళ్ళు తనని అరిచారు అని కూడా నందిని గుర్తు చేసుకుని కృష్ణకు చెబుతుంది.
కృష్ణ గబా గబా హాస్పిటల్ కి వెళ్తుండగా వాళ్ళ అత్తయ్య రేవతి పిలిచి కృష్ణకు ధైర్యం చెబుతుంది. నీకు ఈ ఇంట్లో ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ అమ్మగా నేను నీకు తోడుంటానని నీ ప్రతి బాధని నాతో పంచుకోమని సలహా ఇస్తుంది రేవతి.. నందిని విషయంలో నువ్వు చేస్తున్నది కరెక్టే పార్టీ ఆడదానిగా నీకు అండగా ఉంటాను అని రేవతి మనసులో అనుకుంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో ఏంటి కృష్ణ ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా అని ముకుందా అడగగానే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ చూపించాల్సిన ఆధారాలు నా దగ్గర లేవు. అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా.. పెద్ద అత్తయ్యని క్షమించమని అడగమని రేవతి కృష్ణకు సలహా ఇస్తుంది. క్షమాబిక్ష నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని కృష్ణ అంటుంది. ఇక భవాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.