Krishna Mukunda Murari: కృష్ణ మురారిలను భవాని కిందకి పిలిపిస్తుంది. అందరూ వచ్చిన తర్వాత నందిని మనందరం కలిసి గ్రూప్ ఫోటో దిగలేదు. ఒక్క గ్రూప్ ఫోటో కూడా లేదు అంటే అందుకే కదా అందరినీ పిలిపించాను అని భవాని అంటుంది. అందరూ ఉన్నారు కదా ఒకసారి చూడండి. మనందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని భవాని అంటుంది. ఈ గ్రూప్ ఫోటో చూసినప్పుడల్లా నేను అందరికీ గుర్తుకు వస్తాను నేను కనిపించకుండా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని కృష్ణ అనుకుంటుంది. నెమ్మదిగా అక్కడ నుంచి తప్పించుకుని పక్కకు వెళ్ళిపోతుంది. మధు కృష్ణ లేదని అందరికీ గుర్తు చేస్తాడు రేవతి వెళ్లి కృష్ణని తీసుకువస్తుంది. మొత్తానికి అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు. ఆ తర్వాత కపుల్స్ ఫోటో దిగుతామని అనగానే కృష్ణ ఆ ఫోటోలో ఉండకూడదని మళ్లీ ఎస్కేప్ అయిపోతుంది.

Krishna Mukunda Murari: ముకుంద గుచ్చిన నల్లపూసలు కృష్ణ మెడలో వేసిన మురారి.. సూపర్ ట్విస్ట్..
కృష్ణ తన గదిలోకి వెళ్లి కూర్చుని వాళ్ళ నాన్న ఫోటో తీసి మీ ఫోటో ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండాలనుకున్నాను నాన్న. కానీ మీ ఫోటో ఇక్కడి నుంచి తీసుకు వెళ్లాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నా నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. నాకు ఏసీబీ సార్ ఉన్నారన్న ధైర్యం ఉంది. కానీ ఇప్పుడు అది లేదు. మీరు ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కూడా ఎంత గొప్పదో అని వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ కృష్ణ బాధపడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
ముకుంద దగ్గరకు వచ్చి అలేఖ్య వాళ్ళిద్దరి పెళ్లి జరగకుండా ఆపేస్తానన్నావు వాళ్ళ అగ్రిమెంట్ మ్యారేజ్ ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తానన్నావు ఏది జరగలేదు అని ముకుందని అలేఖ్య నిలదీస్తుంది. నాకెందుకో నీ ప్రేమ నువ్వు ఎప్పటికీ గెలవలేవనిపిస్తుంది అని అలేఖ్య ముకుందతో అంటుంది. ఆ మాటకు అలేఖ్య అని ముకుంద పెద్దగా అరుస్తుంది. నా ప్రేమ గురించి నీకేం తెలుసు అని ఓడిపోతుంది అని అంటున్నావు. నా ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని ముకుందా అంటుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. కానీ అక్కడ పెళ్లి జరిగింది కదా అని అలేఖ్య అంటుంది. అది వాళ్ళిద్దరూ ఇష్టపడ్డి చేసుకోలేదని మండపంలో వాళ్ళిద్దర్నీ చూస్తే నీకు అర్థం కాలేదా అని ముకుందా అంటుంది. అనిపించింది అని అలేఖ్య అంటుంది. ఇప్పుడు చెప్పు నా ప్రేమ గెలుస్తుందా ఓడిపోతుందా అని ముకుందా అడుగుతుంది. గెలుస్తుంది ముకుందా అని అలేఖ్య అంటుంది. ఇంకోసారి నా ప్రేమ ఓడిపోతుంది అంటే అసలు ఊరుకోను వెళ్ళు అని అలేఖ్యకి ముకుందా వార్నింగ్ ఇస్తుంది.

కృష్ణ బాధపడుతూ తన బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే తన బట్టల్లో ఉన్న కృష్ణుడు బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ చూస్తూ.. ఏంటి ఏసిపి సార్ నేను మీకు నచ్చలేదా అని ఆ బొమ్మను చూస్తూ బాధపడుతుంది. కృష్ణ ఆ బొమ్మని చూస్తూ ఉండగా మురారి గదిలోకి వస్తాడు ఇంకా పది రోజులు ఉంది కదా కృష్ణ ఇప్పుడే సర్దుకోవడం ఎందుకు అని మురారి అంటాడు. ఇది కూడా నల్లబడింది కృష్ణ అని ఆ కృష్ణుడి బొమ్మ చూపిస్తూ మురారి అంటాడు. చూశారా ఎసిపి సర్ ఈ బొమ్మ కూడా నన్ను వెళ్ళమంటుంది అని కృష్ణ అంటుంది.
మీకు అసలు విషయం చెప్పలేదు కదా ఏసీబీ సార్. ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ లో విష జ్వరాలు వచ్చాయి అంట. నన్ను అక్కడికి రమ్మని నాకు కాల్ వచ్చింది. నేను వెళ్లాలనుకుంటున్నాను ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది. ఏసీబీ సార్ మిమ్మల్ని అని కృష్ణ పిలుస్తుంది. రావడానికి అవకాశం లేదు. అప్పటికి మన అగ్రిమెంట్ పూర్తిగా అవుతుంది అని కృష్ణ అంటుంది. ఏంటి కోడలిగా రావాలా కుదరదు కదా అని కృష్ణ అంటుంది. మీ భార్యగా రావాలా అది ఎలాగో కుదరదు. ఇంకా ఈ ఇంటి తో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో సంబంధం తెగిపోయింది ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది. ఆ మాటకు మురారి మంచం మీద మౌనంగా ఉండిపోతాడు

.
రేపటి ఎపిసోడ్ లో కృష్ణ ముకుంద దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ముకుంద ఇంకా ఎప్పుడూ తిరిగి రాను అని అంటుంది ఆ మాటకి ముకుందా మనసులో సంతోషిస్తుంది. వెళ్లడం సరే కానీ తిరిగి రాకపోవడం ఏంటి అని ముకుందా అడుగుతుంది ఈ ఇంట్లో ఏ స్థానం ఉందని రావాలి.. మురారి భార్యవి ఏంటి చూడనా కోడలవి పెద్దత్తయ్య నిన్ను ఎంత బాగా చూసుకుంటారు.. ఏ సి పి సార్ మనసులో నేను లేనప్పుడు అవన్నీ నాకు ఉన్నా లేనట్టే కదా ముకుందా అని కృష్ణ బాధపడుతుంది. ఆయన భార్యని నేను ఎలా అవుతాను ముకుందా.. ఎలా ఈ ఇంటి కోడలిగా బాధ్యత తీసుకొని అని ముకుందని అడుగుతుంది కృష్ణ.