Krishna Mukunda Murari: రేవతి ఏదో ఆలోచిస్తూ ఉండగా భవాని తనని పిలుస్తుంది. కృష్ణ నిజంగా మురారి కి దూరమవుతుందా అని ఆలోచిస్తుంది. అంతలో కృష్ణ కిందకి దిగి వస్తుంది. పెద్ద అత్తయ్య అంటూ ఫోన్లో ఒక మెసేజ్ చూయిస్తుంది. ఆ మెసేజ్ చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఏమైంది అక్క అందులో ఏముంది త్వరగా చెప్పు అని రేవతి కంగారు పడుతూ ఉంటుంది. కృష్ణకి మొన్న అవార్డు వచ్చింది కదా తన సేవలు గుర్తించి ఈ చుట్టుపక్కల ఒక ఊర్లో విష జ్వరాలు వచ్చాయి. ఆ విష జ్వరాలకు ట్రీట్మెంట్ కోసం కృష్ణ హెల్ప్ అడుగుతున్నారు అని తను అక్కడికి వెళ్తుంది అని భవాని చెబుతుంది.

Krishna Mukunda Murari: ఆ ప్రశ్నలతో ముకుందని నిలదీసిన కృష్ణ.. తన ప్రేమ ఓడిపోతుందా.!?
కృష్ణ తన గదిలోకి వెళ్తూ ఉండగా ముకుంద కృష్ణని పిలుస్తుంది నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెబుతుంది ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నన్ను చూసుకుంటున్నట్టే అనిపిస్తుంది. నువ్వు గతంలో ప్రేమించిన వాళ్ళని ఇప్పుడు మర్చిపోవడం మంచిది ముకుందా అని కృష్ణ అంటుంది. ఆలోచనలను మర్చిపోవచ్చు కృష్ణ కానీ జ్ఞాపకాలను మర్చిపోలేం. అవి పుట్టుమచ్చలు లాంటివి జీవితాంతం మనతోనే ఉంటాయని ముకుందా అంటుంది. కొన్ని నిజాలు అవతలి వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కాదు కృష్ణ అనుభవంలోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది అని ముకుందా తన బాధను వ్యక్తపరుస్తుంది. నాకు మా అమ్మానాన్నల జ్ఞాపకాలు బోలెడన్ని అని కృష్ణ అంటుంది. ముకుందా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని కృష్ణ అంటుంది.

Brahmamudi 9 ఆగస్ట్ 170 ఎపిసోడ్: రాహుల్ రుద్రాణి ప్లాన్ చిక్కుకున్న కావ్య.. రాజ్ కోపానికి బలికానుందా.!?
ఏంటి కృష్ణ నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అంటుంది ముకుంద. నేను వెళ్ళిపోతున్నాను ముకుంద, ఇంకా ఎప్పుడూ తిరిగి రాను అని అంటుంది. అదేంటి కృష్ణ నువ్వు క్యాంప్ కే కదా వెళ్తుంది. మళ్ళీ వస్తావు కదా అని ముకుంద అంటుంది. ఆ మాటకి ముకుందా మనసులో సంతోషిస్తుంది. వెళ్లడం సరే కానీ తిరిగి రాకపోవడం ఏంటి అని ముకుందా అడుగుతుంది. ఈ ఇంట్లో ఏ స్థానం ఉందని రావాలి.. మురారి భార్యవి ఏంటి చూడనా కోడలవి పెద్దత్తయ్య నిన్ను ఎంత బాగా చూసుకుంటారు.. ఏ సి పి సార్ మనసులో నేను లేనప్పుడు అవన్నీ నాకు ఉన్నా లేనట్టే కదా ముకుందా అని కృష్ణ బాధపడుతుంది. ఆయన భార్యని నేను ఎలా అవుతాను ముకుందా.. ఎలా ఈ ఇంటి కోడలిగా బాధ్యత తీసుకొని అని ముకుందని అడుగుతుంది కృష్ణ మనసులో బాధపడుతుంది. ముకుంద నేను నా బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను బాధ్యతలను అప్పగిస్తుంది. థ్యాంక్యూ కృష్ణ అని ముకుంద అంటుంది. నువ్వు అప్పగించింది నీ బాధ్యత కాదు నా ప్రేమనీ అని ముకుంద మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
కృష్ణ తన గదిలో బట్టల సర్దుకుంటూ ఉంటుంది అవి బ్యాగ్ లో సరిపడక జిప్ వేయడం కష్టమవుతుంది. అంతలో మురారి అక్కడికి వస్తె కృష్ణ జిప్ వేయెలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. మురారి
నన్ను హెల్ప్ అడగాలని అనిపించలేదా అని అంటే మీరు హెల్ప్ చేయాలని మీకు అనిపించలేదా అని కృష్ణ అంటుంది. సరే ఇద్దరం కలిసి జిప్ వెళ్దామని ఇద్దరూ కలిసి బ్యాగ్ లో బట్టలు అడ్జస్ట్ చేసి జిప్ వేస్తారు. అప్పుడు ఒకరి తల ఒకరికి ఢీ కొట్టుకుంటుంది. అప్పుడే మురారి కృష్ణ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని మరోసారి ఢీకొడతాడు.

ఇక వెంటనే పక్కకు వెళ్ళగానే కృష్ణ ఏసీబీ సార్ నేను ఇక్కడే ఉంటే నా ఫోటోలు చూస్తూ బాధపడతారు అవి కూడా ఉండకూడదు అని తీసేస్తుంది. కృష్ణ తనకు సంబంధించినవి ఏవి నా దగ్గర ఉండకూడదు అనుకుంటుంది .అలాంటప్పుడు తను ఇచ్చిన గిఫ్ట్ కూడా నాకెందుకు అని చెప్పి కృష్ణ ఎంతో ప్రేమగా ఇచ్చిన కృష్ణుడు బొమ్మను కూడా మురారి తిరిగి తనకు ఇచ్చేస్తాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.