NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని ప్రేమిస్తున్నట్టు కృష్ణకు చెప్పిన ముకుంద.. హోమమాపడానికి మరో ప్లాన్..

Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Advertisements
Share

Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 182 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 183 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Advertisements
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ,మురారి ఇద్దరువిడిపోకుండా ఉండడానికి రేవతి హోమం చేయించాలనుకుంటుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తుంది. కృష్ణ మురారి ఇద్దరూ ఒకరి మనసులో ఒకరి ప్రేమని దాచుకొని, పైకి మాత్రం హోమం వద్దు అంటున్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటారు. ముకుందా అసలు హోమం ఎందుకు చేర్పిస్తున్నారా అని అనుకుంటుంది.

Advertisements
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights

Krishna Mukunda Murari : కృష్ణ మురారి ల మీద ముకుంద కోపం..కృష్ణ కు నిజం చెప్పిన ముకుంద…

ఈరోజు ఎపిసోడ్ లో, ప్రసాదు రేవతి దగ్గరికి వచ్చి, వదిన నిన్ను ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోరు కదా అంటాడు. రేవతి చెప్పు అని అడుగుతుంది. ప్రసాదు ఈ హోమం ఇంత అర్జెంటుగా ఎందుకు చేయిస్తున్నారు. ఎవరైనా భార్యాభర్తలు విడిపోయేటప్పుడు చేయిస్తారు అని సుమలత చెప్పింది అని అంటాడు. రేవతి మనసులో ఇప్పుడు కృష్ణ మురారిల మధ్య గొడవ గురించి చెప్తే, చాలా పెద్ద సమస్య వస్తుంది అని మనసులో అనుకొని, అదేం లేదు ప్రసాదు, కృష్ణా మురారి ల పెళ్లి అయ్యి సంవత్సరం అవుతుంది కదా అందుకని చేయిస్తున్నాను అని అంటుంది. ఈ లోపు మధు వచ్చి నాన్న నా గురించి నువ్వు వేరే ఏదైనా ఇలా ఆలోచించావా అని అంటాడు. నీ గురించి ఆలోచించడానికి ఏముంటుంది రా అనవసరంగా, బుర్ర పాడు చేసుకోవడం తప్ప అని అంటాడు. ఇంట్లో నేను నెంబర్ వన్ గా ఎదుగుతుంటే నువ్వు డిలీట్ బర్డ్ లాగా ఇంటికి పరిమితం అయ్యావని ఆలోచిస్తున్నావా అని అంటాడు. అంతలేదు అని ప్రసాద్ అంటాడు.

Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights

Nuvvu Nenu Prema: ఆండల్ ని దెబ్బ కొట్టడానికి కుచల ప్లాన్.. విక్కీ పద్మావతి ల డాన్స్…

మురారి ఆలోచన..

మురారి ఒక్కడే,ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంకి ముకుంద దూరం నుంచి మురారిని గమనిస్తుంటుంది.మురారి అమ్మమ్మ కోసం హోమం చేయిస్తుంది. మొహం పాడవకుండా ఉండాలంటే నిష్టగా నేను కృష్ణ ఇద్దరం, జరిపించాలి. నిజంగానే హోమం బాగా జరిగితే మేము నిజం భార్యాభర్తలాగా శాశ్వతంగా ఉంటాము అని అనుకుంటాడు. దూరం నుండి ముకుంద, మీరిద్దరూ హోమం చేయడం, నీకు ఇష్టం లేదన్న విషయం నేను ఇంకోసారి స్పష్టంగా నీకు అర్థమయ్యేలా చేస్తాను అని అనుకుంటుంది. అదే టైంకి కృష్ణ అక్కడికి వచ్చి, ఇంత మంచి మనిషిని భర్తగా పొందే అదృష్టం జీవితాంతం నాకు లేదు అని అనుకుంటుంది. ఈ తింగరి పిల్లని ఆప్యాయంగా పలకరించేవాళ్లు నాకు తెలిసి భూమి మీద మీరు తప్ప ఇంకెవరూ లేరు ఏసీబీ సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది.మురారి దగ్గరికి వస్తుంది. అదే టైంకి ముకుంద కూడా కృష్ణుని చూసుకోకుండా మురారి దగ్గరికి వస్తుంది.

Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights

ముకుంద మనసులో మాట…

హరే కృష్ణ వచ్చినట్టు నేను గమనించలేదే, సరే వచ్చిందిగా ఈసారి అట్నుంచి నరుకు వద్దాం అని ముకుందా మాట్లాడడం మొదలు పెడుతుంది. నీతో ఒక మాట మాట్లాడొచ్చా కృష్ణ అంటుంది. ఏంటో చెప్పు కృష్ణ అని అంటాడు ఏదో మాట్లాడాలి అన్నావ్ కదా, ముందు నువ్వు చెప్పు కృష్ణ అంటాడు మురారి. ముకుంద ఏదో మాట్లాడుతా అంటుంది కదా ముందు తననే చెప్పనివ్వండి అంటుంది కృష్ణ. అయితే మీ ఇద్దరి మాట్లాడుకోండి నేను వెళ్తున్నాను అంటాడు. మురారి ఆగు మన మధ్య దాపరికాలు లేవు ముగ్గురం కలిసే మాట్లాడుకుందాం అంటుంది ముకుంద. ఏమంటావ్ కృష్ణ అంటుంది సరే చెప్పండి అంటుంది. ఏసీబీ సార్ కి మాట్లాడడం రాదు కాబట్టి వెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పుడెలా అని మనసులో మురారి అనుకుంటూ ఉంటాడు. ఏంటి ముకుందా అలా చూస్తున్నావు ఏసీబీ సార్ కి మాట్లాడటం రాదు అన్నానని, ఒక్కోసారి చిన్న పిల్లల మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అలా అన్నానులే నువ్వేంటో చెప్పు అని అంటుంది. ముకుందా, నేనొక విషయం అడిగితే నువ్వేం అనుకోవు కదా అంటుంది. మురారి సార్ చెప్పేయండి నేను తింగరి దాన్ని అసలేం పట్టించుకోను అని ముకుందకు చెప్పండి. ఆనీ కృష్ణ అంటుంది. నేను ఏమీ అనుకోను నువ్వు అడగాల్సింది అడిగి అంటుంది. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని అంటుంది ముకుంద. అదే పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని అంటుంది. ప్రేమించలేదు కానీ ఒక లవ్ స్టోరీ మాత్రం ఉంది. మా ఏసీబీ సార్ కి కూడా తెలుసు. హమ్మయ్య అగ్రిమెంట్ అయిన తర్వాత కృష్ణ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది మురారి నా దగ్గరకు వస్తాడు అని మనసులో అనుకుంటుంది. ముకుంద లవ్ స్టోరీ అంటే త్యాగాలి ఫైట్లు అవన్నీ లేవు, కానీ ఆ లవ్ స్టోరీ నా జీవితాన్ని మార్చేసింది అని అంటుంది కృష్ణ. నీకు అర్థమయ్యేలా చెప్తాను ముకుంద అని, కృష్ణ ని అంతకుముందు, ఒక రౌడీ ప్రేమించడం ఆ తర్వాత గొడవపడడం ఇవ్వాలని, మురారి వాడిని చంపేయకపోవడం, తన తండ్రి దానికి, చనిపోవడం ఇట్లా అన్నీ మొత్తం జరిగిందంతా ముకుంద కి షాట్ లో చెప్పేస్తుంది.

Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights

Brahmamudi Serial జూన్ 13th 121 ఎపిసోడ్: స్వప్న ని కిడ్నాప్ చేసిన కామరాజు..సంబరాలు చేసుకుంటున్న రాహుల్ – రుద్రాణి

ముకుందా ప్రేమ విషయం కృష్ణకి చెప్పడం.

ఇప్పుడు దాకా నేను నా గతం మొత్తం చెప్పాను కదా ఇప్పుడు నువ్వు చెప్పు ముకుందా, పెళ్లికి ముందు ఆదర్శం చూడ్డానికి ముందు నువ్వు ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటావు కదా వాళ్ళు ఎవరో చెప్పు అని అడుగుతుంది కృష్ణ. ముకుందా మురారి వైపు చూస్తుంది. మురారి వద్దు అన్నట్టుగా చూస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిజం చెబుతుందా ఏంటి అని మురారి మనసులో అనుకుంటాడు. చెప్పు ముకుందా నువ్వు పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నావు కదా అని అంటుంది కృష్ణ. ముకుందా అవును నిజమే నువ్వు చెప్పింది అని అంటుంది. నిజం కదా ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు అని అడుగుతుంది. ఎక్కడుంటాడో చెప్పను కానీ ఎలా ఉంటాడో చెప్తాను అంటుంది ముకుందా. ఎలా ఉంటాడు అంటే అని మురారి వైపు చూపిస్తుంది. అంతే మురారి కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే కృష్ణ ఏసీబీ సార్ లా ఉంటాడా అని అంటుంది. ముకుందా అవును అన్నట్టుగా తలుపుతుంది. అవును ఇలానే ఉంటాడు ఇదే హైటు ఇదే కట్ అవుట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటాడు. ఇంకా నయం ఏసీపి సార్ అనలేదు. వేలెత్తి చూపంగానే భయపడ్డాను డైరీ అమ్మాయి ముకుందనేమోనని అనుకుంటుంది కృష్ణ. ముకుంద చేత ఏసిపి సార్ ని అడిగితే ఆ డైరీ అమ్మ విషయం కూడా తెలిసిపోతుంది అని అనుకుంటుంది. ముకుంద నాతో రా నీతో ఒక మాట చెప్పాలి అని అంటుంది. కృష్ణ ఎక్కడికి అని అంటాడు మురారి. ఇప్పుడే వస్తాను అని మురుకుందని తీసుకొని పక్కకు వెళుతుంది కృష్ణ. ఏమిటి ఇప్పుడు ముకుందా తో ఏం చెప్తుంది. మురారి అనుకుంటాడు. కృష్ణ ముకుందతో నాకు నువ్వు హెల్ప్ చెయ్యాలి అని అంటుంది, నావల్ల ఏ హెల్ప్ కచ్చితంగా చేస్తాను ఏంటో చెప్పు కృష్ణ అంటుంది ముకుంద. ఏమీ లేదు ఏసిపి సార్ ని ఇంతకుముందు పెళ్లికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని నువ్వు అడగాలి అని అంటుంది. మనిద్దరి ప్రేమ విషయాలు చెప్పాను కదా ఇప్పుడు తను ఏం చెప్తాడు అని అంటుంది. నువ్వు సూపర్ కృష్ణ నేను అడగాలనుకున్నదే నా చేత అడిగి ఇస్తున్నావు అని అంటుందిమనసులో ముకుంద.ఏంటి ముకుందా అడగవా అంటుంది కృష్ణ.కచ్చితంగా అడుగుతాను కదా అని అంటుంది.చాలా థాంక్స్ ముకుందా అంటుంది కృష్ణ.ఏసిపి సార్ మిమ్మల్ని ముఖం ఇప్పుడు ఒకటి అడుగుతుంది దానికి మీరు నిజంగా క్లారిటీగా చెప్పండి అని అంటుంది. అంతేకానీ ముక్కోటి అమ్మ లాగా చెప్పమాకండి. నువ్వు అడుగు ముకుందా అంటుంది.
కృష్ణముందే మురారి ప్రేమ గురించి అడిగిన ముకుంద..

Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights

కృష్ణ అడగమన్నందుకు ముకుంద మురారి వద్దకు వెళ్లి మురారి నువ్వు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా అని అంటుంది. మురారి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తాడు. ముకుందా దొరికిపోయావు మురారి ఇప్పుడు నిజం చెప్తావో లేదో చూస్తాను అని అనుకుంటుంది. కృష్ణ చెప్పండి ఏసీబీ సార్ నిజమే చెప్పండి అని అంటుంది. ఇప్పుడు ఆ ధైర్యం అమ్మ ఎవరో తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో అక్కడికి రేవతి వచ్చి ఇక్కడ ముగ్గురు ఏం చేస్తున్నారని పెద్దగా అరుస్తుంది. ముగ్గురు ఒకసారి షాక్అవుతారు. లోపలికి వెళ్ళండి ఏంటి ఇక్కడ ముగ్గురు అని అంటుంది. మురారి దొరికిందే చాన్స్ అనుకోని లోపలికి వెళ్ళిపోతాడు. మంచి ఛాన్స్ మిస్ అయింది అని కృష్ణ వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
Krishna Mukunda Murari 13 June 2023 today 183 episode highlights
ముకుందా ఆలోచన..

రూమ్ లోకి వచ్చి గతంలో మురారితో గడిపిన క్షణాలన్నిటిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కృష్ణ మురారి లని ఒకటి చేయాలని రేవతి అత్తయ్య చూస్తుంది. అత్తయ్యకి నిజం చెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడుతుంటుంది. ఇప్పుడు ఎలా, మా ప్రేమ ఇలా విడిపోతుందని ఇలా జరుగుతుందో నేనెప్పుడూ ఊహించలేదు. వాళ్ళ మనసులో మాత్రంలేని ప్రేమని పుట్టించలేదు కదా అత్తయ్య.నా ప్రేమ గురించి మురారి మనసు గురించి రేవతి అత్తయ్యకి తెలియదు. మురారి మనసులో నేను తప్ప ఎవరూ లేరు అని ముకుందా అనుకుంటూ ఉంటుంది. ఏదో గురువుగారికి ఇచ్చిన మాట కోసం కృష్ణ మెడలో తాళి కట్టాడు కానీ లేదంటే నన్ను దూరం చేసుకోడు. అందుకే ఆ నలుగురిలో కృష్ణతో అలా ఉంటున్నాడు అంతే తప్ప, వాళ్ల మధ్య ఏ బంధం లేదని,నాతో చెప్పాడు కదా.కృష్ణ తో పూజలో కూర్చోడానికి మురారి కచ్చితంగా ఒప్పుకోడు అని అనుకుంటుంది.

కృష్ణ మీద నాకు రోజు రోజుకి పెరుగుతున్న ప్రేమ. కనుమూసిన కృష్ణ కన్ను తెరిచిన కృష్ణ అని మురారి డైరీలో రాసుకుంటూ ఉంటాడు. కృష్ణ దూరమైతే మురారి పరిస్థితి ఏమిటి అని డైరీలో రాస్తాడు. నిజం చెప్తున్నాను డైరీలో అబద్ధం రాయకూడదు కాబట్టి నిజంగా కృష్ణ దూరమైతే నేను బతకలేను. కృష్ణ నాతో కలిసి లేకపోయినా ఎదురుగా ఉన్నందువల్ల నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు కృష్ణ దూరం అవుతుందేమో అన్న బాధ ఎక్కువగా ఉంది. కృష్ణ వైసీపీ సార్ మోహన్ లో నేను ఆనందం చూడాలంటే ఈ హోమం ఎలా అయినా ఆపాలి అనుకుంటుంది. రేవతి దగ్గరికి వెళ్లి అత్తయ్య అని అంటుంది. రేవతి వెంటనే కనిపెట్టేసి ఇది హోమో ఆపడానికే వచ్చింది చెప్తా దీని సంగతి అనుకుంటుంది. కృష్ణ ఏంటి ఇంకా చీర మార్చుకోలేదు అవతల పంతులుగారు కూడా బయలుదేరారు కానీ అని అంటుంది. కృష్ణ ఏమి మాట్లాడకుండా మొత్తం రేవతి నే మాట్లాడేసి, అసలు ఇంతకు మురారి లేచాడా ఏంటి కృష్ణ. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంటే మీరేంటి నన్ను పట్టించుకోరు అని అంటుంది. ఏంటి అత్తయ్య నా మాట పట్టించుకోకుండా టైర్ మహాలక్ష్మి జాకెట్టు చీర పంతులుగారు అంటారు అని అంటుంది. అంటే నాకు ఒంట్లో బాలేదు అందుకని అంటుంది. నువ్వు డాక్టర్ వి కృష్ణా మర్చిపోయినట్టు ఉన్నావ్ అంటుంది రేవతి. అయ్యో మర్చిపోయానే అబద్ధం కూడా నేను చెప్పలేకపోయాను అనుకుంటుంది కృష్ణ. పోనీ టాబ్లెట్ నన్ను తెచ్చిమంటావా అంటుంది రేవతి. అత్తయ్య ఏంటి కామెడీ చేస్తారు నేను సీరియస్ గా మాట్లాడుతుంటే అంటుంది. నాకు వేడి పెడదాం అయ్యా ఒంటి మీద రాక్షసి వస్తున్నాయి అందుకని హోమం వద్దు అనుకుంటున్నా అంటుంది. రేవతి అయ్యో అవునా, గంటల తరబడి స్టవ్ దగ్గర నిలబడి వంట ఎలా చేస్తున్నావు అంటుంది. తినాలి ఈ మాట నాకు ఎందుకు చెప్పలేదు అంటు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అంటుంది. వెళ్లి హోమానికి చీర కట్టుకొని రెడీ అయ్యా మా కృష్ణ ఎంత మంచిదో నేను చెప్పింది వింటుంది గా అంటుందిరేవతి.వెళ్లి నీ భర్తకు కూడా చెప్పమ్మా ఇలాంటి ఎదవ వేషాలు వేస్తే ఇద్దరు కలిపి కాలేరు అని కొడతాను అని అంటుంది. ఏంటి ఇంత మర్యాదగా చెప్పినా అర్థం కావట్లేదా అని అంటుంది. మీరు కూడా పెద్ద తైలా తయారయ్యారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను మిమ్మల్ని ఎలా వండుతాను మీ ఇద్దరినీ, కలిపేంతవరకీ నేను ఇలానే ఉంటాను అనుకుంటుంది రేవతి.
కృష్ణ తో ఒక అరగంట మాట్లాడకపోయినా కనిపించకపోయినా నాకు ఏదోలా ఉంటుంది అని డైరీలో రాసుకుంటూ ఉంటాడు మురారి అదే టైంకి కృష్ణ లోపలికి వస్తుంది. ఏంటి కృష్ణ అలా ఉన్నావు అమ్మ ఏమన్నా ఉందా అంటాడు మురారి. నన్ను అడగమంటావా అంటాడు. అత్తయ్య మనిద్దరినీ తిట్టకుండా వార్నింగ్ ఇచ్చి పంపించింది. ఎందుకు తిట్టింది అని అంటాడు మురారి. మామ వద్దని అందుకు తిట్టింది అంటుంది కృష్ణ. ఏసిపి సార్ మనసులో ఏముందో ఇప్పుడు తెలిసిపోతుంది. పూచేయడానికి నాకేం ప్రాబ్లం లేకపోయినా మీకోసం నాకు ఇష్టం లేదని చెప్పాను అంతే, తిట్టింది తిట్టకుండా తిట్టింది లేకపోతే అత్తయ్య. అవునా అంటాడు మురారి. ఏంటి తింగరిదానికి ఇలానే కావాలి అనుకుంటున్నారా అంటుంది కృష్ణ. నాకు డౌట్ కృష్ణ నేను ఒకటి అడగాలి అంటాడు మురారి. అడుగు అంటుంది కృష్ణ. ఇంతకుముందు నిన్ను ఎవరైనా కోపంలో అందంగా ఉంటావని చెప్పారా ఏంటి. అందుకే అలా అంటున్నావా అంటాడు.

రేపటి ఎపిసోడ్ లో, మురారి కృష్ణ ఇద్దరి హోమం చేస్తూ ఉంటారు. ముకుందని చూసి మురారి ఇక్కడ ముకుంద లేకపోతే మనస్పూర్తిగా చేసే వాడిని ఇంకా అని అనుకుంటాడు. ముకుందా వాళ్ళిద్దర్నీ చూసి, బాధపడుతూ ఉంటుంది. పంతులుగారు ఇదే చివరి ఘట్టం నాయన ఈ దీంతో మీరు ఈ ప్రమాణం చేసి భార్యాభర్తలుగా మనసులో ఉన్న అపోహలు అన్ని తొలగిపోయి జీవితాంతం సంతోషంగా ఉంటారు అని అంటారు. వెంటనే ముకుందా కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది.. మురారి వెంటనే లేవబోతాడు.. చూడాలి రేపటి ఎపిసోడ్లో ముకుంద ప్లాన్ ఫలిస్తుందా లేదా…


Share
Advertisements

Related posts

MCA Remake: నాని మూవీతో బాలీవుడ్‌కు మ‌రో పెద్ద దెబ్బ ప‌డిందిగా!

kavya N

Brahmamudi may 29th Episode: కావ్యను కిడ్నాప్ చేయించిన రాహుల్.. నిశ్చితార్థం ఆపేయడానికి స్వప్న మరో ప్లాన్…

bharani jella

Unstoppable 2: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్.. కొత్త ప్రోమో..!!

sekhar