Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 194ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 195 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణ మురారి వంట చేస్తూ,తన ప్రేమని కృష్ణకు తెలపాలని,మురారి ప్రయత్నిస్తూ ఉంటాడు.మురారి ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది. ఇవన్నీ ముకుంద దూరం నుండి గమనిస్తూ, మురారిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని, తనకి ఒక కొరియర్ ని పార్సిల్ చేస్తుంది. కొరియర్ చూసి షాక్ అయినా మురారి. అది కృష్ణ కంట పడకుండా దాచాలనుకుంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో, కృష్ణ,మురారి దగ్గరకు వచ్చి,వెనక ఏముందో చూపించండి అని అంటుంది.ఏమీ లేదు కృష్ణ,చూడు అని అంటాడు. మురారి, ముకుంద పంపించిన ఫోటో లు తన వెనక దాచిపెడతాడు. కృష్ణముందు అవి బయట పడకూడదు అని అనుకుంటాడు.సరే ఎసిపి సర్ అన్నం తిందాం పదండి అని అంటుంది. సరే నువ్వు వెళ్లి కృష్ణ నేను వెనకే వస్తాను అని అంటాడు.వస్తానని రారేంటి అని అంటుంది కృష్ణ. నువ్వు వెళ్లి కృష్ణ నేను 2 మినిట్స్ లో వస్తా, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని అంటాడు. అక్కడ కూడా చేసుకోవచ్చు కదా, టూ మినిట్స్ కృష్ణ ప్లీజ్ అని అంటాడు. సరే నేను వెళ్లి విస్తరాకులు తీసుకొస్తాను మీరు రండి. అని వెళ్ళిపోతుంది కృష్ణ. మురారి వెంటనే తన వెనుక ఉన్న ఫోటోలు అన్నీ తీసి కవర్లో పెట్టి కృష్ణ కనపడకుండా దాచాలనుకుంటాడు.

ముకుంద, మురారి మీద కోపం..
ముకుందా మురారి డైలీ తీసి, అందులో కృష్ణ కోసం మురారి రాసిన మాటల గురించి చదువుతూ ఉంటుంది. కృష్ణ అల్లరి పిల్ల, తను లేకపోతే నువ్వు ఉండలేవా, తనని కావాలనుకుంటున్నావా, ఏంటి మురారి ఇదంతా,కృష్ణ చేసే వెకిలి చేష్టలన్నీ నీకు నచ్చాయా,అది పసితనమా,నన్ను ప్రేమించి నాకు మాట ఇచ్చి,ఇప్పుడు కృష్ణ ని ఎలా ప్రేమిస్తున్నావు మురారి. కృష్ణకి నువ్వు కాకపోతే ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారు. కానీ నేను అలా కాదు మురారి నిన్నే ప్రేమించాను.నువ్వే నా లోకం అనుకున్నాను. అసలు కృష్ణ నిన్ను ప్రేమించలేదు మురారి, నేను ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు, నిన్ను నువ్వు కూడా ప్రేమించలేవు.నువ్వు నన్ను వదులుకోవాలనుకున్న నేను నిన్ను వదలను, వదలలేను కూడా, నా ప్రేమ నాకు దక్కి తీరాల్సిందే అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ ప్రయత్నం విఫలం… అరవింద ని చూసి అల్లాడిన విక్కి..
కృష్ణ విస్తరాకుల కోసం బయటికి వెళ్తూ ఉండగా, ఒక రూమ్ ముందు చెప్పులు, చూస్తుంది.ఈ చెప్పులు ఎవరివి? అత్తయ్య ఇక్కడికి మేం మాత్రమే వస్తాం అని చెప్పింది కదా, మరి ఎవరు వచ్చారు ఇక్కడికి, మేమొచ్చానని తెలిసి ఎవరైనా వచ్చారా, అని రూమ్ ముందుకు వెళ్లి డోర్ కొడుతుంది. హలో ఎక్స్క్యూజ్మీ లోపల ఎవరున్నారు తలుపు తీయండి అని అంటుంది. ఇక లోపల ఉన్న ముకుంద ఒకసారి గా షాక్ అవుతుంది. ఈ టైం లో ఎవరు వచ్చారు కృష్ణ కానీ వచ్చిందా ఏంటి అని అనుకోని కంగారు పడుతూ ఉంటుంది.నా జాగ్రత్తలో నేనున్నాను కదా,కృష్ణ కి ఎలా తెలిసింది.చీకట్లో బానంగాని వేస్తుందా, ఇప్పుడేం చేయాలి అని, కంగారు పడుతూ ఉంటుంది.అయినా కృష్ణ కి నేను ఎందుకు భయపడాలి నిజం చెప్పేద్దాం, ఏదైతే అది అవుతుంది అని, డోర్ ఓపెన్ చేస్తుంది ముకుంద.

ముకుందని చూసి కృష్ణ షాక్..
లోపల ఉన్నది ముకుందే అని తెలిసి, కృష్ణ షాక్ అవుతుంది.నువ్వేంటి ముకుంద ఇక్కడ వున్నావ్ అని అడుగుతుంది. ముకుంద ఏమి సమాధానం చెప్పకుండా పెరట్లోకి వెళ్తుంది. ముకుందనే ఫాలో అవుతూ కృష్ణ కూడా వెళ్తుంది. అడుగుతుంది నిన్నే ముకుందా ఇక్కడికి వచ్చావ్ ఏంటి? ఏమి నేను ఇక్కడికి రాకూడదా అంటుంది. రాకూడదని కాదు ఇంత సడన్గా ఎందుకు అని, మురారి కోసమే వచ్చాను అంటుంది ముకుంద. అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది కృష్ణ.ఏసిపి సార్ రమ్మన్నారా నువ్వే వచ్చావా అని అడుగుతుంది కృష్ణ. కృష్ణ నేను నీకు ఇప్పుడు ఒక నిజం చెప్తాను అది నువ్వు ఎలా తీసుకుంటావో నీ ఇష్టం. కొంపతీసి ఆ డైరీ అమ్మాయి ముకుందే కాదు కదా అనుకుంటుంది కృష్ణ మనసులో,

మురారి ని ప్రేమిస్తున్నట్లు చెప్పిన ముకుంద..
నేను చెప్పే నిజాన్ని,నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో కృష్ణ,మొన్న నువ్వు నన్ను ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడిగావు కదా, అవును, అప్పుడు నేను మురారిని చూపించాను కదా, నువ్వు ప్రేమించిన అబ్బాయి ఏసీపీ సార్ లా ఉంటాడు అని చెప్పావు కదా అంటుంది కృష్ణ. నీది అమాయకత్వం అజ్ఞానము నాకు అర్థం కావట్లేదు కృష్ణ. ఏసీబీ సార్ లాంటి అబ్బాయిని ప్రేమిస్తే, ఏసీబీ సార్ ని ఎందుకు చూపిస్తాను. ఇప్పుడే కాదు కృష్ణ నీకు చాలా సార్లు చెప్పాను, కాకపోతే నీకు అర్థం కాలేదు. నేను మురారి ప్రేమిస్తున్నట్లు, నీకు చెప్పాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను. నువ్వు అర్థం చేసుకోలేదు.ఇవన్నీ విని కృష్ణ షాక్ అవుతుంది.. మురారి నా వాడు అని నీకు చెప్పాలని, డైనింగ్ టేబుల్ దగ్గర తన పక్కన కూర్చోవడం, తను ఆఫీస్ కి వెళ్తుంటే నేను ఎదురు రావడం, తను సెలెక్ట్ చేసిన చీరని నాది అని తీసుకోవడం.నేను నిర్దాక్షిణ్యంగా కారు దింపేసినప్పుడు కూడా నీకు అనుమానం రాలేదా, నువ్వు ఎంతసేపటికి మమ్మల్ని ఫ్రెండ్స్ గానే అనుకుంటున్నావ్, ఆ ఉద్దేశం లోనే చూస్తున్నావు. కృష్ణకి డైరీలో రాసిన ప్రతిమాట గుర్తొస్తూ ఉంటుంది. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అందులో రాసి ఉన్నది కృష్ణకి గుర్తొస్తుంది.ఎంత ఫ్రెండ్ అయినా తన భార్య ముందు, తన పక్కన కూర్చోవాలని అనుకోదు కదా కృష్ణ. తను బయటికి వెళ్తే తన ఫ్రెండుకి ఎదురు రావాలని అనుకోదు కదా, నువ్వే ఆలోచించు కృష్ణ,మురారి పక్కన నిన్నే కాదు నన్ను తప్ప ఎవ్వరిని ఊహించుకోలేను కృష్ణ అని అంటుంది ముకుంద. కృష్ణ కి బ్రెయిన్ ఒకసారిగా హాఫ్ అయినట్టు అయిపోతుంది. కృష్ణ కి ఏమీ అర్థం కాదు,ప్లీజ్ కృష్ణ నా ప్రియమైన అర్థం చేసుకో,నా జీవితాన్ని నాశనం చేయకు,ఇవన్నీ నీకు అర్థం అవ్వాలని చేశాను.

అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి కృష్ణకి చెప్పిన ముకుంద..
నేను మురారిని ఎంతగానో ప్రేమించాను. మా ప్రేమని అర్థం చేసుకో కృష్ణ. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని కూడా నాకు తెలుసు. మురారి ఏ నాతో చెప్పాడు. ఇద్దరి మధ్య ఇంతవరకు ఏమి జరగలేదు అని కూడా నాకు తెలుసు.తను డాక్టర్ అవ్వాలని ఇక్కడికి వచ్చింది, తన అగ్రిమెంట్ అయిపోగానే వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ తనతో చెప్పినట్టు ముకుంద చెబుతుంది.దయచేసి నువ్వు వీలైనంత తొందరగా మా జీవితంలో నుంచి వెళ్ళిపో కృష్ణ ప్లీజ్ అని దండం పెడుతుంది ముకుంద.కృష్ణకి,వాళ్ల నాన్న చనిపోయేటప్పుడు మురారి కి ఇచ్చి పెళ్లి చేసినది మొత్తం గుర్తుకు వస్తుంది. ముకుందతో, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది ముకుంద. నువ్వెలాగైతే ఏసీపీ సార్ ని ప్రేమించావు ఇప్పుడు నేను కూడా అలానే ప్రేమిస్తున్నాను.మురారి ముందు ప్రేమించింది నన్ను అని అంటుంది ముకుందా,అవన్నీ నాకు అనవసరం,ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళు చాలామంది వున్నారు. కానీ మేం అలా కాదు, ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని స్వచ్ఛంగా ఇప్పుడే ప్రేమించుకోవడం మొదలు పెట్టాం.
ముకుంద కి షాక్ ఇచ్చిన కృష్ణ..
ఎ సి పి సార్ ని నేను కూడా ప్రేమిస్తున్నాను ఇప్పుడు తనని వదిలిపెట్టి ఎలా వెళ్తాను. అయినా నువ్వు ఏ సిపి సార్ ని ప్రేమించి ఉంటే వేరే వాళ్ళని పెళ్లి ఎలా చేసుకున్నావు.ప్రేమ కోసం అమ్మని నాన్నని చివరికి తన ప్రాణాలను కూడా వదులుకున్న చాలామందిని చూశాను. చూస్తూనే ఉన్నాను కదా, అయినా ప్రేమించిన వాళ్ల కోసం ప్రేమని ఎవరైనా, వదిలేసుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారా, నేను నీలా కాదు, అగ్నిసాక్షిగా పెళ్లిచేసుకొని,అయినా మా నాన్నకి ఇచ్చిన చివరి కోరిక, ఏ సిపి సార్ ని పెళ్లి చేసుకోవడం.నేను ఏసీపి సార్ ని వదులుకోను.ఆయన నా వాడు,నువ్వే కాదు చివరికి, ఆ యముడే వచ్చి నీకు నీ ప్రాణాలు కావాలని భర్త కావాలా అని అడిగితే, నా బర్త కావాలని అంటాను. అంతే ఇదే ఫైనల్ మురారి సార్ ని నేను వదులుకోను.ఇంకెప్పుడూ నన్ను కన్విన్స్ చేయాలనుకోకు,ఆనీ కృష్ణ ముకుందితో చెబుతుంది. అది కాదు కృష్ణ నేను అసలు ఏ పరిస్థితుల్లో పెళ్లి పెళ్లి చేసుకున్నాను నీకు తెలియదు, అవన్నీ నాకు అనవసరం ముకుందా,ఈ తాళి ఎవరు కట్టారో తెలుసా,ఏసీపి సార్, మరి నీ మెడలో తాళి ఎవరు కట్టారు? ఇక నీకు అంత అర్థమైంది అనుకుంటా, నేను చెప్పాల్సిన పని లేదు కదా, ఇక నేను వస్తాను.అని కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నో అని పెద్దగా ముకుందా అరుస్తుంది. కలలో నుంచి బయటికి వస్తుంది. ఇప్పటిదాకా జరిగిందంతా ముకుందా కలగంటుంది. ఇంకా కృష్ణ డోర్ కొడుతూనే ఉంది ముకుంద తీయలేదు. తీస్తే ఏం జరుగుతుందో కలగన్నది.ఎంతసేపు డోర్ కొట్టిన ఎవరూ తీయబోయేటప్పటికి, లోపల ఎవరూ లేరన్న మాట, సరేలే అనుకోని కృష్ణ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతుంది.

కృష్ణ, భోజనం దగ్గర పూజ చేయడం మొదలు పెడుతుంది..
కృష్ణ మురారి ఇద్దరు భోజనం చేయడానికి, అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. మురారి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవచ్చు కదా కృష్ణ, మనం కట్టెలపై మీద వంట చేశాను కదా, ఇలా కింద కూర్చొని తింటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను పూజ మొదలు పెడతాను అని అంటుంది. పూజ ఏంటి కృష్ణ కొత్తగా అని అంటాడు మురారి, అంటే మనం ఫస్ట్ టైం ఇలా ఏర్పాటు చేసుకున్నాం కదా అందుకని, అదేదో తొందరగా చేయి కృష్ణ, ముందు మీరు కళ్ళు మూసుకోండి అని అంటుంది. కృష్ణా ప్రార్థన మొదలు పెడుతుంది. దేవుడా నన్ను ప్రేమగా చూసుకుని అత్తయ్య నిచ్చావు, బంగారం లాంటి మనసున్న చిన్నపిల్లడి లాంటి మా ఏసీపీ సార్లు ఇచ్చావు, అప్పుడప్పుడు ఆనందంగా ఉండడానికి ఫామ్ హౌస్ ఇచ్చావు, ఈ సంతోషాలన్నీ ఎప్పుడూ నాతోనే ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటుంది. అదంతా చూసి మురారి నవ్వుతూ ఉంటాడు.నువ్వు చూస్తే స్వామి నాకు తెలుసు,ఎందుకంటే నువ్వు దేవుడివి కాబట్టి.ఇప్పుడు మీరు చేయండి, అని అంటుంది. ఈ పూజలన్నీ నావల్ల కాదులే కృష్ణ ఆకలి వేస్తుంది ముందు అన్నం తిందాం పట్టు అని అంటాడు. వంట ఎలా ఉంది అని అడుగుతుంది. బాగాలేదన్నవాన్ని చెప్పు తీసుకొని కొడతాను కృష్ణ.చాలా బాగుందితిను అని అంటాడు. చెప్పు అంటే గుర్తొచ్చింది ఏసీపి సార్, ఈ ఫామ్ హౌస్ లో మనం కాకుండా ఇంకెవరు ఉన్నారు అనిపిస్తుంది. మురారి షాక్ అవుతాడు. కొంపతీసి ముకుందకాని వచ్చిందా ఏంటి, నాకు తను వచ్చినట్టు తెలియాలని ఆ ఫొటోస్ పంపించిందా, వామ్మో అలా జరిగితే కొంప కొల్లేరు అయిపోతుంది. అని మనసులో అనుకుంటాడు మురారి. ముకుంద సంగతి తర్వాత ముందు కృష్ణుని డైవర్ట్ చేయాలి. అయినా మనం కాకుండా ఇక్కడ ఎవరు ఉంటారు కృష్ణ, నువ్వు,నేను రాజనర్సు,పనివాళ్ళు,మనమే ఇంకెవరూ లేరు. లేదు ఏ సిపి సార్, నేను విసరాకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు గది బయట ఒక అమ్మాయి చెప్పులు చూసాను. అది రాజ్ నర్స్ ఆంటీ వై ఉంటాయి. రాజ్ నర్స్ ఆంటీ మోడల్ చెప్పులు ఎందుకు వేస్తుంది. ఆ మాత్రం నాకు తెలియదా, అంటుంది.అంటే కచ్చితంగా ముకుంద వచ్చింది అని అనుకుంటాడు మురారి.

రేపటి ఎపిసోడ్ లో,కృష్ణా మురారిని,స్విమ్మింగ్ పూల్ లోకి తోసేస్తుంది.సారీ ఏసీపి సార్ అని చెప్తుంది. మురారి కూడా కృష్ణని స్విమ్మింగ్ పూల్ లోకి లాగుతాడు. నాకు ఈత రాదు ఏసిపి సార్ అని అంటుంది. మురారి కంగారుగా కృష్ణని బయటికి తీసుకొస్తాడు. కృష్ణ లే,కృష్ణ నీకేమైనా అయితే నేను బ్రతకలేను,అనీ కృష్ణని,తీసుకొని రూమ్ లోకి వెళ్ళబోతుండగా,ముకుంద ఎదురుగా వచ్చిన నిలబడుతుంది.ముకుందని చూసి మురారి షాక్ అవుతాడు…
Krishna Mukunda Murari: ముకుంద పంపిన కొరియర్ ను చూసి షాక్ అయినా మురారి.. అసలు అందులో ఏముంది?