Krishna Mukunda Murari: ముకుంద వాళ్ళ నాన్నతో నేను కృష్ణ భర్తను ప్రేమిస్తున్నానా లేదంటే మా పెళ్లి కంటే ముందే నేను మురారి అని ప్రేమిస్తున్నానా. ఆ అదృష్టం పెళ్లి జరిగే ముందు వరకు నేను మురారి కోసం ఎదురు చూశాను కదా.. ఆఖరి నిమిషంలో మీరందరూ బలవంతం చేస్తేనే కదా నేను ఆదర్శ్ ని పెళ్లి చేసుకున్నాను అని ముకుందా వాళ్ళ నాన్నతో అంటుంది. ఈ విషయాలన్నీ మీరే భవాని అత్తయ్యకు చెప్పాలి. కృష్ణ మీద జాలితోనో, రేవతి అత్తయ్య చెప్పిన మాటలు విని మీరు చెప్పకపోతే మీకు నిజం మాత్రమే ఉంటుంది. మీ కూతురు ఉండదు అని బెదిరిస్తుంది. వెంటనే వాళ్ళ నాన్న కంగారుగా ముకుంద వైపు చూస్తారు.

మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన కృష్ణ తలంటు స్నానం చేస్తుంది చన్నీళ్లతో.. ఆ చలికి వణికిపోతూ తల తుడుచుకుంటూ ఉంటే మురారి వచ్చి హీటర్ వేసుకోవచ్చు కదా అని చెబుతాడు. హెయిర్ డ్రయర్ పెట్టి హెయిర్ త్వరగా ఆరిపోయేలా చేస్తానని అంటే మా పల్లెటూరులో వేడి నీళ్లు హీటర్ గ్రీజర్ ఇలాంటివి ఏమీ ఉండవు ఏసీపీ సర్ చెబుతుంది. కృష్ణ మురారి మనసులో నువ్వు అచ్చమైన పల్లెటూరి అందానివి కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు.

ఇక ఇంట్లో అందరూ వరలక్ష్మి వ్రతం పూజ కోసం అన్ని సిద్దం చేస్తారు. పూజ ప్రారంభం కాబోతుండగా అక్కడికి ముకుంద వాళ్ళ నాన్న వస్తారు ఆయన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతారు ఆయన ముకుందకోసం ఒక చీర తీసుకొచ్చి త్వరగా కట్టుకొని వచ్చి పూజలో కూర్చొని చెబుతాడు ఆ మాటకి భవాని మేము మీ కూతుర్నే తక్కువగా చూసుకుంటున్నామా అని అడుగుతుంది అలా ఏమీ లేదు అని ఆయన అంటాడు ఇక ఆయన కోరిక మేరకు ముకుంద వాళ్ళ నాన్న తీసుకువచ్చిన చీరను కట్టుకొని పూజలో కూర్చుంటుంది ఇక పంతులుగారు ముందుగా గణపతి పూజతో మొదలు పెట్టి లక్ష్మీదేవి వ్రతం పూర్తి చేస్తాడు పూజ ముగిసిన తరువాత అక్కడ ఉన్న ముత్తైదువులను తమ భర్త ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. కృష్ణ మురారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ముకుందా తన చెవి బుట్ట కింద పడేసి మురారి కాళ్ళకి దండం పెడుతుంది. ఇన్ డైరెక్ట్ గా మురారినే తన భర్తని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తుంది. ముకుంద చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రేవతి మనసులో ఎంతకు తెగించవు అని అనుకుంటుంది. అంతలో కోపంగా అర్వబోతుండగా.. నాన్న తెచ్చిన చీర కట్టుకొని వచ్చే హడావిడిలో జుంకి సరిగ్గా పెట్టుకొలా అది పడిపోయింది అని కవర్ చేస్తుంది.

ముకుంద వాళ్ళ నాన్న ను పిలిచి భవాని మాట్లాడుతుంది. రేవతి కూడా అక్కడ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే శ్రీనివాస్ గారు మా ఆదర్శ్ కావాలనే మా ఇంటికి మా ఇంటికి రావడం లేదు ఆ విషయం మీకు ఎలా చేసింది తెలుసు అని భవాని సూటిగా శ్రీనివాస్ని ప్రశ్నిస్తుంది ఆయన ఏం చెబుతారు తరువాయి భాగంలో చూడాలి.

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా ఏదో ఆలోచిస్తూ ఉండగా కృష్ణ ముకుంద దగ్గరకు వెళ్లి నువ్వు ఒంటరివి అని అనగానే.. ముకుంద కోపంగా కృష్ణ అని అరుస్తుంది. కృష్ణ బాధపడుతుంది.