Krishna Mukunda Murari: కృష్ణ ముక్కు దురదగా ఉంటుంది. తన చేతికి గోరింటాకు ఉంటుంది. గొక్కోవడనికి నానా అవస్థలు పడుతుంది. మురారి నీ అతి కష్టం మీద మొహమాటం పడుతూ తన ముక్కు గొకమని అడుగుతుంది. మురారి ముక్కు గోకుతాడు. ఆ తర్వాత తన పెదాల పైన కూడా దురదగా ఉంది గోకమని కృష్ణ అడుగుతుంది. దాంతో వాళ్ళిద్దరూ చూపులు కలుస్తాయి. మనసులో మాత్రం ఒకరి మీద ఒకరి ప్రేమను వ్యక్తపరచుకుంటారు.

Krishna Mukunda Murari: మురారిని ఇరకాటంలో పెట్టిన కృష్ణ ప్రశ్న.. రేపటికి సూపర్ ట్విస్ట్..
రేవతి భవానీ తో ఎలాగైనా సరే కృష్ణ మురారిల విషయం చెప్పేయాలని అనుకొని తన దగ్గరకు వెళుతుంది. అక్క నేను నీతో విషయం చెప్పాలి అని రేవతి అనగానే, రా కూర్చో అని భవాని అంటుంది. కృష్ణ నీ మురారి పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్నే కృష్ణ మీద చూపించాను తనని కోడలుగా యాక్సెప్ట్ చేయలేకపోయాను. మురారి మీద ఉన్న కోపాన్ని తన మీద చూపించాను. కానీ తను వచ్చాక తన స్వార్థం లేని మంచితనం చూసి నేను చాలా సంతోషించాను. నా కూతురు ఈరోజు ఇంట్లో ఆనందంగా తిరుగుతుంది అంటే అందుకు కారణం కృష్ణ. అలాంటి కృష్ణను నేను కోడలుగా యాక్సెప్ట్ చేసి ఏడువారాల నగలు ఇవ్వాలని అనుకుంటున్నాను అని భవాని రేవతి తో అంటుంది. అయ్యో అక్క మీరు తనని యాక్సెప్ట్ చేస్తున్నందుకు సంతోషించాలో తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు అని రేవతి మనసులో అనుకుంటుంది. సరే ఈ విషయాన్ని నువ్వు ముందు కృష్ణ కి చెప్పొద్దు. ఎందుకంటే ఆనందాన్ని నా కళ్ళతో నేనే చూడాలి అని భవాని అంటుంది.

కృష్ణ మురారి లను రెడీ చేసి కిందకు తీసుకు వస్తారు. మురారితో నందిని కృష్ణతో నేను వెళ్లి మాట్లాడతాను అని అంటుంది. ఆ లోపు కృష్ణను కిందకి తీసుకొస్తుంది భవాని కృష్ణతో మీ ఇద్దరికీ మరోసారి మాంగళ్య ధారణ చేయిస్తాను. మీ పెళ్లి ఎలాగూ నేను చూడలేదు కదా ఈ పెళ్లితో నిన్ను నేను ఇంటి కోడలుగా ఒప్పుకుంటున్నాను అని అంటుంది. మీరు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా నా మాటలతో తన మనసు విరిచేసాను అత్తయ్య, తను మరికొన్ని రోజుల్లో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ముకుందా మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
భవానీ దేవి కృష్ణని కోడలిగా అంగీకరిస్తున్నాను. ఇకమీదట నిన్ను చిన్న కోడలు నా కోడలుగా నీకు అన్ని అర్హతలు ఉంటాయి అని ఏడువారాల నగలను నీకు నేనే స్వయంగా అలంకరించి, ఈ పెళ్లి చేస్తాను అని కృష్ణని భవాని పైకి తీసుకెళ్తుంది. ఇక మీదట నువ్వు ఈ భవానీ దేవి కోడలివి అని అంటుంది. భవాని మురిసిపోతూ కృష్ణ ని రెడీ చేస్తోంది తన ఆనందాన్ని మొత్తం కృష్ణ ముందు వ్యక్తపరుస్తూ ఉంటుంది. కృష్ణ మాత్రం మనసులో నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అత్తయ్య మురారి మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మీతో చెప్పొద్దన్నాడు. అందుకే నేను మీతో చెప్పడం లేదు అని కృష్ణ లోలోపల బాధపడుతూ ఉంటుంది.

మరోవైపు ముకుందా కృష్ణ చాలా తెలివైన దానివే కాదు అదృష్టవంతురాలు కూడా. భవాని అత్తయ్య చేస్తే ఏడువారాల నగలు వేయించుకొని పట్టాభిషేకం చేయించుకుంటూ ఈ ఇంటి కోడలుగా అడుగుపెడుతుంది. కానీ తను ఎన్ని చేసినా మాత్రం నా ప్రేమని నేను వదులుకోను అని ముకుందా మనసులో అనుకుంటుంది. అంతలో అలేఖ్య అక్కడికి వచ్చి మీకు ఈ విషయం తెలుసా భవాని అత్తయ్య కృష్ణకి ఏడు వారాల నగలు ఇస్తుంది. అలా ఎలా ఇస్తారు మనిద్దరం కోడళ్ళం కదా మనం కూడా అడుగుదామని అలేఖ్య అంటుంది. నాకు వాటి వేటి మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు నా ప్రేమ దక్కితే చాలు అని ముకుందా అంటుంది. నీకు ఆ నగలు కావాలంటే ముందు సుమలత అత్తయ్య దగ్గరికి వెళ్లి కృష్ణ మురారి ల విషయం చెప్పమని అలేఖ్యని రెచ్చగొడుతుంది ముకుందా.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ల పెళ్లి తంతు మొదలవుతుంది. అర్దేచ, కామేచ అంటూ ఒక్కొక్కటి మురారి తో చెప్పిస్తు.. నల్లపూసలు కృష్ణ మెడలో వేయమాని మురారి కి ఇస్తారు. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..