Krishna Mukunda Murari: భవానీ దేవి కృష్ణని చిన్న కోడలుగా అంగీకరిస్తూ తనకు ఏడువారాల నగలను తనే స్వయంగా అలంకరించి, ఈ పెళ్లి చేస్తాను అని కృష్ణని భవాని పైకి తీసుకెళ్తుంది. భవాని మురిసిపోతూ కృష్ణ ని రెడీ చేస్తోంది. తన ఆనందాన్ని మొత్తం కృష్ణకి తెలుపుతూ అందంగా రెడీ చేస్తుంది. కృష్ణ మాత్రం మనసులో నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అత్తయ్య. మురారి మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మీతో చెప్పొద్దన్నాడు. అందుకే నేను మీతో చెప్పడం లేదు అని కృష్ణ లోలోపల బాధపడుతూ ఉంటుంది. భవాని కృష్ణ కి ఏడువారాల నగలు వేసి తనను చూసి మురిసిపోతుంది. కానీ కృష్ణ ముభావంగా ఉండడం చూసి గమనించిన భవాని నీకు కొంచెం స్పేస్ కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ మనసులో బాధపడుతూ ఉంటుంది. మురారి తో తన పెళ్లి జరగడం , ఇంట్లోకి వచ్చిన దగ్గరనుంచి అందరూ తనని ఎలా చూసుకున్నారో గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari: అలేఖ్యతో ముకుంద మాస్టర్ ప్లాన్.. కృష్ణకి పట్టాభిషేకం చేసిన భవాని..
పంతులు గారు ముత్తైదువులందరినీ నల్లపూసలను నిండు మనసుతో గుచ్చమని చెబుతారు. మీరు మనసులో వాళ్లని దీవిస్తూ ఆ నల్లపూసల్ని కూర్చోండి. ఎందుకంటే ఆ దంపతులకు ఇప్పటికే మనసులో చాలా భయంగా ఉన్నాయి. పైగా నల్లపూసలు పెరిగాయి అందుకే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పూసలు గుచ్చండి. అలా గుచ్చకపోతే సమస్య మరింత జఠినం అయ్యే అవకాశం ఉంది అని ఆయన చెబుతారు. అలా ముత్తైదువులందరూ నల్లపూసలు గుచ్చుతూ ఉండగా.. ముకుంద కూడా కావాలని వెళ్లి నల్లపూసలు గుచ్చుతుంది. అప్పుడు రేవతి మనసులో ఇది వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకోదు కదా ఎందుకు గుచ్చుతుంది అని అనుకుంటుంది. పైగా ముకుందా భవాని అక్క ఎదురుగా ఉన్నప్పుడు నేను ఏమీ అనలేను అన్న ధైర్యంతో తను కావాలని నల్లపూసలు గుచ్చుతుంది అని రేవతి మనసులో అనుకుంటుంది. రేవతి ఏంటి అదోలా ఉంది కచ్చితంగా ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి అని భవాని మనసులో అనుకుంటుంది . అమ్మ వధూవరుల ఇద్దర్నీ తీసుకురండి అని పంతులు ఆదేశించడంతో కృష్ణ మురారి ఇద్దరినీ కిందకి తీసుకొస్తారు.

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
ఏమైంది రేవతి ఎందుకు అలా ఉన్నావు. మన ఇంట్లో అందరూ నటించడం రాదు అనుకున్నా కానీ, నువ్వు కూడా అది వచ్చని నిరూపిస్తున్నారు అని భవాని అంటుంది. అలాంటిది ఏమీ లేదు అక్క కృష్ణ మురారిలు ఇద్దరు మనసులో ఏదో బాధ పడుతున్నారు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అంతేగాని ఇంకేమీ లేదు అని రేవతి భవానీతో అంటుంది అవునా సరే జాగ్రత్త అని భవాని అంటుంది.

కృష్ణ మురారిలే ఇద్దరిని అందంగా ముస్తాబు చేసి కిందకు తీసుకొస్తారు పంతులుగారు ముందుగా గణపతి పూజతో మొదలు పెట్టి ఒక్కొక్క పూజలు చేసి ఆ తరువాత మురారి చేత మంగళ పూజ చేయిస్తారు. కృష్ణ మురారి ల పెళ్లి తంతు చూడముచ్చటగా ఉంటుంది. పంతులుగారు మురారి చేత మంగళ ధారణ చేయించే ముందు అర్దేచ, కామేచ అంటూ ఒక్కొక్కటి మురారి తో చెప్పిస్తు.. మాంగల్య ధారణ చేస్తాడు. కృష్ణ మురారి మెడలో తాళికట్టగానే సంతోషంగా మురారిని చూసి నవ్వుతుంది ఆ తరువాత మురారి నల్లపూసలు కృష్ణ మెడలో వేస్తాడు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కృష్ణ మురారి ఆశీర్వదిస్తారు ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది.

పెళ్లి జరిగిన తర్వాత కృష్ణ మాత్రం పక్కకు వెళ్లి మురారితో మరోసారి జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మురారి తనకు తాళి బొట్టు కట్టిన సన్నివేశాలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. పదేపదే ఆ సన్నివేశాలనే గుర్తు చేసుకుని తన మెడలో ఉన్న మురారి వేసిన దండలు నిమురుతు ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కృష్ణ ఏం చేయాలనుకుంటుందో తరువాయి భాగంలో చూద్దాం.