Krishna Mukunda Murari Actress Yashmi Gowda: కృష్ణ ముకుంద మురారి సీరియల్ చూసేవారికి యాష్మి గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ మా లో ప్రస్తుతానికి కృష్ణ ముకుంద మురారి సీరియల్ 12 టెలివిషన్ రేటింగ్ పాయింట్స్ తో ముందుకు దూసుకువెళ్తుంది. ఈ సీరియల్ లో ముకుంద గా ప్రధాన పాత్ర పోషిస్తున్న యాష్మి గౌడ కు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఎంతో మంది కుర్రాళ్ళ మనసును దోచేసిన ముకుంద ట్రెడిషనల్ గా ఉంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంది. అయితే తన చేతిమీద ఉన్న పచ్చబొట్టు టాట్టూ వెనుక ఉన్న అర్ధం మాత్రం ఏమిటో అర్ధం అవ్వక చాలా మంది సమాధానం కోసం వెతుకున్నారు.

చక్కటి కథా కథనం తో తెరకెక్కిన కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో యాష్మి గౌడ బంపర్ ఆఫర్ కొట్టేసింది అని చెప్పాలి. ఈ సీరియల్ సక్సెస్ ఆమె కెరీర్ ని మార్చేసింది. ఈటీవీ లో ప్రసారమైన స్వాతి చినుకులు సీరియల్ తో మొదట పేరు సంపాదించుకున్న యాష్మి ఆ తరువాత జీ తెలుగు సీరియల్ నాగ భైరవ లో ప్రధాన పాత్ర వేసింది. అయితే కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో తాను నటిస్తున్న ముకుంద పాత్ర ఆమెకు చాలా కలిసి వొచ్చింది. ఈ సీరియల్ తరువాత ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుఎంసెర్ తరహాలో చాలా ప్రముఖ బ్రాండ్స్ కి ప్రొమోషన్స్ ఇస్తూ బాగానే కాసులు కూడకట్టుకుంటుంది.
అయితే యాష్మి గౌడ చేతుమీద ఉన్న పచ్చబొట్టు టాట్టూ అర్ధం ఏమిటి అని ఆమెను చాలా మంది అడుగుతూవుంటారు. జాపనీస్ లేదా చైనీస్ బాష లో ఏదో అర్ధం వొచ్చేట్లు యాష్మి గౌడ ఎడమ చేతి మీద పచ్చ బొట్టు వేయించుకుంది. అది రెండు అక్షరాలతో కూడిన టాట్టూ, చాలా చక్కగా స్పష్టంగా ఉండే ఈ టాట్టూ చూడటానికి సింపుల్ గా ఉన్న దాని వెనుక మాత్రం చాలా అర్ధం ఉంది. ఒక అభిమాని తన పచ్చ బొట్టు గురించి అడిగిన టాట్టూ గురించి స్పందిస్తూ దాని వెనుక ఉన్న అర్ధం చెప్పేసింది. జీవితం లో ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు, మనం ఎప్పుడు నిండుగా ఉండాలి అనే అర్ధం వొచ్చేలా వేయించుకుంది అంట ఆ టాట్టూ. ఆ పచ్చ బొట్టుకు అర్ధం నిండు తనం అని అభిమానుల సందేహాన్ని తీర్చేసింది మన బుట్ట బొమ్మ.