NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari June 05 Episode 488: ముకుంద గురించి భవాని ఎంక్వయిరీ.. మురారి సేఫ్ .. ఇక కృష్ణకి మురారి శాశ్వతంగా దూరం కానున్నాడా?

Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights

Krishna Mukunda Murari June 05 Episode 488:  కృష్ణ పూజలు చేస్తూ మురారి ఎక్కడున్నా తిరిగి రావాలి అని అనుకుంటూ ఉంటుంది. మురారి ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అదే ఇంట్లో వాళ్లకు కూడా తెలిసి వాళ్లు కూడా మురారిని దోషగా చూడకుండా ఉండాలి అని అనుకుంటుంది. తులసి కోటకి దండం పెట్టుకుంటూ, ఈ ముకుంద ఎన్ని దారుణాలు చేస్తుందో నీకు తెలుసు కదా నా భర్త మీద ప్రేమ చంపుకోలేక రూపం మార్చుకుని వచ్చి, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది. నా బిడ్డని తన బిడ్డగా చెప్తుంది. హాస్పిటల్లో డాక్టర్ని మేనేజ్ చేసి, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మాయ చేసి, నా బిడ్డను తన బిడ్డ అని చెప్తుంది. ముకుంద మెడలు వంచి నేను తన నుంచి నిజం రాబట్టగలను. ఇవన్నీ కూడా నాకు పెద్ద లెక్కేం కాదు కానీ అసలు నా మురారి సార్ ఎక్కడున్నాడు నాకు ఇప్పటికీ తెలియట్లేదు తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని తను నా పక్కన ఉంటే ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా నేను ఎదుర్కొంటానని కృష్ణ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights
Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights

ఇక మరోవైపు భవానీ కారులో వెళ్తూ, డ్రైవర్ కి ముకుందా ఉన్న స్లం ఏరియా కి వెళ్ళమని చెప్తుంది. కార్లో వెళ్తూ ముకుందా తనతో మాట్లాడిన మొదటి మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను మీ ఇంటికి రాలేను. వచ్చేదాన్ని అయితే ముకుంద చనిపోయిన తర్వాతే వచ్చేదాని కదా అని తను చెప్పిన మాటలు భవాని ఇంటికి రమ్మని పిలవడం అన్ని భవానికి గుర్తుకు వస్తాయి. భవాని స్లమ్ ఏరియా కి వస్తుంది కార్ పక్కన పెట్టి భవాని ఒక్కతే లోపలికి వెళ్లి ముకుంద గురించి ఇంట్లో వాళ్ళని అడగాలి అనుకుంటుంది. అనుకోకుండా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మురారి కూడా అదే స్లమ్ ఏరియాలో ముకుంద అంతకుముందు ఉన్న ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. మురారి ఒళ్లంతా దెబ్బలతో, కట్లు కట్టి పడుకోబెట్టి ఉంటాడు భవాని దేవి మురారిని చూడదు. అక్కడికి వెళ్లి అక్కడ ఒక లేడీ తో ఇక్కడ ముకుందా అనే అమ్మాయి ఉండాలి కదా అని అడుగుతుంది. అప్పటికి ఆవిడకి ముకుందా ఇక్కడికి ఎవరైనా వస్తే ఏం మాట్లాడాలి అని ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది. దాంతో భవానీ దేవి ఆ అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ ఉంటుందా అని ఏమీ తెలియనట్టు ముకుంద గురించి అడుగుతుంది. ముకుంద గురించి మంచిగా చెప్తుంది. భవానికి ఏమీ అర్థం కాదు. ముకుంద చెప్పినట్టుగా, భవానీతో ఆమె, ఆ మీరా చాలా మంచిది మీరాకి దేవుడు చాలా అన్యాయం చేశాడు కానీ, ఆ అమ్మాయి మాత్రం అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. అంత మంచి అమ్మాయికి దేవత లాంటి ఒక ఆవిడ వచ్చి తన ఇంటికి తీసుకువెళ్లింది. కావాలంటే మీకు అడ్రస్ ఇస్తాను అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది. దాంతో భవానీ దేవికి సీన్ మొత్తం అర్థమవుతుంది ఇక ముకుంద మంచిదే అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు మీరా ఇక్కడికి మళ్లీ వచ్చిందా అని అడిగితే ఎప్పుడో ఒకసారి వస్తుందండి అని చెప్తుంది ఆవిడ. ఇక అప్పుడేఇంటికి వస్తే భవానీ దేవి కారు చూసి ఈవిడ ఇక్కడే కి వచ్చిందా ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి ఈవిడ ఎప్పుడు ఇంతే నాకన్నా ఒక అడుగు ముందు ఉంటుంది అని అనుకొని అసలు ఈవిడ ఎందుకు వచ్చిందో అని లోపలికి వెళ్లి తొండి చూస్తుంది అప్పటికే భవానీ దేవి ఆ ఇంట్లో అద్దెకుటున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతుంది నేను చెప్పిందే చెప్తుందా ఏ లేక ఏదైనా చెప్తుందా అని ముకుంద కంగారు పడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights
Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights

ఇక ముకుందా భవానీ దేవిని చూసి కంగారు పడుతూ ఉంటే భవానీ దేవి ఆవిడతో మాట్లాడి వెళ్లిపోతుంది. ఆవిడ వెళ్లిపోయిన తర్వాత ముకుందా ఇంట్లోకి వచ్చి మురారిని భవానీ దేవి చూసిందా ఏంటి అని అడుగుతుంది. కొంచెం ఉంటే చూసేసేది అమ్మ కానీ నేనే ఆపాను అని అంటుంది అక్కడ పని చేసే అమ్మాయి నిన్ను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా ఇంతకీ ఆవిడ ఏమి అడిగింది అని అడుగుతుంది. నీ గురించి ఆరా తీసింది అమ్మ నువ్వు అసలు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వెళ్తావు ఇక్కడికి అంతకు ముందు ఎలా వచ్చావు అని అడిగింది అంతా మీరు చెప్పినట్లుగానే చెప్పాను అని అంటుంది. మురారి నీ ఇక్కడి నుంచి తొందరగా మార్చేసేయాలి ఈవిడ ఒకసారి ఇక్కడికి వచ్చిందంటే ఇంకోసారి రాదు అని నమ్మకం లేదు అందుకనే తొందరగా మురారి నీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి అని అనుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు అని అమ్మాయితో చెప్పి లోపలికి వెళ్తుంది లోపల మురారి దెబ్బతో కట్లు కట్టుకొని పడుకుని ఉంటాడు. మురారి ఎలా ఉన్నావు నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని, మురారితో ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది ముకుందా మురారి మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఇంత కోపం ఉంటే ఎలా మురారి నేను నీకోసమే కదా ఇదంతా చేస్తుంది అని అంటుంది ముకుంద. మరోవైపు కృష్ణ మధు ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు సర్వదాసి ద్వారా ముకుంద కడుపులోఉన్నది నీ బిడ్డ అని చెప్తున్నావు అంతే కదా అంటాడు మధు అదే కదా మధు నేను చెప్తుంది అని అంటుంది కృష్ణ.అయితే మీరాని డాక్టర్ని మేనేజ్ చేసిందంటావా అని అంటాడు. సరోగసి చేసింది అని చెప్తున్నాను కదా నమ్మకం లేదా అని అంటే నువ్వు ఇదంతా నాకు చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణ మురారి కచ్చితంగా ఆ పని చేసి ఉండడు అని అంటాడు మధు. కానీ పెద్ద అత్తయ్య అత్తయ్య ఇద్దరు నమ్మట్లేదు వాళ్ళు మౌనంగా ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది కృష్ణ. మన దగ్గర ఆధారాలు లేవు కదా కనీసం మనం ముకుందని పట్టించడానికి కూడా మన దగ్గర ఏ ఆధారం లేదు ముందు దాని గురించి ఆలోచించాలి అని అంటాడు మధు. సరోగసి నిరూపించడానికి హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ కూడా ముకుంద కి సపోర్ట్ చేయడంతో ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాము అని అంటాడు మధు. ఎలాగైనా నేను డాక్టర్ని నమ్మాను కానీ ఆవిడ మాత్రం నాకు హ్యాండ్ ఇచ్చి ముకుందతో కలిసి ఇంత పెద్ద పని చేస్తుంది అని నేను అనుకోలేదు అని అంటుంది కృష్ణ. సరోగసి గురించి బయటపడడంతో మురారి అదే టైంకి ఇంట్లో నుంచి బయటికి వెళ్లడంతో అందరూ అనుమాన పడుతున్నారు అని అంటాడు మధు. ఏసీబీ సారి నా కూడా ఇలానే చేస్తుంది ఏసీబీ సార్ తప్పు చేశారేమో మొహం చూపించట్లేదు అని అందరూ అనుకుంటున్నారు అయినా తప్పు చేసిన ధైర్యంగా చేశానని ఒప్పుకునే మనిషి తప్పించుకొని తిరిగే మనిషి కాదు అని అంటుంది కృష్ణ. అసలా ఆయనకు ఏమైందో అని నాకు భయంగా ఉంది అంటుంది కృష్ణ. నువ్వు భయపడేది ఏమన్నా జరిగి ఉంటే ఈపాటికి తెలిసేది కదా అలాంటిది తెలియలేదంటే మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేంటన్నది మనం కనిపెట్టాలి కృష్ణ అని అంటాడు మధు ఇక కృష్ణ అసలు ముకుంద నాన్న ఉన్నాడు కదా ఆయనకి ఇవన్నీ తెలియకుండా ఉంటాయా అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా తెలుస్తుంది ఏమో అని కృష్ణ ముకుంద నాన్న శ్రీనివాస్ దగ్గరికి బయలుదేరుతుంది.

Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights
Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights

ఇక మరోవైపు ముకుందా మురారి కి ప్రేమగా ఫ్రూట్స్ తినిపించాలి అనుకుంటుంది. తినుమురారి నీకోసమే తీసుకొచ్చాను అని అంటుంది. నువ్వు ఇలా ఎక్కువ రోజులు కదలకుండా బెడ్ మీద ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అంటుంది. నువ్వు నా చెయ్యి పట్టుకుని నడవాలి అలా జరగాలి అంటే నువ్వు మందులు వేసుకోవాలి. మందులు వేసుకోవాలంటే ముందు ఈ ఫ్రూట్స్ తినాలి అని అంటుంది. మురారి మాత్రం తినకుండా పక్కకు తిరుగుతాడు. ఏంటి అలా ముఖం పెట్టావ్? ఏంటి ఫ్రూట్స్ నచ్చలేదా నేను టేస్ట్ చేశాను అని అంటుంది. ముకుంద యాపిల్ ముక్కని తిని తీయగానే ఉంది కదా అని అంటుంది. నువ్వు ఎంగిలి చేశావు కాబట్టి తీయగా ఉందో లేదంటే ఇది మామూలుగానే తీయగా ఉందో నాకు తెలియట్లేదు అని అంటుంది. ఎంతకాలం నన్ను ఇలా హింసిస్తావు అని అడుగుతాడు మురారి. నేను నిన్ను హింసిస్తున్న ఏం మాట్లాడుతున్నావు మురారి అని అంటుంది ముకుందా, యాక్షన్ జరిగి నువ్వు రోడ్డు మీద పడి ఉంటే పాపం అని నేను తీసుకొచ్చి నీకు సేవ చేస్తుంటే నిన్ను హింసిస్తున్నట్లు కనిపిస్తుందా అని అంటుంది. ఎవరు చూడకపోయినట్లయితే నువ్వు ప్రాణాలతో ఉండే వాడివాముకుందా అంటే నువ్వు కాపాడడం కన్నా ప్రాణాలు పోయినా బాగుండేది అని అంటాడు మురారి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావ్ అని అడుగుతుంది ముకుందా. నువ్వసలు నా ప్రేమని అర్థం చేసుకొని ఉన్నట్లయితే, ఎప్పుడో కృష్ణని వదిలేసి నాకోసం వచ్చేసే వాడివి కదా అని అంటుంది. దానికి మురారి ఆవేశంగా పైకి లేవబోతాడు కానీ తన చెయ్యి కాలు నొప్పి పుట్టడంతో ఒకసారి ఆగిపోతాడు. ఎందుకు అంత ఆవేశం పడుతున్నావ్ మురారి నేను చెప్పింది దాంట్లో తప్పేముంది ఒకసారి ఆలోచించు, నువ్వు ముందు ఏం చెప్పావు నన్ను ప్రేమించావు ముకుందగా ఉన్నప్పుడు నన్ను ప్రేమించి నాతో పెళ్లి చేసుకుంటానని ఒక సంవత్సరం తర్వాత కృష్ణుని వదిలేస్తానని చెప్పి, దాన్ని ఇప్పుడు మనసు నిండా నింపుకున్నావు. నీకు చెప్తున్నాను మురారి నువ్వు తనని మనసులో నుంచి తీసేయ్ లేదంటే నేను కృష్ణని అని అంటుంది వెంటనే ముకుందా అని అరుస్తాడు మురారి నేను కృష్ణుని చంపుతాను అని అనట్లేదు కానీ తప్పక పోతే అలానే చేస్తానేమో అని అంటుంది. కృష్ణని చంపేస్తానని మురారిని బెదిరిస్తుంది. నువ్వు కృష్ణుని మర్చిపోవడం బెటర్ అని అంటుంది అది కలలో కూడా జరగదు అని అంటాడు మురారి జరగాలి మురారి అని అంటుంది.

Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights
Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights

నువ్వు అసలు పిచ్చి దానివో మొండి దానివో అర్ధం కావట్లేదు ముకుందా నువ్వు ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఈ రూపం మార్చుకొని వచ్చినంత మాత్రాన నేను ఎలా ప్రేమిస్తాననుకున్నావో నాకు కృష్ణ తో పెళ్లి అయిపోయింది నీకు ఆదర్శ్ తో పెళ్లి అయిపోయింది దాన్ని ఎవరు మార్చలేరు కదా అని అంటాడు. ఆ విషయం నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటాడు మురారి. విధి ఎప్పుడు మనం కలవడానికి అవకాశం ఇస్తూనే ఉంది. కానీ మనం ఉపయోగించుకోవట్లేదు అంతే, ఇప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యి నువ్వు నాకే ఎందుకు దొరికావు. నువ్వు మీ ఇంట్లో వాళ్లకు దూరకుండా నాకు దొరికావంటే ఇదేదంటే అని అంటుంది నిన్ను నా దగ్గరికి ఎప్పుడు చేరుస్తూ ఉంటుంది. అందుకే మనం కలవాలి అని అంటుంది ముకుందా ఏమో నాకోసం రూపం మార్చుకున్న నువ్వు నాకోసం ఒక బిడ్డని నీ కడుపులో ఇంత చేస్తున్న నువ్వు నాకు యాక్సిడెంట్ చేయవని నమ్మకం ఏముంది నువ్వే ఆక్సిడెంట్ చేసి ఇలా నాటకం ఆడుతున్నావా అని అడుగుతాడు మురారి. అనుకున్నాను ఎప్పటికీ నువ్వు నన్ను నమ్మవని నాకు తెలుసు. అతిగా ప్రేమించే నేను నీకు ఆక్సిడెంట్ చేయిస్తానని ఎలా అనుకున్నావు అసలు నీకోసం నేను ఎలా మారిపోయానో చూసావా ఒకప్పుడు నువ్వు ప్రేమించిన ముకుంద రూపాన్ని వదులుకున్నాను. ఆ ప్రాసెస్ లో నా ప్రాణాలే పోయిండేవి అయినా తెగించి నేను ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసా నేను ప్రాణాలతో ఉండాలి అంటే అది నీతోనే ఉండాలి అని అనుకున్నాను కాబట్టి ఇలా వచ్చాను. ఎందుకు నువ్వు నా నన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు నా ప్రాణం అని అంటుంది. నిజంగా నేను నీ ప్రాణం అయితే నీ ప్రాణాన్ని నువ్వు వింతలా హింసించాను. అదే ప్రేమ నీకుంటే నీ సంతోషమే నాకు ముఖ్యమైన నన్నెప్పుడో వదిలేసే దానికి కదా అని అంటాడు మురారి కానీ నేను అలా వదలను ప్రేమ కోసం దేన్నైనా వదలొచ్చు కానీ ప్రేమనే వదలడం ఏంటి నాన్సెన్స్ అని అంటుంది ముకుందా. నీకు ఒకటే చెప్తున్నాను జాగ్రత్తగా విను నా సొంతం అవుతావని నేను ఎన్నో కలలు కంటున్నాను. ఇంక నాకు ఓపిక లేదు, ఇదే మనకొచ్చిన లాస్ట్ ఛాన్స్, దీన్ని మాత్రం నేను వదులుకోలేను. ఇకనుంచి నువ్వు నన్ను కాదు వదులుకోవాల్సిందే ఆ కృష్ణని ఆ గతాన్ని ఇంకిక్కడితో మర్చిపోవాలి. ఒకవేళ కృష్ణ కనిపెట్టి ఇక్కడికి వచ్చిన ముకుంద కడుపులో ఉన్నది మన బిడ్డ అని సరోగసి వల్ల పుట్టే బిడ్డ కాదని నువ్వే తనకి అబద్దం చెప్పాలి నీకు అబద్ధం చెప్పడం అలవాటే కదా కృష్ణ గర్భవతి కాపైన అబద్ధం చెప్పారు కదా అలానే ఇప్పుడు కూడా అబద్ధం చెప్పాలి అని అంటుంది. ఆ మాటలకి మురారి పిచ్చి పట్టిందా నీకు ఆ బిడ్డ నీ బిడ్డ ఎలా అవుతుంది మా బిడ్డ అని అంటాడు. నీకు నాకు మధ్య ఏదో జరిగిందని చెప్పమని నేను చెప్పట్లేదు. మన మధ్య ఏదో జరిగిందని నువ్వు నా వాడివని కృష్ణను నమ్మించడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడమని చెప్తున్నాను అంతే, సరోగసి నిజంగా జరగలేదు, అని నువ్వు అబద్దం చెప్తే చాలు అని అంటే ఒకవేళ వాళ్ళు నమ్మకపోయినా నేను డాక్టర్ చేత వాళ్ళని నమ్మిస్తాను మనకి వైదేహి ఉంది కదా హెల్ప్ చేయడానికి అని అంటుంది. ముకుంద నా వల్లే తల్లి అయింది అది నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని ఇంతకాలం నిన్ను నమ్మించాను సరోగసి ద్వారా పిల్లల్ని నిన్ను మభ్య పెట్టాను అని నువ్వు జస్ట్ అబద్ధం చెప్తే చాలు అని అంటుంది ముకుంద. ఆ మాటలకు మురారి కి చాలా కోపం వస్తుంది చూడు మురారి ఈ నువ్వు కృష్ణుని బెదిరించుకోవడానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క అబద్ధం చెప్పు కృష్ణ నిన్ను అసహ్యించుకుని వెళ్ళిపోతుంది అని అంటుంది. ఈ ఐడియా ఎలా ఉంది అని అడిగితే నీ బొంద లా ఉంది అని తిడతాడు మురారి. నేను కథ లేకుండా ఉన్నాను కాబట్టి నువ్వు బతికి పోయావు అని అంటాడు. నువ్వు కదిరినా నన్నేం చేయలేవు ఎందుకంటే నీ బిడ్డ నా కడుపులో ఉంది కాబట్టి అని అంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను విను నువ్వు నాతో ఉంటే అందరూ ఏడుస్తూ అయినా బతికి ఉంటారు. ఒకవేళ నువ్వు నాతో ఉండకపోతే ఆ కృష్ణ కూడా ఉండదు నా కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా ఉండదు ఇది మాత్రం కన్ఫామ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights
Krishna Mukunda Murari June 5 Today Episode 2024 Episode 488 highlights

ఇక మరోవైపు భవాని ఇంటికి వచ్చి ముకుంద గురించి వాళ్ళు చెప్పిన మాటలు అన్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వచ్చి ఏంటి అక్కయ్య మీరు ఇంకా లేకపోయేసరికి కంగారు పడ్డాము కృష్ణ కూడా ఇంట్లో లేదు ఏం జరుగుతుందో అని భయమేసింది అని అంటుంది రేవతి. ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతుంటే ఎలా మనశ్శాంతిగా ఇంట్లో ఉంటాము అని అంటుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బయటకు వెళ్లాలి కదా అని అంటుంది దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అక్క అని అంటుంది సుమలత. పాపం పండిన రోజు అన్ని విషయాలు తెలుస్తాయి అని అంటుంది. అది తెలుసుకుందామని వెళ్తే మీరా చాలా మంచిదని అక్కడ అందరూ చెప్పారు. మీరా మంచిది కాదని అక్కడ ఎవరు చెప్పలేదు అని అనేసరికి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు నిజంగా మీరు మంచిదేమో అని అనుకుంటారు. కానీ మధు మాత్రం నేను మీతో ఒక విషయం చెప్పొచ్చా అని అడుగుతాడు భవానిని, ఏంటో చెప్పు అని అంటుంది. అసలు మీరు మీరా గురించి ఎంక్వయిరీ చేయాల్సిన అవసరం ఏముంది కృష్ణ అని నమ్మకుండా మీరు అని మంచిదా కాదా అని సందేహపడడం ఏంటి? అలా చేస్తే మనమే కృష్ణా మురారిని అనుమానించినట్లు ఉంటుంది కదా అని అంటే, ఏం చేయమంటావురా ఆమె ఒక బిడ్డకు తల్లి అయింది ఆ బిడ్డకు తండ్రి ఎవరు అంటే మురారి అని చెప్తుంది మురారి అని అడుగుదామంటే మురారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు కదా అని అంటుంది భవాని. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella