NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari May 11 Episode 467

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ ప్రెగ్నెంట్ అనుకోని తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోసం ఇంట్లో వాళ్ళు పూజ మొదలుపెడతారు. కృష్ణ మనసులో సరోగసి మదర్ కడుపులో పెరుగుతున్న తన బిడ్డ క్షేమం కోసం ఈ పూజ చేస్తున్నాను అని అనుకుంటుంది. మురారి మీరా కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కోసం ఈ పూజ చేస్తున్నాను అని అనుకుంటాడు. మీరా కడుపులో బిడ్డ పెరుగుతున్నట్టు కృష్ణకు తెలియదు. మురారి మీరాతో నీ కడుపులో పెరిగే బిడ్డకే ఈ పూజ చేస్తున్నాము నువ్వు నీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని పూజ మొదలు పెట్టాము అని అంటాడు. ఆ మాటలకు మీరా చాలా సంతోషిస్తుంది.

Krishna Mukunda Murari May  11 Episode 467
Krishna Mukunda Murari May 11 Episode 467

ఇక కృష్ణ పూజకి రెడీ అవుతూ ఉంటుంది. ఆదర్శ మీరా క్లోజ్ గా ఉండడం, రజిని ఆ విషయాన్ని కృష్ణకు చెప్పడంతో కృష్ణ ఆదర్శ్ బట్టలు కొంటానంటే మీరా వెళ్లడం వెనక మీరా కి కూడా ఆదర్శం అంటే ఇష్టం ఉందని అనుకుంటుంది . అప్పుడే మురారి లోపలికి వస్తాడు ఏంటి తింగరి ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇప్పుడు మనకి శుభకార్యమే జరుగుతుంది నువ్వు అంతగా ఆలోచించి బుర్ర పాడు చేసుకో అక్కర్లేదు పద కిందకి వెళ్దాం అని అంటాడు. ఇప్పుడు ఇంట్లో ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా జరిగితే బాగుండు అని అంటుంది. ఇంకో శుభకార్యం ఏముంది అని అడుగుతాడు. ఆదర్శ్ మీరాల పెళ్లి అని అంటుంది దాంతో మురారి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా కి పెళ్లి ఏంటి అని అంటాడు అదేంటి నీతి అంతకన్నా తెలుసు కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని భవాని ఆ అత్తయ్య అనుకుంటుంది. అప్పుడు మీరు కూడా ఓకే అన్నారు కదా అని అంటుంది కృష్ణ.కానీ మురారి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మీరే కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ కాబట్టి సర్వసి మదర్ ఎవరో కృష్ణకు తెలియదు కాబట్టి ఆగస్టులో పెళ్లి చేయాలి అని అనుకుంటుంది ఇప్పుడు నేను విషయం బయట పెడితే, సరోగసి ఏమీ వద్దు ఆగస్టు పెళ్లి చేసేద్దాం ముకుంద కి అని అంటుంది. ఇప్పుడు నేను విషయం చెప్పకపోవడమే మంచిది. ఆల్రెడీ కడుపులో బేబీ పడింది కాబట్టి ఆ పిండం నిలబడి మూడో నెల వచ్చిన తర్వాత కృష్ణకు చెప్తే విషయం మొత్తం కృష్ణ అర్ధం చేసుకొని పెళ్లి తనే ఆపుతుంది ఇప్పుడు మాత్రం చెప్పకూడదు చెప్తే ఇప్పుడు సరోగసి వద్దని ఆదర్శ్ కి పెళ్లి చేస్తుంది మీరా తో, పని మురారి మనసులో అనుకుంటాడు ఏసీపీ సార్ ఏంటి నేను పిల్లను గాని అలా ఉండిపోయారు ఏదో ఒకటి చెప్పండి ఇప్పుడు ఆదర్శ్ కి మీరా అంటే ఇష్టం మీరాకే ఆదర్శం అంటే ఇష్టం అలాంటప్పుడు పెళ్లి చేస్తే తప్పేముంది అని అంటుంది. అది కాదు తింగరి అప్పుడు నువ్వే కదా వద్దన్నావు అంటే నేను మీరా మారదేమో అనుకొని అలా చెప్పాను ఏమో పెళ్లయిన తర్వాత మీరే మనసు కూడా మారుతుందేమో అని అంటుంది. ఏం చెప్పాలో తెలీక మురారి ప్రస్తుతానికి కృష్ణతో వాదన చేయకూడదు 3 నెల వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది కాబట్టి అని మనసులో అనుకొని సరే నీ ఇష్టం నీకే ఓకే అయితే నాకు ఓకే అలాగే జరిపిద్దాం ముందు పూజ చేద్దాం పద అని అంటాడు.

Krishna Mukunda Murari May  11 Episode 467
Krishna Mukunda Murari May 11 Episode 467

ఇది మరోవైపు ముకుంద రెడీ అయ్యి పూజకి కిందకి వస్తుంటే ఆదర్శ్ చూసి ముకుందతో బాబు చాలా బాగున్నావు ముకుందా నువ్వు బ్యూటిఫుల్ అని అంటాడు. ప్రతిసారి నా వెనుక కుక్క పిల్లలాగా వీడియో కూడా తయారు అయ్యాడు అని మనసులో అనుకుంటుంది ముకుంద. ఇది మీరు తీసుకొచ్చిన చేరే అని అంటుంది నువ్వు కట్టుకున్న తర్వాతే ఈ చీరకి ఇంత అందం వచ్చింది ముకుందా అని అంటాడు. థాంక్స్ ఆదర్శ గారు అని అంటుంది రెండు రోజుల్లో నేను ఊరికి వెళ్తున్నాను అని అంటాడు అమ్మయ్య నేను ప్రశాంతంగా ఉండొచ్చని మనసులో అనుకుంటుంది ముకుంద. రెండు రోజుల తర్వాత నేను ఊర్నుంచి వచ్చి నీకు ఒక సపరేట్ ఇస్తాను అని అంటాడు వెంటనే ముకుంద మనసులో నువ్వు నాకు సపరేట్ ఇవ్వడం కాదురా నేనే నీకు సప్రైజ్ ఇస్తాను నీ గుండె బద్దలై పోతుంది జీవితంలో ఎప్పటికి నమ్మకం కూడా చూడవు ఇంకా అనే మనసులో అనుకుంటుంది సరే అని అంటుంది. నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ముకుందా అని అంటాడు నా సంతోషానికి కారణం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అని అనుకుంటుంది. ఇక పూజకు వెళుతున్నాను అని కిందకి వెళ్ళిపోతుంది ముకుంద. రెండు రోజుల్లో ఆదర్శ ముకుంద కి సప్రైజ్ ఇచ్చే లోగా ముకుందే తను మురారి బిడ్డకి తల్లి కాబోతున్నట్లు చెప్పాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May  11 Episode 467
Krishna Mukunda Murari May 11 Episode 467

ఇక అందరూ కిందికి వస్తారు పూజ మొదలవుతుంది కృష్ణ, మురారిని చూసి అందరూ చాలా బాగున్నారు మీరిద్దరూ సీతారాముల ఉన్నారు అని పొగుడుతారు. ఇక అప్పుడే అక్కడికి అమృత వస్తుంది. అమృత భవానీతో నేను రావడం ఆలస్యమైందా అని అంటే అదేం లేదు ఇప్పుడే పూజ మొదలైంది అని అంటుంది భవాని. అమృత కృష్ణ తో నీ గురించి మీ అత్తగారు ఎప్పుడూ ఫోన్లో చెప్తూ ఉంటే, కోడలు గురించి గొప్పగా చెప్తుంది అనుకున్నాను కానీ మీ అత్తగారు చెప్పినవన్నీ నిజమే అనమాట అని కృష్ణతో అంటుంది కృష్ణ అందుకు సిగ్గుపడుతుంది.నా కోడలు బంగారం అని అంటుంది. అవును అని అంటుంది అమృత ముకుంద మాత్రం కడుపులో బిడ్డ లేదని తెలిస్తే బంగారం,ఇత్తడి అవుతుందో తెలుస్తుందిలే అని మనసులో అనుకుంటుంది ముకుంద. అని పంతులుగారు అంటారు మీరు కృష్ణ మురారి ఇద్దరు పూజ కి కూర్చుంటారు. ఇక ముకుంద మాత్రం నిలబడే ఉంటుంది అందరూ కూర్చున్న తర్వాత కూడా ముకుంద కూర్చోపోతే మురారి చూసి కూర్చో మీరా అని అంటాడు. అసలు ఈ ఫంక్షన్ జరుగుతుందే నీవల్ల కదా నీకోసమే కదా అని అంటాడు వెంటనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇదేంటి మురారి అందరికీ నా కడుపులో తన బిడ్డ పెరుగుతున్నట్లు చెప్పేస్తాడా అని ముకుంద కంగారు పడుతుంది.

Krishna Mukunda Murari May  11 Episode 467
Krishna Mukunda Murari May 11 Episode 467

ఇక మురారి పూజ ముకుంద కోసమే జరుగుతుంది అని చెప్పేసరికి రజిని అదేంట్రా అలా మాట్లాడుతున్నావు పూజ చేస్తుంది కృష్ణ కోసం కదా నీ బిడ్డ కోసం కదా, మరి అలాంటిది ఆ అమ్మాయి కోసం చేస్తున్నట్లు మాట్లాడుతున్నావ్ అని అంటుంది. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని నా బిడ్డకు పూజ చేస్తున్నానంటే దానికి కారణం ముకుంద నన్ను విడిపించడమే కదా జైలు నుండి అందుకే అలా అన్నాను ముకుంద వల్లే నేను బయటికి రాగలిగాను కాబట్టి ఈ పూజ కూడా ముకుంద వల్లే జరుగుతుంది అని అన్నాను. అని అంటాడు మురారి దీనిలో ఇంత అర్థం ఉందని మాకు తెలియలేదులే అని అంటుంది రజిని. మురారి చెప్పినా కూడా కృష్ణ కూర్చోరు. ఇక భవాని వైపు చూసి పెద్దమ్మ మీరేనా ముకుందని కూర్చోమని చెప్పండి అని అంటాడు. కానీ అమృతకు మాత్రం డౌట్ వస్తుంది వీళ్లిద్దరూ ఒకరికొకరు చూసుకోవడం అమృత చూస్తుంది. ఇక పూజకి కూర్చున్నా కూడా ముకుందా కోపంగా ఉంటుంది అప్పుడే మురారి మనసులో నీకోసం పూజ చేస్తూ నీతో బ్రతుకు జరిపించుకోవాల్సింది కృష్ణతో చేయాల్సి వస్తుంది నేను చేస్తుంది కూడా నీ కడుపులో బిడ్డ కోసమే అని అనుకుంటాడు. పూజ జరుగుతున్నప్పుడు మధ్యలో అక్షింతలు మీరాకీ ఇవ్వమని కృష్ణతో అంటాడు కృష్ణ కోపంగా చూస్తుంది అదేంటి నేను పూజ చేస్తుంటే మీరాకి ఇవ్వమంటున్నాడు అని అంటుంది. కృష్ణ కి కోపం వచ్చిందని అర్థం చేసుకొని మురారి వద్దులే అక్షింతలు మీరాకి అనే పక్కన పెట్టేసి ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు. ఇదంతా అమృత గమనిస్తూ ఉంటుంది. ముకుంద మాత్రం మనసులో ఇప్పుడు పూజ చేసే అవకాశం లేకపోయినా రేపు నీ బిడ్డకు తల్లిని అయిన తర్వాత కృష్ణుని పక్కకు పంపించేసి నీ పక్కన కూర్చొని నేనే పూజ చేస్తాను అని అనుకుంటుంది. పూజ చేసేటప్పుడు పంతులుగారు తమలపాకు ఎడమచేత్తో భర్త చుట్టూ తిప్పమ్మ అని అంటాడు వెంటనే సంగీత ఎడమ చేతితోనే తిప్పాలా కుడిచేత్తో తిప్పకూడదా అని అంటుంది. దానికి పంతులుగారు ఎడమచేత్తో తిప్పితే ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి భర్త పోలికలు భర్త, వస్తాయని అంటారు అందుకే అచ్చం భర్తలాగే మళ్లీ బిడ్డ కూడా పుట్టాలని భార్య ఈ పూజలో ఇలా చేయాలి అని అంటాడు. కృష్ణ తమలపాకుతో మురారి చుట్టూ తిప్పుతుంది. ఇక అందరూ అక్షింతలు వేసి జంటని ఆశీర్వదించండి అని అంటాడు పంతులుగారు. ఎలాగైనా ఈ పూజ పూర్తిగా కంప్లీట్ అవ్వకూడదని ముకుంద మనసులో అనుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక వెంటనే అందరూ ఏమైంది మీరా ఏమైంది అని తనని లేపడానికి ట్రై చేస్తారు. ఎంతసేపటికి ముకుంద లేవకపోవడంతో రూమ్ లోకి తీసుకువెళ్తారు.

Krishna Mukunda Murari May  11 Episode 467
Krishna Mukunda Murari May 11 Episode 467

ఇక ముకుంద కళ్ళు తిరిగి పడిపోవడంతో, ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. కృష్ణ స్టెతస్కోప్ పెట్టుకొని ముకుందని టెస్ట్ చేస్తుంది. కృష్ణ టెస్ట్ చేస్తుంటే మురారి కిటెన్షన్ మొదలవుతుంది ఎక్కడ ముకుందా ప్రెగ్నెంట్ అన్న విషయం బయటకు తెలిసిపోతుందో అని కంగారు పడతాడు. మురారి భయమే నిజమైతుంది ముకుందా ప్రెగ్నెంట్ అన్న విషయం కృష్ణ కనిపెట్టేస్తుంది. ఒకటికి రెండుసార్లు మళ్లీ చెక్ చేస్తుంది దాంతో మురారి కూడా అర్థమైపోతుంది కృష్ణకి మీరా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు తన పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిందని ఇంట్లో గొడవ చేసి చెప్పేస్తుందేమో అని భయపడతాడు. అప్పుడు తన మీద నిందపడితే ముకుంద కూడా ఎంత కాలం భరిస్తుంది నిజం చెప్పేస్తుంది సరోగసి మదర్ని నేనే అన్న విషయం ఇక అప్పుడు ఏమీ చేయలేము అని అనుకుంటాడు మురారి. కానీ కృష్ణ ముకుందని టెస్ట్ చేసి విషయం బయటికి చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. పక్కనే ఉన్న భవాని అమృతతో ఈ అమ్మాయి అనాధ ఎవరూ లేరు మేమే ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాము, ఈ అమ్మాయి వెళ్లే మాకు చాలాసార్లు మంచి జరిగింది అందుకే పరాయి వాళ్ళని చూసినట్టు కాకుండా అయిన వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నాము అని అంటుంది. భవానీ కృష్ణతో టెస్ట్ చేశావు కదా పర్వాలేదా ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలని అడుగుతుంది. పర్వాలేదా అత్తయ్య నీరసంగా ఉంది అంతే ఆమె లేచిన తర్వాత కాఫీ పట్టిస్తే సరిపోతుంది అని అంటుంది.

Krishna Mukunda Murari May  11 Episode 467
Krishna Mukunda Murari May 11 Episode 467

భవాని నువ్వు టెస్ట్ చేసి చెప్పావు కదా ఒకసారి అమృత కూడా మీరు అనే టెస్ట్ చేస్తుంది పక్కకి రా అని అంటుంది. ఇక కృష్ణ కంగారు పడుతూ వద్దయ్యా నేను టెస్ట్ చేశాను కదా అని అంటుంది దాంతో భవాని కోపంగా ఉదయం నిన్ను టెస్ట్ చేస్తా అన్నా కూడా ఇలానే చెప్పావు ఇప్పుడు ముకుందని టెస్ట్ చేస్తా అన్నా కూడా ఇలానే అడ్డు పడుతున్నావు. నువ్వు కాసేపు పక్కకు రా కృష్ణ అమృత ముకుందని టెస్ట్ చేస్తుంది అని కోపంగా అంటుంది భవాని. దాంతో చేసేదేం లేక కృష్ణ పక్కకు వెళ్తుంది. మురారి మాత్రం చాలా టెన్షన్ పడతాడు కృష్ణ అందరిలో విషయం చెప్పడం ఎందుకని దాచిపెట్టినట్టుంది ఇప్పుడు అమృత ఆంటీ మాత్రం విషయం పెద్దమ్మకి చెప్పకుండా మాత్రం ఆగదు ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో కంగారుపడుతూ ఉంటాడు ఆ కంగారు అంతా అందరికి అర్థమవుతూ ఉంటుంది. ఇక అమృత కూడా ముకుందని టెస్ట్ చేస్తుంది వెంటనే ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయం అమృత కూడా అర్థమవుతుంది దాంతో కృష్ణ ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు అని కృష్ణ వైపు చూస్తుంది. మురారి కంగారు పడటం చూసి మురారి వైపు కూడా చూస్తుంది ఇక అమృత ముకుంద ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరిలో చెప్తుందా లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే …

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella