NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

Krishna Mukunda Murari May 14 Episode 469

Krishna Mukunda murari:మురారి కృష్ణ కి నిజం చెప్పడంతో, కృష్ణా మురారి మీద కోప్పడుతూ ఉంటుంది. మీరు నా దగ్గర నిజం దాచిపెట్టి మీరాని సర్వదసి మదర్ గా ఒప్పుకోవడం నాకసలు నచ్చలేదు ఎసీపీ సార్ అని అంటుంది. ఆ మీరా గురించి మీకు పూర్తిగా అర్థం కావట్లేదు తను ఆదర్శ తో క్లోజ్ గా ఉంటుంది ఆదర్శ్ ఇప్పటికే తనని ప్రేమిస్తున్నాడు. భవాని అత్తయ్య కూడా ఈ విషయాన్ని చెప్పారు ఇంట్లో అందరికీ ఈ విషయం గురించి తెలుసు, ఏ ఉద్దేశం లేకుండా సరోగసికి మీరా ఒప్పుకున్నా కూడా మీరు ఆలోచించాలి కదా అని అంటుంది. అసలు సరోగసి మదర్ అంటే ఏంటి తల్లి కావడం, మన ఇంట్లో మీరా తల్లి అవడం అంటే అది ఎంత ప్రాబ్లం మీరు అసలు ఆలోచించారా ఆవిడ వాంతులు అవుతాయి, వారం వారం టెస్ట్ చేయాలి నిజం బయటపడకుండా ఉంటుందనుకున్నారా, ఈలోపు ఆదర్శం ముకుంద మీద ప్రేమతో భవానీ అతని తొందర పెడితే ఆవిడ కూడా ఇద్దరికీ పెళ్లి చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి. భవాని అత్తయ్య పెళ్లి టాపిక్ ఆల్రెడీ నా దగ్గర తీసుకొచ్చింది. నేను అప్పుడు ఏమీ మాట్లాడలేదు మిమ్మల్ని కనుక్కొని చెప్తానన్నాను. ఇప్పుడు మీరు నాకు తెలియకుండా ఇంత పని చేశారు ఇప్పుడు నేను భవాని అత్త అడిగితే ఏం చెప్పాలి వద్దని చెప్తే ఎందుకు అని అడుగుతుంది. తీగ లాగితే డొంక కదులుతుంది ఎసిపి సార్ అని అంటుంది. కృష్ణ ఇవన్నీ ఇప్పుడు ఆలోచించడం కాదు మన బిడ్డ మీరా కడుపులో పెరుగుతుంది ఆవిడని బాగా చూసుకోవాలి ఇప్పుడు నా ముందున్నది అదొక్కటే అని అంటాడు మురారి.

Krishna Mukunda Murari May 14 Episode 469
Krishna Mukunda Murari May 14 Episode 469

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. సంగీత అందరికీ వడ్డిస్తుంది. కృష్ణ కూడా వడ్డిస్తాను అంటే భవానీ దేవి కోప్పడి ఏమీ అవసరం లేదు నువ్వు కూర్చో అని అంటుంది. నువ్వు ఎప్పుడు కడితే ఉన్నావ్ కృష్ణ ఏ పనులు చేయొద్దు అని చెప్పాను కదా అని అంటుంది వడ్డించడం కూడా పనేనా అత్తయ్యా అని అంటుంది నాకు తెలుసు కృష్ణ నువ్వు నా దగ్గర వాదించకుండా చెప్పింది చెయ్ అని అంటుంది. కృష్ణ సైలెంట్ గా కూర్చుంటుంది ఇక అప్పుడే భవాని రేవతితో కృష్ణకి స్పెషల్గా చేయించిన వంటకాలే పెట్టండి ఈరోజు నుంచి కృష్ణ మనం తినే అన్నం కాకుండానేను చెప్పిన వంటలే తినాలి అని అంటుంది దాంతో కృష్ణకు ఏమీ అర్థం కాదు భవాని నీకోసం నువ్వు కడుపుతో ఉన్నావని నీకు ఏ నెల ఆహారం పెట్టాలో నేను అన్ని రేవతికి చెప్పాను తను అలానే చేసి పెడుతుంది నువ్వు అవే తినాలి తింగరి అని అంటుంది. కృష్ణకి భవాని చూపిస్తున్న ప్రేమకి ఏం చెప్పాలో తెలియదు ఎదురుగా ముకుంద కూర్చుని ఉంటుంది ముకుందని చూస్తుంది ముకుంద కూడా కృష్ణ మురారి లను చూస్తుంది. కృష్ణ మనసులో ఎదురుగా నా బిడ్డను వస్తున్న తల్లిని పెట్టుకొని నేను నటించడం నాకు అసలు నచ్చట్లేదు ఏమిటి భగవంతుడా ఈ కష్టం నాకు అని అనుకుంటుంది. కృష్ణ ఇబ్బంది పడడం మురారి కూడా గమనిస్తాడు. ఇక కావాలనే ముకుందా అప్పుడు మీకు ఇప్పుడు ఒక జిల్లాకి ఇస్తాను చూడు అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 14 Episode 469
Krishna Mukunda Murari May 14 Episode 469

ఇక కృష్ణకి స్పెషల్ వంటకం చేసారు అని తెలిసి ముకుందా కావాలని భవానీతో నేను కూడా వెంటనే టేస్ట్ చేయొచ్చా అని అడుగుతుంది. దానికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ప్రెగ్నెంట్ కోసం చేసిన వంట తను తింటా అన్నది అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న రజిని అదేంటి కృష్ణ కోసం స్పెషల్గా వంట చేస్తే అది నువ్వు అడుగుతున్నావు. నువ్వు కడుపుతో ఉన్నావా అని డైరెక్ట్ గా మొహం మీరే అడిగేస్తుంది దాంతో ఒక్కసారిగా మురారి కృష్ణ ఇద్దరు కంగారు పడతారు. కడుపుతో ఉన్న కృష్ణ ఏమో తినడానికి ఇబ్బంది పడుతుంది. కడుపుతో లేని నువ్వేమో పెట్టమని అడుగుతున్నావు మీ ఇద్దరి ని చూస్తుంటే నాకు ఏదో తేడాగా ఉంది అని రజని అనుమాన పడుతుంది. వెంటనే భవానీ దేవి అదేంటి రజిని వయసు పెరిగింది కానీ ఎలా మాట్లాడాలో నీకు ఇంకా తెలియలేదు ఆ అమ్మాయి ఏదో టేస్ట్ చూడడానికి అడుగు ఉంటుంది దాంట్లో తప్పేముంది అని అంటుంది. ముకుంద మురారి కృష్ణుడిని చూసి మొగుడు పెళ్ళాలు ఇద్దరికీ నేను అందరి ముందు ఇలా ఎందుకు అన్నానో తెలియక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు అని అనుకుంటుంది. ఇప్పుడు చూడండి మీకు ఇంకా అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను అని అంటుంది. అంతలో రజిని భవానితో నాకు అలా అనిపించలేదు లే వదినా అని అంటుంది. ఇక రేవతి టేస్ట్ చూడడానికి తినాలనిపిస్తే తిను కానీ ముందు ముందు తినే రోజులు నీకు కూడా వస్తాయి లే అని అంటుంది. ఆ మాట అనగానే కావాలని ముకుందా ఆదర్శని చూసి సిగ్గుపడుతుంది ఇక దాంతో కృష్ణకి ఒక్కసారిగా మైండ్ పోయినట్టు అయిపోతుంది. ఆదర్శ కూడా ముకుందని చూసి సిగ్గుపడతాడు వాళ్ళిద్దరూ నవ్వుకోవడం భవాని దేవి చూస్తుంది అక్కడున్న రేవతి కూడా అదంతా గమనిస్తుంది మురారి కూడా చూసి ఇదేంటి మీరా ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. ఇటు కృష్ణ కైతే తను ఊహించుకున్నదే నిజం అవుతుంది మనని భయపడుతూ ఉంటుంది. ముకుంద మాత్రం సంతోషంగా ఉంటుంది.

Krishna Mukunda Murari May 14 Episode 469
Krishna Mukunda Murari May 14 Episode 469

ఇక మరోవైపు ఆదర్శ లాన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ముకుంద ఇన్ని రోజులు నా మీద ప్రేమ లేదని అనుకున్నాను కానీ ముకుంద కూడా నేనంటే చాలా ఇష్టమని తను ఇందాక సిగ్గుపడడంతో తెలిసిపోయింది. రెండు రోజుల్లో తన పుట్టిన రోజు ఉంది తనకి సప్రైజ్ గా మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చాను ఈ గిఫ్ట్ ని తనకి అందరి ముందు ఇచ్చి ప్రపోజ్ చేస్తాను ఈ ప్రపోజ్ చేసుకోవడానికి కోసమే అని అనుకుంటాడు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు ఇప్పుడు నీ ఇష్టం కూడా నాకు అర్థమైంది ముకుందా నేనంటే నీకు చాలా ఇష్టం అందుకే రేవతి అత్తయ్య ఆ మాట అనగానే నీ సిద్ధిపడ్డవ్, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటాడు. అక్కడికి మురారి వస్తాడు. మురారి మనసులో మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆదర్శ మురారిని పిలుస్తాడు. ఆదర్శ చూసి మురారి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావే అని అడుగుతాడు. నీకు అనిపించింది కదా నీకు కనిపిస్తున్న సంతోషం కన్నా వెయ్యిరెట్లు ఎక్కువ నా మనసులో సంతోషంగా ఉంది నేను ముకుంద పోయిన తర్వాత చాలా బాధగా ఉంటే మీరా ఆ బాధ మొత్తాన్ని పోగొట్టేసింది ఈరోజు ఇంత సంతోషానికి కారణం అయింది. నేను ముకుంద నీ ఇష్టపడుతున్నాను. ముకుందని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ విషయం అమ్మతో కూడా చెప్పాను అమ్మ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఇక ముకుంద కూడా నేనంటే ఇష్టం ఉందని ఇందాకే తన సిగ్గుపడటంతో నాకు అర్థమైంది అందుకే చాలా సంతోషంగా ఉంది. అయినా నువ్వేంటి అలా ఉన్నావు అని అడుగుతాడు అప్పటికి ఆదర్శ్ చెప్పిన మాటలు విని మురారి కి మైండ్ బ్లాక్ అవుతుంది. తన బిడ్డను వస్తున్నా ముకుందని ఆదర్శ్ పెళ్లి చేసుకుంటాను అంటే మురారి కి ఏం చెప్పాలో తెలీక సైలెంట్ గా ఉంటాడు. ఎందుకు మురారి ఎలా ఉన్నావు అని ఆదర్శ్ మళ్ళీ అడుగుతాడు కృష్ణకు ఏమైనా వచ్చిందా మీ బిడ్డ సేఫ్ గానే ఉన్నాడు కదా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు ఆదర్శ అంతా బానే ఉంది అని అంటాడు మరి అలాంటప్పుడు సంతోషంగా ఉండు ప్రేమించిన నేను పెళ్లి చేసుకోబోతుంటే నేను ఇంత సంతోషంగా ఉంటే నువ్వు తండ్రివి కాబోతున్నావు ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి అని అంటాడు. నేను సంతోషంగానే ఉన్నాను అని అంటాడు మురారి ఇంక నువ్వు సంతోషంగా ఉన్నావు నేను సంతోషంగా ఉన్నాము అందరం సంతోషంగా ఉంటాము ఈ పెళ్లి జరగాలి అని అనుకోని అక్కడి నుంచి వెళ్తాడు ఇక ఆదర్శ మాటలు తెలుసుకొని మురారి ఆలోచిస్తూ ఉంటాడు.

ఇక మరోవైపు ముకుంద నేనే చేసిన పనికి మొగుడు పెళ్ళాలు ఇద్దరు, బాగా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు కడుపులో బిడ్డ ని మోస్తూ పెళ్లంటే సిగ్గుపడడంతో, ఇద్దరికీ ఏం చెప్పాలో తెలియక సతమతం అయ్యుంటారు.నా ఊహి నిజమైతే ఈపాటికి ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి నన్ను నిలదీసే వాళ్లే అని అనుకుంటూ ఉండగా అప్పుడే కృష్ణ ముకుంద దగ్గరికి వస్తుంది. అదిగో వచ్చేసింది అని అనుకుంటుంది ముకుంద. కృష్ణ వస్తువుని అసలు నువ్వు చేసిన పనికి ఏమన్నా అర్థం ఉందా మనమే పొజిషన్లో ఉన్నామో నీకు తెలుస్తుందా అని అంటుంది. ఒక రెండు నిమిషాలు నువ్వు ఆగుతావా నేను చెప్పేది వింటావా అని అంటుంది. వాళ్ళు అలా మాట్లాడగానే నేను సిగ్గుపడకుండా నాకు ఆదర్శం అంటే ఇష్టం లేదు అన్నట్లు బిహేవ్ చేయమంటావా అని రివర్స్లో ముకుంద క్యూస్షన్ చేస్తుంది. పెళ్లి గురించి మీరెవరు మాట్లాడొద్దు కృష్ణ గర్భవతి కాదు తన గొడ్రాలు అని బయట పెట్టమంటావా నువ్వు విడిగుడి గొడ్రాలు అయినా కానీ బానే నటిస్తున్నావు కదా నేను నటించాలి కదా అని అంటుంది. ఆ మాటలకి కృష్ణకి బాగా కోపం వస్తుంది. నువ్వు గర్భవతివి కావని ఇంట్లో చెప్పేవంటే చెప్పేస్తాను కృష్ణ అని అంటుంది. కృష్ణ బాధపడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari May 14 Episode 469
Krishna Mukunda Murari May 14 Episode 469

ఇక కృష్ణ కోపంతో బాధతో ముకుందతో నువ్వు అలా సిగ్గుపడడం వల్ల, ఆదర్శ్ నీ మీద ఆశలు పెంచుకుంటాడు కదా అని అంటుంది కొత్తగా అసలు పెంచేది ఏంటి అప్పటినుంచో నామీద ఆశతోనే నా వెంట పడుతూ ఉన్నాడు. నేను అంటి ముట్టినట్టు ఉంటే తనే వదిలేస్తాడు అని అనుకున్నాను కానీ అది వదలకుండా నా చుట్టూనే తిరుగుతున్నాడు. ఇక్కడ దాకా చూస్తుందని విషయం నాకేం తెలుస్తుంది మీ అత్తయ్య కూడా ఇలా మాట్లాడుతుందో అని నాకు ఏమైనా తెలుసా నేను ఏమైనా కలగన్నానా అని అంటుంది. నువ్వు కలగనక పోవచ్చు ఆదర్శ తన కలలు నిజమవుతాయని అనుకుంటున్నాడు నువ్వు కూడా అలానే ప్రవర్తిస్తున్నావు నీకు అసలు ఏ ఉద్దేశం లేనప్పుడు నువ్వు ఎందుకు నా బిడ్డను మోస్తానని ఏసిపి సార్ దగ్గరికి వచ్చి బతిమిలాడావో నీకు ఏ ఉద్దేశం లేనప్పుడు ఆదర్శతో డైరెక్ట్ గా ఆ విషయం చెప్పేయాలి కదా, ఎందుకు అతను అంత క్లోజ్ గా ఉంటున్నారు ఎందుకు షాపింగ్ లో తిరుగుతున్నావ్ అని ఉంటుంది బ్లాక్ అవుతుంది. అందరూ ఇలా అనుకుంటారని కలగన్నాను అని అనుకుంటున్నావే నువ్వు అంత క్లోజ్ గా ఉంటే నీకు కూడా ఇష్టం ఉందని అందరూ అని కూడా అది నువ్వు ఊహించలేదా అని అడుగుతుంది కృష్ణ. నీకు ఇష్టమే లేనప్పుడు మా అత్తయ్య అనగానే నువ్వెందుకు సిగ్గుపడాలి, నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది కదా అని అంటుంది. రాష్ట్ర డైరెక్టుగా నువ్వంటే ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది కదా అని అంటుంది. ఇంకో విషయం కూడా తెలిసింది మీరా ఆదర్శ సంగీత పెళ్లి జరిపిస్తానని రజనీకెందుకు మాటించావు అని అడుగుతుంది అని మాటకి ముఖంగా షాక్ అవుతుంది. మీరు ఏ ఉద్దేశం లేకపోతే డైరెక్ట్ గా సంగీత ని పెళ్లి చేసుకోమని ఆదర్శ్ తో చెప్పాలి కదా అలా కాకుండా సంగీతకి ఆశలు కలిగించి ఇటు ఆదర్శ్ కి కూడా ఆశలు పుట్టించి నువ్వేం చేద్దాం అనుకుంటున్నా వ్ అని డైరెక్ట్ గా మొహం మీద అడుగుతుంది కృష్ణ. ఆ మాటలకు ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుందిముకుంద. నిజం చెప్పకుండా సంగీతకే ఆశలు పుట్టించి మా దగ్గర సరోడ శ్రీ మదర్ గా నువ్వు ఇలా ఎందుకు నటిస్తున్నావ్ మీరా అని గట్టిగా అడుగుతుంది కోపం వస్తుంది. ఏం చెప్పమంటావు కృష్ణ ఆదర్శ మొహం మీద ఇష్టం లేదని చెప్పడం నాకు క్షణాల్లో పని, నా వెంట పడుతున్నాడు అని తెలిసిన మొదటి చెప్పేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే ముకుంద చచ్చిపోయిందని ఆదర్శ బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను కూడా కాదంటే ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడని నేను సైలెంట్ గా ఉన్నాను అది ఇక్కడ దాక దారి తీస్తుందని అనుకోలేదు. అసలు ఆదర్శ నేను కోరుకుంటే రజనీకి ఎందుకు మాటిస్తాను సంగీత తో పెళ్లి జరిపిస్తానని అసలు నేనే ఆదర్శని కోరుకుంటే నీ బిడ్డని నా కడుపులో ఎందుకు మోస్తాను. ఆదర్శం పెళ్లి చేసుకుంటే నాకు ఒక బిడ్డ వస్తుంది కదా కానీ నేను మంచిగా పోయి, ఇలా చేస్తే నువ్వు నన్ను రివర్స్లో ఇలా మాట్లాడుతున్నావా కృష్ణ అని బాధపడుతున్నట్టు నటిస్తుంది. నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను నీకు తెలియట్లేదు.ఒకవైపు ఆదర్శ్ నా వెంట పడుతున్నాడు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు మరో వైపు భవాని దేవి ఆశ్రయమించింది ఆవిడ మాటని కాదనలేను.నీ బిడ్డ నా కడుపులో ఉంది ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి.వీటన్నిటిని మేనేజ్ చేయలేక నేను ఎంత నలిగిపోతున్నానో నీకు తెలుసా నా ప్లేస్ లో నువ్వుంటే కూడా ఇలానే ప్రవర్తిస్తావు అని అంటుంది. నీ మంచి కోసం ఆలోచించడం నా తప్పేనా అని అంటుంది మీరా, ఇక కృష్ణ మాట్లాడదాం అనుకునే టైం కి అక్కడి కి ఆదర్శ వస్తాడు ముకుందా అని పిలుస్తాడు. అంటే నీ ముకుందా ఆకర్ష్ గారు మీరు ఇలా వచ్చారు అని అంటే మీకోసమే అని అంటాడు నీతో మాట్లాడతానని చెప్పాను కదా పదండి వస్తాను కృష్ణతో ఏదో మాట్లాడుతున్నాను లేండి మర్చిపోయాను మీరు పిలిచిన విషయం అని అంటుంది. కృష్ణ మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఆదర్శ తో వెళ్ళిపోతుంది ముకుంద.

Krishna Mukunda Murari May 14 Episode 469
Krishna Mukunda Murari May 14 Episode 469

ఇక భవానీ దేవి ఆదర్శ్ ముకుందల పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ముకుంద డైనింగ్ టేబుల్ దగ్గర సిగ్గుపడడం,ఆదర్శముకుంద కోసం షాపింగ్ చేయడం ఇవన్నీ గుర్తు చేసుకొని, వాళ్లకి ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ఇష్టం అని అర్థమయ్యే భవానీ దేవి ఆదర్శ్ ముందల పెళ్లి చేయడానికి రేవతిని, కృష్ణని రూమ్ కి రమ్మని పిలుస్తుంది.రేవతి ఏంటి అక్క పిలిచావు అని అడుగుతుంది అప్పుడే అక్కడికి కృష్ణ కూడా వస్తుంది ఏమిటి ఇద్దరిని పిలిచారు అని అడుగుతారు ఇక దాంతో నేను ప్రణయం తీసుకున్నాను అని అంటుంది భవాని దేవి. ఆదర్శముకుందని పెళ్లి చేయాలని అనుకుంటున్నాను మీరు ఏమంటారు అని అంటుంది దాంతో రేవతి చాలా సంతోషం అక్కయ్య చాలా తొందరగానే నేను తీసుకున్నాను అని అంటుంది. కృష్ణ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది నేను అనుకుంటూనే ఉన్న ఇలాంటిది ఒకరోజు వస్తుందని అది ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు అని అంటుంది కృష్ణ మనసులో ఇక వాళ్ళిద్దరికీ ఒకరుంటే ఒకరికి ఇష్టం ఉందని అర్థమైంది కదా ఇక ఆలస్యం ఎందుకు రేవతి రేపే పంతులుగా అని పిలిపించి వాళ్ళు పెళ్లి చేద్దామని అంటుంది. ఒకసారి కృష్ణ వద్దు అత్తయ్య అని అరుస్తుంది దాంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయి కృష్ణ వైపు చూస్తారు ఏమైంది కృష్ణ వెళ్లాను కానీ అలా అరిచావు అని అంటుంది భవాని ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మరి కృష్ణ భవానితో నిజం చెప్పిందా, లేదా పెళ్లి ఆపడానికి అబద్ధం చెప్పిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణా మురారి ఇద్దరు ముకుందని రెస్టారెంట్ కి తీసుకువెళ్లి మాట్లాడుతుంటారు. కృష్ణ నేనైతే భయపడ్డాను అదే జరిగింది. ఇంతకాలం భవాని అత్తయ్య పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో ఒకటి చెప్పొచ్చు అనుకున్నాను ఇప్పుడు పిలిచి ఆదర్శ తో పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన నిర్ణయాన్ని నాతోనే చెప్పింది నువ్విచ్చిన ఎక్స్ప్రెషన్ వల్ల భవానీ దేవి ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్తుంది. దాంతో ముకుందా ఇద్దరు నాదే తప్పని మాట్లాడుతున్నారు నేను మీకోసం ఎంత చేస్తున్నానో మీ బిడ్డని నా కడుపులో మోస్తున్నాను కానీ మీరు మాత్రం నన్ను దోషిగా చూస్తున్నారు అని అంటుంది

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri