NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది. పంతులు గారితో ఆదర్శ్ దగ్గరలో ఏమైనా ముహూర్తం పెట్టండి అని అంటాడు తొందర ఎందుకురా చూస్తున్నారు కదా అని అంటుంది భవాని. ఆదర్శ వైపు చూసి నవ్వుతాడు ముకుంద కూడా నవ్వుతుంది. కృష్ణుని బాధ పెట్టాలంటే వీడితో క్లోజ్ గా ఉండక తప్పట్లేదు అని అనుకుంటుంది ముకుంద. ఇక అప్పుడే అక్కడికి కృష్ణ మురారి ఇద్దరూ వస్తారు భవానీ దేవి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలవడంతో ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. చూసావా నీకు కుడికను వదులుతుంది అని అర్థం జరుగుతుంది అని అన్నావు ఇప్పుడు ముహూర్తం పెట్టడం కన్నా అనర్ధం ఉంటుంది అని అంటాడు మురారి ముందు ఈ కార్యక్రమాన్ని ఎలా ఆపాలు అది ఆలోచించండి అని అంటుంది కృష్ణ. అప్పుడే భవానీ దేవి కృష్ణ మురారి అని ఏంటి అక్కడే ఆగిపోయారు రండి అని ఇద్దరు వెళ్లి సోఫాలో కూర్చుంటారు. ఇక భవానీ దేవి పంతులు గారితో మీరు ఆరు నెలలు సంవత్సరం దాకా ఆగే ముహూర్తాలు కాకుండా దగ్గరలో ఉన్న ముహూర్తాలు పెట్టండి ఎందుకంటే నా కోడలు అసలే కడుపుతో ఉంది. తన హుషారుగా ఉన్నప్పుడే ఈ పెళ్లి జరిగిపోవాలి. తనకి నెలలు నిండితే మళ్ళీ హుషారుగా ఈ పెళ్లిలో తిరగలేదు. తను లేకపోతే పెళ్లిలో సందడే ఉండదు అని కృష్ణ గురించి చెబుతూ పంతులు గారితో ఆదర్శ్ పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్తుంది. పంతులుగారు చూస్తున్నాను అమ్మ. మీకు అనువుగా ఉండే ముహూర్తమే పెడతాను అని అంటాడు. ముకుంద మాత్రం ఇప్పుడు తెలిసిపోతుంది ఇద్దరికీ పెళ్లి ఆపడం ఎంత కష్టమో, అని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights
Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights

ఆదర్శ్ ముకుందల పెళ్ళికి పంతులుగారు సరిగ్గా వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం అని ఉంది అని చెబుతారు. అంతే కృష్ణ మురారిల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఈ పెళ్లి ఎలా ఆపాలా అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటే ఇంత త్వరగా ముహూర్తం సెట్ అవ్వడంతో వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ముకుంద మాత్రం మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి నా వాల్యూ తెలుస్తుంది అని అనుకుంటుంది. మధు మాత్రం ఇంత త్వరగా పెళ్లి అంటే ఎలాగా పనులన్నీ చేసుకుంటాం అని అంటాడు అప్పుడు ఆదర్శ్ ఎప్పుడైనా పెళ్లి ముహూర్తం ఎన్ని రోజులు ఉన్నా కానీ వారం రోజులు ముందే పనులన్నీ చేస్తాం కదా అని ఆదర్శం అంటాడు బ్రో ఎంత కష్టమైనా సరే నీ పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ ఈ వారం రోజుల్లోనే చేసే బాధ్యత నాది అని మధు అంటాడు దాంతో ఆదర్శ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓ పక్క ఆదర్శ్ ముకుందలా పెళ్లి అన్నా కూడా కృష్ణలో ఎలాంటి చలనం ఉండదు ఆ విషయాన్ని ఇద్దరు గమనిస్తారు ఎందుకు కృష్ణ అలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights
Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights

కృష్ణ మురారి కంగారు పడుతూ ఉండగా ముకుందా అక్కడికి వస్తుంది. కృష్ణ కోపంగా ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి ముహూర్తం పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకోవాలనుకుంటున్నావు అని కృష్ణ అడుగుతుంది. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవడానికి వీల్లేదు అని ఉంటుంది. అయితే మీరే పెళ్లి ఆపేసేయండి అని ముకుందా రివర్స్లో కృష్ణ వాళ్ళకి కండిషన్ పెడుతుంది. అది విని ఇద్దరూ షాక్ అవుతారు. అవును భవాని గారి నాకు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి, ఆవిడ మాటని నేను కాదనలేను. అలాగని మీ బిడ్డని మోస్తున్నాను , కాబట్టి ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పలేను. అంతగా చెప్పాల్సి వస్తే నిజం చెప్పడమే కానీ, నేను ఇంకా ఎన్నాళ్ళని అబద్ధం చెప్పమంటారు. అందుకే ఈ పెళ్లి ఆపాల్సిన బాధ్యత మీదే, ఆదర్శ్ మీకు తమ్ముడే కాబట్టి మీరు ఏదో ఒక విధంగా ఆదర్శ్ కి నచ్చజెప్పి, ఈ పెళ్లి ఆపేయండి. నా అంతట నేనుగా అయితే ఈ పెళ్లి నాకు వద్దు అని నేను చెప్పను. మీరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపండి అంతేగాని నేను చెప్పి వెళ్లి ఆపుతానని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు ఆ ఆలోచన ఉంటే ఇక్కడితో ఆలోచన వదిలేసేయండి అని ముకుందా అయితే కృష్ణ మురారిలో ఇద్దరికీ క్లారిటీ ఇస్తుంది. అది కాదు ముకుందా అని కృష్ణ మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా, వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరూ ఆలోచనలో పడతారు.

Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights
Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ముకుంద భోజనం చేస్తూ మధ్యలో ఏంటి కడుపులో ఏదో వికారంగా ఉంది అని అనుకుంటుంది. వెంటనే ముకుంద కి వాంటింగ్స్ వస్తాయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ముకుంద వాంతులు చేసుకుంటుంటే మురారి వెళ్లి ముకుంద చెవులు మూసి తనని కేరింగా చూసుకుంటాడు. అక్కడే ఉన్న రజిని ఇదేం విచిత్రమో కడుపుతో ఉన్న కృష్ణవంతులు చేసుకోవట్లేదు పెళ్లికాని ముకుందకి వాంతులు అవుతున్నాయి అని అంటుంది. భవాని దేవి రజనీ వైపు అనుమానంగా చూస్తుంది ఇక అప్పుడే ఆదర్శ్ వచ్చి ముకుందతో మురారి క్లోజ్ గా ఉండడం గమనిస్తాడు. ముకుందా మనసులో ఇకమీదట నేను నీ వెనుక తిరగడం కాదు మురారి నువ్వే నా వెనక పరిగెత్తుకుంటూ వస్తావు అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights
Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights

ఆదర్శ్ వెంటనే ముకుంద దగ్గరకు వెళ్లి నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవ్వరికీ చెప్పుకోలేక పోయినా పర్వాలేదు. నాతో చెప్పు నేను చూసుకుంటా అని ఆదర్శ్ అంటాడు. ఆ మాటలకు భవాని మనసులో అనుమానం కలుగుతుంది. అంటే ముకుందా ఏమైనా ప్రెగ్నెంట్ అయిందా, అది కూడా ఆదర్శ వల్ల ప్రెగ్నెంట్ అయి ఉంటుందా అని భవాని ఆలోచిస్తూ ఉంటుంది. ఆదర్శ్ ముకుంద మీద చూపించే గైరింగ్ ముకుంద కి ఈ సమయంలో వాంతులు అవ్వడం ఇదంతా చూస్తుంటే భవానీకి ముకుందా ప్రెగ్నెంట్ అని అనుమానం బలంగా ఉంటుంది అది కూడా ఆదర్శ్ వల్లే అని ఫిక్స్ అవుతుంది. ఇక వెంటనే ఆ విషయాన్ని కృష్ణ తో మాట్లాడుతుంది. ముకుంద ప్రెగ్నెంట్ కదా అని కృష్ణని అడుగుతుంది. లేదు అత్తయ్య మీకు ఎందుకు ఆ అనుమానం కలిగింది అని అడుగుతుంది. మీరు పొరపాటు పడుతున్నారు అలాంటిది ఏమీ లేదు అని చెబుతుంది. లేదు కృష్ణ నిజంగానే ముకుంద ప్రెగ్నెంట్, కావాలంటే నువ్వు టెస్ట్ చేసి చూడు అని కృష్ణతో భవాని అంటుంది. ఇక కృష్ణ కంగారు పడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights
Krishna Mukunda Murari Today Episode May 17  2024 Episode 472 highlights

 

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella