NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari May 28 Episode 481: ముకుంద ని చంపేయాలన్న ఆదర్శ..మిస్సయిన మురారి ఆచూకీ తెలియనుందా..? భవానీ దేవి భయం..

Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights

Krishna Mukunda Murari May 28 Episode 481: కుటుంబ సభ్యులందరూ టిఫిన్ చేస్తూ ఉంటే ముకుంద వచ్చి, నాకు మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అయిపోయాయి తీసుకురమ్మని మదు తో చెప్తుంది. నీ కింద సర్వెంట్లు ఎవరూ లేరు తీసుకురావడానికి అని మధు చెప్తాడు తర్వాత నందుని అడుగుతుంది. నందు నీకు తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తుంది దాంతో ఇక సంగీత వైపు చూస్తుంటే సంగీత నేనైతే తీసుకురాను అని చెప్తుంది ఇక వెంటనే ఆదర్శ కానించి కోపంగా లేచి వెళ్ళిపోతుంటే రేవతి అదేంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావ్ అని అంటుంది వెంటనే ఆదర్శ కడుపులో ఆకలి ఉంటే సరిపోదు మనశాంతి కూడా ఉండాలి అని అంటాడు. రేవతి ఇంటికి పట్టిన శని వదిలిన తర్వాతే మనకి మనశాంతి అని అంటుంది వెంటనే ముకుందా నన్నే కదా మేడం మీరు అనేది అనండి నేను పరాయి దాన్ని ఎన్నైనా అంటారు. కానీ నా కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు. కృష్ణ తల్లి కాబోతుందని తెలియగానే ఎంత హడావిడి చేసి ఎంత సంతోషపడ్డారు. తనకి ప్రత్యేకంగా టిఫిన్లు భోజనాలు జ్యూసులు అంటూ అని ఇచ్చారు. కానీ నేనేమైనా అడిగానా టాబ్లెట్స్ తీసుకు రమ్మన్నాను అది కూడా మీ వారసుడు కోసం, అని అంటుంది ముకుంద వారసుడు వారసుడు అని పదేపదే ఆయనకు నీ బిడ్డకు తండ్రి మురారి అంటే ఎవరు నమ్మట్లేదు ఇక్కడ, అని అంటుంది రజిని వెంటనే నమ్మరు కలికాలం కదా సాక్షాలు ఆధారాలు ఉంటేనే నమ్ముతారు అందుకే కదా డిఎన్ఏ టెస్ట్ చేసుకోమని చెప్తున్నాను. అప్పుడు తేలిపోతుంది అసలు నా కడుపులో పెరుగుతుంది ఎవరి బిడ్డ అనేది. ఎన్ని టెస్టులు చేసుకున్నా కానీ మురారి అన్నయ్య తప్పు చేశాడు అంటే నేను నమ్మను అని అంటుంది నందు. మీ అన్నయ్య ఉన్నట్టయితే ఈ టెస్టులు గోలే ఉండేది కాదు నా బిడ్డకు తండ్రి నన్ను ఒప్పుకునేవాడు. అయినా మిమ్మల్ని కాదు మురారి అనాలి బిడ్డని మోస్తున్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటానని మాట ఇచ్చి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మురారి వస్తాడుగా అప్పుడు మీ అందరికీ సమాధానం చెప్తాడు అప్పటి వరకు నన్ను నేనే చూసుకుంటాను. నా టాబ్లెట్స్ నేనే తెచ్చుకుంటాను అని ముకుంద అంటుంది. ఈ మాట ఏదో ముందే చెప్పినట్లయితే అసలు డిస్కషన్ ఉండేది కాదు కదా ప్రశాంతంగా టిఫిన్ చేసే వాళ్ళం అని అంటాడు మధు ఇక ముకుంద కోపంగా వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights
Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights

ఇక మరోవైపు కృష్ణ ఇంట్లో ప్రభాకర్ కృష్ణ దగ్గరికి చీర తీసుకొచ్చి ఇచ్చి ఈ చీర అమ్మవారి చీర ఇది కట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది ఇది కట్టుకొని రెడీ అవ్వు అని అంటారు. సరే అని అంటుంది కృష్ణ ఇక అంతలో పక్కనే ఉన్న భవాని దేవితో శకుంతల వదిన మీకు కూడా చీరలు తెప్పించాము కొత్తవి మీరు కూడా కట్టుకొని రెడీ అవ్వండి అని అంటుంది నేనా అని అంటుంది భవాని వదిన మీరు కూడా జాగ్రత్తగా రండి. ఇప్పుడు నేను గుడికి రావడం అవసరమా అని అంటే రాకరాక వచ్చారు ఇంత మంచి శుభకార్యం మళ్లీ మళ్లీ ఇట్లాంటి శుభకార్యాలు రావు అని అంటుంది శకుంతల వెంటనే ప్రభాకర్ నువ్వు కూడా రావాలి చెల్లి అసలు మా ఊరి జాతరచాలా బాగుంటుంది ఒకసారి మీరు వచ్చి ముక్కుంటే చాలా బాగుంటుంది.మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అని అంటాడు. మురారి కూడా ఉన్నట్టయితే బాగుండేది మీ ముగ్గురిని మా ఊర్లో వాళ్లకు పరిచయం చేసేవాణ్ణి అని అంటాడు ప్రభాకర్. మా ఊర్లో నేనంటే చాలా మందికి ఫ్యాన్స్ ఉన్నారు అని అంటే, శకుంతల ఊరుకోవయ్యాను మరి బడాయి చెప్తావు పిల్లలందరికీ చూపిస్తే దిష్టి తగులుతుంది అని అంటుంది. అది కాదు అందరూ అడుగుతారు కదా అందుకే అని అంటాడు ప్రభాకర్ ఇక భవాని దేవితో ఒకసారి మురారి కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అని అంటాడు ఇక వెంటనే భవాని దేవి కంగారుపడుతూ అది మురారి ఫోను కలవట్లేదు కదా అని అంటుంది. ఇక కృష్ణ కూడా ఇందాకే చెప్పింది కదా ప్రాజెక్టు వర్క్ కోసం ఎక్కడికో వెళ్లారు కదా, ఈసారి మీ ముగ్గురం కలిసి వస్తాంలే అని అంటుంది సరేలే అని అంటాడు ప్రభాకర్ ఇక నేను పెద్ద ఎత్తు వెళ్లిపోతాను కదా మురారి రాకపోయినా పర్లేదులే అని అంటుంది కృష్ణ. ఆ మాటలకు భవానీ దేవి భయపడుతుంది ఇది నాతో పాటు అక్కడికి వస్తే అక్కడ మురారి లేరన్న విషయం తెలిసిపోతే దీని గుండె ఆగిపోతుంది ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. ఇక కృష్ణ రెడీ అవ్వడానికి వెళ్తుంది భవానీ దేవి నాతో పాటు కృష్ణ అక్కడికి వచ్చిన నిజం తెలియకుండా ఉండాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights
Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights

ఇక మరోవైపు ఆదర్శ ఇంట్లో మందు తాగుతూ ఉంటాడు. ముకుందా తనవైపు ప్రేమగా చూద్దాం తర్వాత వాంటింగ్స్ చేసుకుంటే మురారి వెళ్లి చెవులు ముయ్యడం ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు. ముకుందా నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మురారి అని చెప్పడం గుర్తుచేసుకొని బాధగా కోపంగా తన రాక దగ్గరికి వెళ్లి గన్ తీసుకుంటాడు. ముకుంద టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆదర్శ కోపంగా గం తీసుకుని వెళ్లి ముకుందా కి గన్ గురి పెడతాడు. అప్పుడే ఇంట్లో అందరూ వచ్చి ఆదర్శ్ ని ఏం చేస్తున్నావ్? ఆదర్శ గని దగ్గర పెట్టావు అని తన నుంచి ఆ గండం తీసుకోవడానికి ట్రై చేస్తారు ఈ క్రమంలోని ఆగని పేలుతుంది ఇక దాంతో ఒకసారిగా ఆదర్శ ఆగిపోతాడు ఏంటి చంపేస్తావా అని రేవతి ఆదర్శం కొడుతుంది. ఎందుకు చంపాలి అనుకుంటున్నావు తన్ను మోసం చేసింది అనుకో తను నీ మీద కోపం ఉన్నా కానీ చంపుతారా అని అంటుంది దాంతో అవును చంపాలనే ఉంది అని అంటాడు అసలు ఇది చేసిన మోసానికి ఏదైనా చేయొచ్చు అని అంటాడు ఆదర్శ నాతో ప్రేమగా ఉన్నట్టు నటించింది. నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాయమాటలు చెప్పింది ఇప్పుడేమో మురారి తన బిడ్డకు తండ్రి అంటుంది మొదట ఆ మాట చెప్పినప్పుడు నేను నిజమే అనుకున్నాను కానీ ఆలోచిస్తే అర్థమవుతుంది ఇదే మోసం చేసింది మురారి తప్పేం లేదు అని అంటాడు. ఇదిమురారితో బిడ్డని కలిగి ఉంటే మరి నాతో ఎందుకు క్లోజ్ గా ఉంటుంది అంటే ఇది కావాలనే మోసం చేస్తున్నట్టే కదా అని అంటాడు అసలు మురారి కనిపించకపోవడానికి కారణం కూడా ఈ ముకుంద ఏమో అని నాకు డౌట్ గా ఉంది అని అంటాడు. డౌట్ ఏంటి పిన్ని కచ్చితంగా మురారి కనిపించకుండా పోవడానికి ఈ ముకుందే కారణం ఏం చేసావే నా మురారిని ఎక్కడ దాచి పెట్టావు అని ఆదర్శం ముకుంద మీదకి మళ్లీ వెళ్తాడు. దాంతో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆపుతారు చూసావా నా కుటుంబం అంటే ఎలా ఉందో ఇలాంటి కుటుంబాన్ని నువ్వు మోసం చేయాలనుకుంటే నువ్వు ఇంత చేసినా కూడా ఇంత నిందలు వేసినా కూడా ఇంకా నీ మీద జాలి పడుతున్నారే కానీ ఎవరు కూడా నిన్ను చంపాలని అనుకోవట్లేదు ఇది నా కుటుంబం అంటే అని అంటాడు. నన్ను వదలండి పిన్ని దీనిని రోజు చంపేస్తాను అని అంటాడు. వెంటనే మధు ఆదర్శ్ ని లోపలికి తీసుకొని వెళ్తాడు. దినంతటికీ కారణం అదే అని చెప్పి ఆదర్శ లోపలికి వెళ్ళిపోతాడు. రేవతి ముకుందతో ఆదర్శ ఏదో తాగి వాగుతున్నాడని అనుకుంటున్నాను అదే ఆదర్శ చెప్పింది నిజం అనుకో, నా మురారి కనిపించకుండా పోవడానికి కారణం నువ్వే అని తెలిస్తే ఇంట్లో ఎవ్వరు నిన్ను క్షమించరు. చంపేస్తాం అని బెదిరిస్తుంది రేవతి ఇక ముకుందా ఆలోచనలో పడుతుంది.

Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights
Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights

ఇక మరోవైపు ప్రభాకర్ అందరూ కలిసి జాతరకు తీసుకువెళ్తాడు. అక్కడ తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు. నీ కూతురు నెలతప్పిందంట కదా అని అడుగుతారు. అందరూ తెలిసిన వాళ్ళు కృష్ణుని పలకరిస్తూ మంచి మాటలన్నీ చెప్తూ ఉంటారు. అయినా మీ పిన్ని బాబాయ్ మిమ్మల్ని బాగా చూసుకుంటారులే అని అంటారు. మీ బాబాయి ప్రతిదానికి కిష్టయ్యకు అది కావాలి ఇది కావాలి అని తీసుకొస్తారు కదా అని అంటారు. పిల్లలు ఏదైనా కావాలంటే తీసుకురామని శకుంతల అంటుంది. ఇక వచ్చినవాళ్లు కృష్ణతో ఆడపిల్లని కంటే మా అబ్బాయికి ఇచ్చి చేసుకోవచ్చు అని, అంటారు. ఏంటి అప్పుడే ఇంకా మా అమ్మాయి కానలేదు నువ్వు సంబంధం గురించి మాట్లాడుతున్నావు దానిని హక్కులు వాళ్ళ బియ్యపురాలికే ఉంటాయి అని భవానిని పరిచయం చేస్తుంది ఇక అప్పుడే ప్రభాకర్ వచ్చి ఏంటి ఇక్కడ మాట్లాడుతున్నారు పదండి వెళ్దాం అని అంటాడు ఇక అందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఇక కృష్ణతో వెళ్లి ముడుపు కట్టు పండంటి బిడ్డ పుట్టాలని అని అంటారు ప్రభాకర్. కృష్ణ ఆలోచిస్తూ ఉంటే భవానీ దేవి వెళ్లి ముడుపు కట్టు అమ్మవారి నీకు అంత మంచే చేస్తుంది అని అంటుంది. ఇక వెంటనే కృష్ణ అమ్మవారికి ముడుపు కడుతుంది. ఇది వెంటనే కృష్ణకి అక్కడ ముకుంద గుర్తుకు వస్తుంది ముకుంద అన్న మాటలన్నీ గుర్తుకు వస్తాయి. తను మీరే కాదు ముకుంద అన్న మాటలు కూడా గుర్తుకు వస్తాయి. కృష్ణ ముడుపు కట్టి ఆ తర్వాత అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ప్రభాకర్ భవాని దేవి కంగారు పడతారు కృష్ణ ఏమైంది అని అడుగుతారు. కృష్ణ ముఖం మీద నీళ్లు చల్లితే లేస్తుంది ఏమైంది అని అడిగితే మళ్లీ ముకుందా అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. ఏమైంది అని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం లేదు అని అంటుంది ఇక జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని ప్రభాకర్ శకుంతల మీద కోప్పడతాడు. కొబ్బరి నీళ్లు తాగుదువు గాని పదాన్ని తీసుకొని వెళ్తాడు అప్పుడే రేవతి భవానికి ఫోన్చేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights
Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights

మరోవైపు రేవతి మాట్లాడుతూ, భవానీ దేవితో అక్క అక్కడ మురారి ఉన్నాడా అని అడుగుతుంది ఇక్కడ లేడు అని అంటుంది భవాని దేవి మరి ఎక్కడికి వెళ్లాడు అక్క అని అంటుంది ఏమో రేవతి నాకు అదే అర్థం కావట్లేదు ఒకసారి అనిపిస్తుంది ఆ మీరా చెప్పింది నిజమేనేమో అని అందుకే మురారి ఇంట్లో నుంచి పారిపోయాడు ఏమో అనిపిస్తుంది అని అంటుంది. ఇక్కడేమో ఈ కృష్ణ మురారి ఎక్కడ అని అడుగుతుంది ఫోన్ చేయట్లేదు ఏందని అడుగుతుంది ఇక్కడికి ఎప్పుడొస్తాడని అంటుంది మీరు కూడా ఎవరు కృష్ణకి నిజం చెప్పద్దు నేను నిజం చెప్పలేదు అని అంటుంది. సరే అక్క అని అంటుందిరేవతి.ఇక భవాని దేవి అక్కడ ఉన్న దేవుడికి దండం పెట్టుకొని మా కుటుంబ సమస్య నుంచి మమ్మల్ని బయటపడే అని అంటుంది. ఇకనుంచి బయలుదేరి పక్కకి వస్తే కృష్ణ వాళ్ళు కనిపించరు ఎక్కడికి వెళ్లారని వెతుకుతూ ఉంటుంది భవాని మరోవైపు ప్రభాకర్ శకుంతల కూడా కృష్ణ ఎక్కడికి వెళ్లిందా అని వెతుకుతూ ఉంటుంది కృష్ణ దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. నా కడుపులో బిడ్డ లేకపోయినా నేను అందరినీ మోసం చేస్తున్నాను కన్నతల్లి లాంటి మా అత్తయ్య గారిని, మా పిన్ని నీ ఇద్దరినీ మోసం చేస్తున్నాను అని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights
Krishna Mukunda Murari Today Episode May 28 2024 Episode 481 highlights

రేపటి ఎపిసోడ్ లో ప్రభాకర్ జాతరలో అమ్మవారి ఊరేగింపు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న పంతులుగారు ఎవరైతే ఈ అమ్మవారి ఉయ్యాలని మోస్తూ మూడుసార్లు గుడి చుట్టూ తిరుగుతారు వారి కోరిక తప్పకుండా అమ్మవారి నెరవేరుస్తుంది అని చెప్తాడు దాంతో భవాని దేవి ఒకవైపు కృష్ణ ఒకవైపు పల్లకిని మోయాలి అని అనుకుంటారు ఇక ఇద్దరూ పల్లకిని మోస్తూ ఉంటే ప్రభాకర్ కృష్ణతో అమ్మాయి ఏదైనా బాధగా ఉంటే చెప్పు అని మొయ్యలేకపోతున్నావా అని అంటాడు నాకున్న సమస్యలు తో పోల్చుకుంటే ఈ అమ్మవారి పల్లకి పెద్ద బరివేమనిపించట్లేదు అని అనుకుంటుంది కృష్ణమనసులు ఎలాగైనా సరే నాకున్న సమస్యలను నువ్వే తీర్చాలి తల్లి అని అనుకుంటుంది అప్పుడే అమ్మవారి బొమ్మ పక్కకి పడబోతూ ఉంటుంది ఇక పంతులుగారు ఆపండి అని అంటాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella