Krishna Mukunda Murari: మురారి కృష్ణ గురించి పదేపదే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కృష్ణ మాత్రం నందిని గౌతమ్ ని ఒక్కటి చేయాలనే ఆలోచనలో ఉంటుంది. మురారిపై ప్రేమ ఉన్నా కానీ తన తండ్రిని మురారి ఏ కదా చంపింది అన్న ఆలోచనలో ఆ ప్రేమని పక్కకు నెట్టేస్తుంది.. మురారి మాత్రం కృష్ణ తనతో పాటే ఉండాలని తన ప్రేమను అర్థం చేసుకోవాలని అందుకు ఏం చేయాలా అనే ఆలోచనలో పడి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు..

గౌతమ్ లో వచ్చిన మార్పు స్పష్టంగా హాస్పటల్లో ఉన్న అందరికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మొదటిసారిగా గౌతమ్ మొహంలో నవ్వు చూసిన ఓ నర్స్ మీరు నవ్వితే చాలా బాగుంటారు అంటూ కాంప్లిమెంట్ కూడా ఇస్తుంది. ఇక కృష్ణ తన కోసం ఎదురు చూస్తూ ఉండగా గౌతమ్ సార్ అని పిలుస్తుంది గౌతమ సార్ కాదు.. గౌతమ్ అన్నయ్య అని పిలువు అని అంటాడు. నేనే కనుక అజ్ఞాతంలోకి వెళ్లకపోయి ఉండుంటే నన్ను మీ అత్తయ్య వాళ్ళు చంపేసి ఉండే వాళ్ళని.. పరువు హత్యల గురించి నువ్వు ఇప్పటివరకు వినలేదేమో కానీ.. మీ ఇంట్లోది జరిగేది అదే.. నా విషయంలో కాదు ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు అని గౌత మ్ కృష్ణని హెచ్చరిస్తారు.
ఏసీబీ సార్ ఉండగా నా ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు అని కృష్ణ ధైర్యంగా చెబుతుంది. అయితే మురారి సార్ తో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిగేలాగా చూడు కృష్ణమ్మ.. మాకు పిల్లలు పుడితే మీ పేర్లే పెట్టుకుంటాము. నాకు అమ్మాయి పుడితే కృష్ణ అని.. అబ్బాయి పుడితే మురారి అని పేరు పెట్టుకుంటాను అని అనగానే.. కృష్ణ ఎమోషనల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి బంధం శాశ్వతం కాదు అని కృష్ణకి తెలుసు కాబట్టి.
నందిని విషయంలో కృష్ణ తలదూర్చకుండా ఉండాలంటే కొన్నాళ్లు నందిని ఇక్కడి నుంచి కాకుండా మా చెల్లెల వాళ్ళ ఇంటికి పంపించాలి అని భవాని అనుకుంటుంది. ఇక అదే విషయాన్ని తన మరుదులకి చెబుతుంది. వాళ్లు కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకుంటారు. అసలు అత్తయ్య నందిని ఎందుకు ఇక్కడ నుంచి పంపించాలని అనుకుంటుంది కచ్చితంగా దీని వెనకమాల ఏదో ఉండే ఉంటుంది అని ముకుందా వాళ్ళ మాటలను చాటుగా ఉంటుంది.
కృష్ణ నన్ను క్షమించు ప్లీజ్ నేను నిన్ను బాధ పెట్టాలని ఏమీ చేయలేదు ఇప్పటికైనా క్షమించు అని మురారి వేడుకుంటాడు. కానీ కృష్ణ ససే మీరా ఒప్పుకోను అని చెబుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో నందిని అమెరికా పంపిస్తున్నారు అని తెలుసుకున్న కృష్ణ ఎలాగైనా నందిని ఇక్కడ ఉంచడం కోసం.. అలాగే నందిని పెళ్లి గౌతమ్ తో చేయడం కోసం మురారిని ఓ ప్రశ్న వేస్తుంది. నేను మిమ్మల్ని క్షమించాలి అంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇద్దరు మేజర్స్ ని కి మీరు పెళ్లి చేయాలి అని కృష్ణ అడుగుతుంది మురారి. తప్పకుండా చేస్తాను అని మాట ఇస్తారు. వాళ్ళిద్దరూ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.