NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద కి రేవతి వార్నింగ్.. ముకుంద తర్వాతి ప్లాన్ అమలు చేయనుందా….

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో,మురారి డైరీ చదివి కృష్ణ చాలా బాధపడుతుంది. నేను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. మురారి కృష్ణ డైరీ చదవలేదు, ఈ చివరి పేజీ చూస్తే నా మనసు ఏదో అర్థం అవుతుంది అని అనుకుంటాడు. ముకుంద అసలు కృష్ణ ఎందుకు అలా డల్ గా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటుంది.

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights
krishna mukunda murari serial 1 june 2023 today 171 episode highlights

ఈరోజు ఎపిసోడ్ లో కృష్ణ ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావ్ ఏంటి అని మురారి అడుగుతాడు. అవును మీ పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇస్తాను వెతికి పెడతారా అని అంటుంది.నాతో చెప్పు చాలు నేనే వెతికి పెడతా అంటాడు. అది నా ప్రేమ కన్నీటి రూపంలో వర్షంలో కొట్టుకొని పోయింది అని మనసులో అనుకుంటుంది. ఏంటి చెప్పవు అంటాడు మురారి. వదిలేయండి సార్ మీకు అలవాటే కదా, అని అంటుంది కృష్ణ. ఏంటి వదిలేయడమా అని అంటాడు మురారి. ఎక్కడ జరిగింది అక్కడ వదిలేయడం. మీరు ఇంకా స్నానానికి వెళ్లినట్లు లేరు, ఇంకా వానిలోనే తడుస్తున్నాను కదా అని అంటాడుమురారి. నువ్వు ఎక్కడికో వెళ్లి వచ్చినట్టు ఉన్నావ్ అని అంటాడు. ఏకాంతంలోకి, ఏకాంతం దొరకలేదని మళ్లీ తిరిగి వచ్చేసా అని అంటుంది. నీ మాటల్లో ఏదో బరువు కనబడుతుంది అని అంటాడు మురారి. తూకం వేసి మాట్లాడాలి అనుకున్న చెప్పాల్సినవి, అయిపోయాయండి మీరు వెళ్ళండి అని అంటుంది కృష్ణ. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా తల తిరిగిపోయేలా ఉంది. మీద అలా తిరుగుతుంది నిన్నటి నుంచి నాతో తిరుగుతూనే ఉంది నేను ఎవరికి చెప్పుకోవాలి అని అనుకుంటుంది మనసులో కృష్ణ. మీ డ్రెస్ ఇక్కడ పెట్టాను అని అంటుంది. మురారి రెడీ అయ్యే లోపు క్యారేజీ తీసుకొని వస్తుంది. నేను కిందకి వస్తాను కదా కృష్ణ పైకి ఎందుకు తీసుకొచ్చావు, అవును కదా నాకు మతి పోయినట్టుంది సిపి సార్, తిరిగి వచ్చిన తర్వాత టార్చ్ లైట్ వేసి మరి వెతుక్కుంటాను పోయిన నా మనసుని అని అంటుంది. కృష్ణ నీతో ఇంకాసేపు మాట్లాడితే నాకు పిచ్చెక్కి ఎలా ఉంది. అర్థమవుతుంది మాట్లాడటం మానేయండి. కృష్ణ మురారి తలను సరిగా దువ్వుకోలేదని సరి చేస్తూ ఉంటుంది. నువ్వు నాకు అసలు అర్థం కావు కృష్ణ, వాలేట్ మర్చిపోయావా అని అంటుంది కృష్ణ,మర్చిపోయాను అని అంటాడు మురారి. కృష్ణ వాలెట్, కీస్ అన్ని తీసుకొచ్చి ఇస్తుంది.ఇద్దరు కలిసి కిందకి వస్తూ ఉంటారు అదే టైం కి ముకుంద కూడా ఎదురొస్తుంది. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్లడం ముకుంద చూసి, కోపంతో మురారిని అలానే చూస్తూ ఉంటుంది. రేవతి ముకుంద అలా ఉండడం దూరం నుంచి చూస్తుంది. నా కొడుకు కోడలు బయటకు వెళ్తుంటే, దీనికి కడుపులో రగిలిపోతున్నట్టు ఉంది అని అనుకుంటుంది.

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights
krishna mukunda murari serial 1 june 2023 today 171 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ నుండి నిజం రాబట్టాలని చూసిన ముకుంద.. కృష్ణ ఒంటరిగా మిగిలిపొనుందా..

ముకుంద బాధ

ముకుందా రూమ్లో కూర్చుని, మురారి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. (నేను నిన్ను లవ్ చేయడం మానేశాను, నేను నిన్ను జీవితాంతం లవ్ చేస్తూనే ఉంటాను. నువ్వు జీవితాంతం ప్రయత్నం చేయాల్సింది తప్ప నన్ను సొంతం చేసుకోలేవు.) ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కృష్ణ మురారి కి ప్రపోజ్ చేసిన వీడియోను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను నేను కాదు నేను నువ్వు అయిపోయాను అని కృష్ణ అనే మాటలను తెలుసుకొని ఏడుస్తూ ఉంటుంది.మీకు నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని కృష్ణ ప్రపోజ్ చేసిన వీడియోని తలుచుకొని, ముకుంద ఏడుస్తూ ఉంటుంది. ఏంటిది రోజురోజుకీ చేయి జారిపోతున్నవ్, కృష్ణ నీకు దగ్గరవుతుందా నువ్వు కృష్ణకు దగ్గర అవుతున్నావా,, రాయి అయిపోతున్నావా పరాయి వాడివైపోతున్నావా, అని బాధపడుతూ ఉంటుంది. ముకుంద ప్రవర్తన చూస్తుంటే ఏదో ఒక రోజు బయటపడిపోతుందేమో అనిపిస్తుంది అని రేవతి అనుకుంటుంది.

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights
krishna mukunda murari serial 1 june 2023 today 171 episode highlights

Nuvvu Nenu Prema: అను పెళ్లి ఆపడానికి కృష్ణ ప్లాన్ ఫలించనుందా… పద్మావతి మనసులో మాట చెప్పినట్టేనా…

ముకుంద బాధ రేవతి కి చెప్పటం

నా కొడుకు కోడలు, సంతోషంగా ఉండాలంటే, ముకుంద ఆలోచనలకి బ్రేక్ పడాలి. అని రేవతి అనుకొని, ముకుంద గదికి బయలుదేరుతుంది. ఈరోజు ముకుంద కి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటుంది. అప్పటికే ముకుందా రూమ్ లో, నీతో జీవితం పంచుకోలేక, ఇంకొకరికి భర్తగా నేను ఊహించుకోలేక, నీ పక్కన ఎవరో ప్రేమగా మసులుకుంటుంటే చూసి భరించలేక, నాకు పిచ్చి పడుతుంది. ఎలాగైనా నాకు నువ్వు కావాలి. అని సామాను విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వస్తుంది. రేవతికి మొత్తం అర్థమవుతుంది. ముకుంద రేవతిని చూసి షాక్ అవుతుంది. వెంటనే కళ్ళు తుడుచుకుని, కంగారుపడుతూ ఉంటుంది. రేవతి ఏంటిది అని అడుగుతుంది. కింద పడిన సామాను చూపిస్తూ, నా జీవితం అంటుంది ముకుంద. నువ్వే చిందర వందర చేసుకుంటున్నావా, ఆ దేవుడు అలా మారుస్తున్నాడు, ఆ దేవుడిని దారి చూపించలేడా అంటుందిరేవతి.ఆ దారిలో చాలామంది అడ్డం ఉన్నారు అని అంటుంది ముకుంద.అడ్డము ఉన్న వాళ్ళు వారిదారిలో వాళ్ళు వెళ్తున్నారు అని అంటుంది రేవతి. వాళ్లు నా భవిష్యత్తుని తొక్కుకుంటూ వెళ్లేవాళ్లు, వాళ్ల గురించి నీకెందుకు నీ కష్టం నీ సుఖం, నీ బాధ నీ ఒంటరితనం మీ నాన్న దానికి ఒక పరిష్కారం చెప్పాడు.ఆ పరిష్కారం నాకు నచ్చలేదు అని అంటుంది ముకుంద. నీ పద్ధతి నాకు నచ్చలేదు అంటుంది రేవతి. ఇప్పుడు నాకు మీరు ఏ శిక్ష వేస్తారు. ఒకప్పుడు మాత్రం ఏం శిక్ష వేశా నీకు, ఇప్పుడు వేయడానికి అని అంటుంది రేవతి. ఇలా వస్తువులను విసిరేస్తే ఏంటి అర్థం. తీసి చెత్త కుప్పలు పడేయండి అని అంటుంది ముకుంద.

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights
krishna mukunda murari serial 1 june 2023 today 171 episode highlights

Brahmamudi: రాహుల్ నిజస్వరూపాన్ని తెలుసుకున్న వెన్నెల మరియు అరుంధతి..తర్వాత ఏమి జరిగిందంటే!

రేవతికి అంతా తెలిసిపోయింది.

అత్తయ్య నా గుండె పగిలితే ఏం చేయాలి. అది నీ దురదృష్టం అనుకోవాలి అని అంటుంది రేవతి. అలా నేను అనుకోలేను నాకేం తక్కువ, చదువు లేదా ఆస్తి లేదా అందం లేదా, నాకే ఎందుకు ఇలా జరగాలి. నీ జీవితం ఇలా కావడానికి కారణం ఆకాష్. వారి మాయమైపోవడం వల్లే నీకు వంటరితనం మొదలైంది. అత్తయ్య అని అరుస్తుంది ముకుంద. చిన్న అత్తయ్య, చిన్న అత్తయ్య మాత్రమే, నాకు అర్థమైంది మీరు నన్ను చిన్న అత్తయ్య అని మాత్రమే పిలవమనడం. నాకు తెలుసు మొత్తం తెలుసు అని అంటుంది రేవతి. ఆ మాటకి ముకుంద షాక్ అవుతుంది. తెలిసి ఏం చేయగలిగావు, నాకే న్యాయం చేసావు. నీకు న్యాయం చేయడం అంటే ఇంకొకరికి అన్యాయం చేయడం కాదా అని అంటుంది రేవతి. నేనే మీ కూతురు స్థానంలో ఉంటే ఇలానే చేసేవాళ్ళ, మీ నాన్నలనే ఆలోచించేదాన్ని నీ ఒంటరితనాన్ని అర్థం చేసుకొని ఓదార్పునిచ్చి మరో కొత్త భవిష్యత్తుని కొత్త జీవితాన్ని పునాది వేసేదాన్ని, నా జీవితానికి ఇక్కడే పునాది వేయమని నేను అడిగితే, ఏంటి పరువు పునాదితో సహా కూలిపోతుందని బతిమాలు కొంటాను. నా మీద జాలి లేదా అని అడుగుతుంది ముకుంద. నువ్వు ఏ సంతోషానికి గానికి నోచుకోనందుకు నీ జీవితం ఒంటరిగా అయిపోతున్నందుకు నాకు జాలిగా ఉంది. సాటి ఆడదానిగా సానుభూతి మాత్రమే చూపించగలను, అంటుంది రేవతి. నేను ఈ ఇంటి కోడల్ని, ఒకరికి భార్యని ఒకరికి తల్లిని నేను ఆ గీతల్ని దాటలేను. అభ్యుదయం వైపు నడవలేను విశాలమైన మనసుతో ఆలోచించలేను. ఎందుకంటే నేను ఒక సామాన్యమైన సగటు శ్రీ ని కాబట్టి, నీ విషయంలో అంతకన్నా ఆలోచించలేను అని అంటుంది రేవతి. దానికి ముకుందా గట్టిగా ఏడుస్తూ, రేవతి ని కౌగిలించుకుంటుంది. ముకుందా అని రేవతి దగ్గరకు తీసుకుంటుంది. నేను పోగొట్టుకున్న జీవితం నాకు కావాలి అని అంటుంది ముకుంద. వెంటనే రేవతి, ముకుందని దూరంగా నెట్టేసి, నీ జీవితం నీకు ఇవ్వడానికి ఇంకొకరి జీవితం సర్వనాశనం చేయమంటావా అంటుంది. మరి నేను ఎలా ప్రశాంతంగా మిగిలి పోవాల్సిందేనా, ఆ ప్రశ్న నేను నువ్వు ప్రశ్నించుకోవాలి.ఎప్పుడు అంటుంది ముకుంద నీ ప్రేమని త్యాగం చేసేటప్పుడు, అప్పుడే నువ్వు తెగించి మా అందరితో చెప్పు ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ముకుందా అంటుంది రేవతి. మా అక్క గాని నేను, అప్పుడు అందరం నీకే సపోర్ట్ చేసి ఉండేవాళ్ళు. ప్రేమించిన మనిషిని దూరం చేసుకుని ప్రేమించని మనిషి చేత తాళి కట్టించుకొని, నువ్వు తీసుకున్న నిర్ణయం లో, నీ అజ్ఞానం, అవివేకం కనపడుతుంది అని అంటుంది రేవతి. అంటే తప్పంతా నాదే అంటారా, ఆలస్యమైంది అంటున్న, నువ్వు ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయింది. ఎన్నటికీ కలవని రైలు పట్టాలా మీ ఇద్దరు మిగిలిపోయారు అని అంటుంది రేవతి. ఆ మాటలకి ముకుంద షాక్ అవుతుంది. ఇప్పటిదాకా నేను సాటి శ్రీ గానే స్పందించాను. ఇప్పుడు మాత్రం ఒక కోడలికి అత్తగా, ఒక కొడుక్కి తల్లిగా మాట్లాడుతున్నాను.

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights
krishna mukunda murari serial 1 june 2023 today 171 episode highlights
రేవతి వార్నింగ్..

ఇప్పుడు మాత్రం నేను,చెప్పేది జాగ్రత్తగా విను అని రేవతి, నా కొడుకు తాళి కట్టిన భార్య పట్ల నిజాయితీగా ఉన్నాడు. నువ్వు తాళి కట్టిన నీ భర్త పట్ల నిజాయితీగా లేవు. ఈ మానసిక చర్చల పట్ల నీ అవునత్యానికి పెంచడానికి కాదు, దేనికి పనికిరాదు. నీవునికి నీ వ్యక్తిత్వం మీ సంస్కారం మొత్తం మాయమైపోక ముందే, మీ నాన్న మాట విను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అంటుంది రేవతి. ఆ మాటకు ముకుంద షాక్ అవుతుంది. లేదంటే నీకు ఇంకా ఆప్షన్ ఉంది కదా అని పూర్తిగా మర్చిపో ఉంటుంది రేవతి. మనసులో ఉన్న కల్మషాన్ని, కడిగేసుకుని స్వచ్ఛమైన స్త్రీగా మారిపో, ఇంతకుమించి నీకు నేను ఏ సహాయం చేయలేను, నన్ను క్షమించు ముకుందా, అని అంటుంది రేవతి,అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights
krishna mukunda murari serial 1 june 2023 today 171 episode highlights
కృష్ణ, మురారి ల ప్రయాణం

మురారి, కృష్ణ ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు. కృష్ణ ఎప్పుడూ గలగల మాట్లాడుతుంది కదా ఇంత సైలెంట్ గా ఉంది ఏంటి అని అనుకుంటాడు. ఇంతకుముందు ఏ సి పి సార్ పక్కన కూర్చోవడం, పరాయి వ్యక్తి గార్లకు వచ్చినట్టు ఇబ్బందిగా ఉంది. పని మనసులో అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఏం మాట్లాడవేంటి ఏం ఆలోచిస్తున్నావ్, ఇవాళ రోడ్డు మీద రాయి కనపడితే ఎవరి మీద విసిరేద్దామా అని అంటుంది కృష్ణ. మురారి కార్ ఆపుతాడు, ఏంటి నిజంగా రాయి కనిపించిందా అని అంటుంది కృష్ణ. కాదు ఒకసారి అటు చూడు అని అంటాడు మురారి. అప్పటికే అక్కడ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.ఏసిపి సార్ వాడు మిమ్మల్ని చూస్తే పారిపోతాడు. ఎంత వేగంగా పరిగెత్తిన, నేను పట్టుకుంటాను అని అంటాడు మురారి. వాడి వెనక్కి తిరిగి చూసి అక్కడే నిలబడి ఉంటాడు. ఇదేంటి వాడు నిన్ను చూసినా కాని పారిపోలేదు అని అంటుంది కృష్ణ. పడే తప్పు చేయలేదు అని అంటాడు మురారి.అంటే ఆ అమ్మాయి తప్పు చేసింది అంటారా,ప్రేమ కోసమే కదా వాడు అర్థం చేరి అది తప్పు కాదు అని అంటాడు మురారి. అమ్మాయిలందరూ ఆల్వేస్ కరెక్ట్ కాదు ఎసిపి సార్. వాడు ప్రేమించేవాడు అయితే ముందు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకునేవాడు. మీ అమ్మాయిని మనసు ఎవరో తెలియదు, మగవాళ్ళని పిచ్చోళ్ళని చేయడానికి పుట్టారు. గుండెలు పగిలిపోయి ఆడవాళ్ళే పిచ్చి వాళ్ళు అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మనిద్దరం ఆపాలి కానీ, మనమేటి అని వాళ్ళ దెగ్గరికి వెళతారు..
ఏంట్రా గొడవ పడుతున్నావా అమ్మాయితో అని అంటాడు మురారి. సార్ మీరే న్యాయం చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నేను ఇతని ఫ్రెండ్లా చూస్తుంటే నన్ను ప్రేమ అనుకోని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నేను కాదంటే బలవంతం చేస్తున్నాడు అంటుంది అమ్మాయి.సార్ ఈ అమ్మాయి నాతో పాటు సినిమాలకు వచ్చింది పార్టీలోకి వచ్చింది ఇప్పుడు ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ అంటుంది మీరే న్యాయం చెప్పండి సార్ అని అంటాడు అబ్బాయి.నువ్వు ఒక్కసారైనా ప్రేమిస్తున్నాను అని చెప్పావా,అని అంటుంది కృష్ణ. ఆ అబ్బాయిని చెప్పలేదు అని అంటాడు. అయితే తప్పంతా నీదే ప్రేమిస్తుంటే ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పాలి. అది ముందే చెప్పుంటే నిన్ను ఇప్పుడు ఇంత బాధ పెట్టేది కాదు కదా అమ్మాయి. ఇంత కోపం కూడా వచ్చేది కాదు అని అంటుంది. మురారి ఆ అమ్మాయితో నువ్వు ఇంతకుముందు ఫ్రెండ్లా చూస్తున్నట్టు చెప్పావా అని అంటాడు. మీరు సార్ ఇప్పుడే చెప్తున్నాను అని అంటుంది ఆ అమ్మాయి. ముందే చెప్పుంటే అతనికి ఇంత బాధ ఉండేది కాదు కదా అని అంటాడు మురారి.

krishna-mukunda-murari-serial-1-june-2023-today-171-episode-highlights
krishna mukunda murari serial 1 june 2023 today 171 episode highlights

రేపటి ఎపిసోడ్ లో,మురారి వస్తుంటే ముకుందా అడ్డుగా నిలిచి ఉంటుంది. ఏంటి అని అడుగుతాడు మురారి. ఇంట్లోరేవతి అత్త కి అంతా చూచాయిగా తెలిసిపోయింది అని అంటుంది ముకుంద. అంటే అని అంటాడుమురారి. మన ప్రేమ విషయం ఆవిడకి తెలిసిపోయింది అని అంటుంది. ఎవరు చెప్పారుఅని అంటాడు మురారి.ఇంకెవరు చెప్తారు ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలిసేది నేనే చెప్పాను అని అంటుంది ముకుంద…. చూడాలి రేపు ఏం జరుగుతుందో… మురారి ఏం చేయనున్నాడో….

author avatar
bharani jella

Related posts

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu