- Krishna Mukunda Murari: రేవతి నా కోడలు పొద్దున ఎందుకు నన్ను హత్తుకొని మంచి కొడుకును కన్నావు అత్తయ్య అంటూ అంత ప్రేమగా మాట్లాడింది. అసలు కృష్ణ అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అని రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్లి వెంటనే కృష్ణను అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ భవాని అక్కకు తెలిస్తే మళ్లీ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుందని అక్కడే కూర్చునే ఆలోచనలో పడుతుంది. ఈ మధ్య భవాని అక్క ఎందుకు ముకుందా మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఛా ఛా భవాని అక్కా ఎప్పటికీ ఉండదు. తను పైకి కోపంగా ఉన్నా కూడా మా అక్క మనసు బంగారం అక్క గురించి నాకు తెలియదా రేవతి తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటుంది. ముకుందా నా కోడలు గురించి భవాని అక్కకు ఏమైనా చెప్పుడు మాటలు చెబుతుందా అని రేవతి ఆలోచనలో పడుతుంది.

Krishna Mukunda Murari: ముకుంద ఎత్తుగడకి చిత్తు కానున్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్
అత్తయ్య అత్తయ్య అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్న రేవతి ని పిలుస్తుంది కృష్ణ. ఏమైంది అత్తయ్య ఎలా ఉన్నావు అంటూ కృష్ణ పిలవగానే, నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అంటుంది. అర్థం చేసుకుంటాను అత్తయ్య ఏమైందో చెప్పండి అని కృష్ణ అడుగుతుంది. రేపు నా కొడుకు పుట్టినరోజు తనకి ఎలా బర్త్డే విషెస్ చెప్పాలి అని రేవతి అంటుంది. అవునా నాకు ఇప్పటివరకు తెలియదు అనే కృష్ణ అనగానే , ఎడ్డి మొహం దాన మొగుడి పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదా అంటూ చివాట్లు పెడుతుంది రేవతి. మీరేం కంగారు పడకండి అత్తయ్య మీ అబ్బాయికి మీ చేత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించే బాధ్యత నాది. ముందు ఈ విషయం ఏసీబీ సార్ దగ్గరికి వెళ్లి తేల్చుకుంటాను అంటూ కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ బాధ నీది నా బాధ నాది అని రేవతి మనసులో అనుకుంటుంది.
ఏసీబీ సార్ మీరు ఇలా నాకు అన్యాయం చేస్తారని అనుకోలేదు. నా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచి పెట్టారు అంటూ కృష్ణ మురారి కి అర్థం కాకుండా మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతున్నావ్ కృష్ణ అని మురారి అడుగుతాడు .రేపు ఏంటి ఎసిబి సార్ అంటే ట్యూస్డే అని అంటాడు మళ్ళీ కృష్ణ కోపంగా ఉరిమురిమి చూస్తూ.. రేపు ఏంటి సార్ అంటే ట్యూస్డే అని అంటాడు. ట్యూస్డే కానీ రేపటి స్పెషల్ ఏంటి అని మురారిని గుచ్చి గుచ్చి అడుగుతుంది కృష్ణ. నీకు చెప్పకూడదని మాట దాటవేస్తున్నాను కృష్ణ అని మురారి అంటాడు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి మా పెద్దమ్మ చాలా హడావుడి చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి నా పుట్టినరోజు ఎలా జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. పెద్దమ్మ నాతో మాట్లాడటం లేదు కదా అని మురారి దిగులుగా అంటాడు. అయ్యో ఏసీబీ సార్ మీ పుట్టినరోజు ఇప్పుడు మీకు బెస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఈ పుట్టినరోజుకి మీ పెద్దమ్మ మీతో మాట్లాడేలా చేసేలాగా నేను చేస్తాను అని కృష్ణ మాటేస్తుంది మీ ఆనందానికి నేను భరోసా ఇస్తాను అంటూ కృష్ణ మురారి మాట ఇస్తుంది.
Brahmamudi: రాహుల్ – స్వప్న కుట్రలను కళ్లారా చూసిన రాజ్..తర్వాత ఏమైందంటే!
ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి మీద ఉన్న తన ప్రేమను చూపించుకోవడం కోసం ముకుందా మురారి బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటుంది. అంతేకాకుండా తనకి రింగ్ ని తన ప్రేమకి గుర్తుగా ఇవ్వాలనుకుంటుంది ముకుంద. మురారి దగ్గరకు వచ్చిన ముకుందా ఈ రోజు రాత్రి 12 గంటలకి నేను నీతో కేక్ కట్ చేస్తాను రెడీగా ఉండు అని ముకుందా అంటుంది. ఆ మాట వినగానే మురారి కి కృష్ణ ముందుగానే 12 గంటలకు కేక్ కట్ చేయిస్తానని చెబుతుంది. ఇక ఈ నారి నారి నడుమ మురారి ఎవరి చేత కేక్ కట్ చేయించుకోవడానికి సిద్ధమవుతాడో చూడాలి. ఇక కృష్ణ అనుకున్నట్టుగా భవానీ చేత మురారిటీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇస్తుందో లేదో చూడాలి.