Krishna Mukunda Murari: మురారి ఉద్యోగం రావడానికి కృష్ణ హెల్ప్ చేసి తన మనసులో మంచి మార్కులు కొట్టేసింది. కానీ కృష్ణ కంటే నేనే గ్రేట్ అని మురారి కి తగిన భార్యను నేనే అని అందరికీ తెలియాలంటే .. ఈ ఇంట్లో అందరికీ గ్రాండ్ పార్టీ ఇవ్వాలి అని ముకుందా అనుకుంటుంది. కేక్ తెచ్చాను అందరూ రండి అంటూ మురారి అరుస్తాడు. ఏంటి చిన్న మావయ్య ఏమైనా ఫంక్షన్ ఉందా ఇంట్లో అని ముకుందా అడుగుతుంది. మురారి కి మళ్ళీ జాబ్ వచ్చింది కదా అందుకని అందరం కలిసి కృష్ణ కి థాంక్స్ చెబుతూ చిన్న పార్టీ అరేంజ్ చేసామని చెబుతాడు.
రేవతి భవానీ దగ్గరికి వెళ్లి అక్క అందరూ వచ్చారు . మీరు కూడా వస్తే పార్టీ స్టార్ట్ చేద్దాం అని అంటుంది . ఇంతకీ నేనే ఈ కేక్ అరేంజ్మెంట్స్ చేశానని ఎవరికైనా చెప్పావా ఏంటి అని అడుగుతుంది. లేదక్కా నా బలవంతం మేరకే మీరు అక్కడికి వస్తున్నారు అంతే అంటూ రేవతి, భవని మాట్లాడుకుని అక్కడికి వస్తారు. ఇక మురారి కృష్ణ ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. మురారి కేక్ కట్ చేసి కృష్ణకు తినిపిస్తాడు. కృష్ణ కూడా మురారి కి తినిపిస్తుంది. వాళ్ళిద్దరూ అలా దగ్గరవడం చూసి ముకుందా సీరియస్ గా చూస్తుంది. కేక్ రాసి కాసేపు అల్లరి చేస్తుంది.
మురారి కి భవాని కేక్ తినిపిస్తుంది. అప్పుడే రేవతి కృష్ణకు కూడా తినిపించమని అంటుంది. ఇక ఆ మాటకు కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా .. మురారి మీ ఆవిడ వెళ్లిపోతే కేక్ పార్సెల్ చేసి పంపించాలా అని అంటుంది . ఇక అప్పుడే కృష్ణ వెనక్కి తిరిగి భవాని దగ్గరికి వస్తుంది. భవాని అందరి ముందు కృష్ణ నోట్లో కేక్ పడుతుంది. ఇక కృష్ణ ఆనందానికి అవధులు ఉండవు సంతోషంతో భవాని వైపు ఆత్మీయంగా చూస్తుంది.
ఇక కేక్ పార్టీ ముగిసిన తర్వాత రేవతి మురారితో మాట్లాడుతుంది. అప్పుడే మురారి కి వరుసగా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎవరు మురారి అని అడగగా కృష్ణ మెసేజ్లు చేస్తుంది అని అక్కడ నుంచి మురారి ముకుంద దగ్గరికి వెళ్తాడు. ఎందుకు ముకుందా అన్నిసార్లు మెసేజ్లు చేస్తున్నావు అని మురారి అడుగుతాడు. మీ పెద్దమ్మతో మన విషయం చెబుతానని ఇక్కడికి వచ్చావా అని ముకుందా అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు ముకుందా? ఎవరి లైఫ్ లో వాళ్ళు ఉన్నాం కదా అని మురారి అంటాడు..
ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ ఇల్లంతా ముగ్గులు వేస్తుంది. ఏసీబీ సార్ ఇదంతా మీకోసమే మీ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నాను అని కృష్ణ చెబుతుంది. కృష్ణ మురారి ఇద్దరు కలిసి ముగ్గు వేయడం ముకుందా చూస్తూ ఉంటుంది. కృష్ణ ముఖానికి అంటుకున్న రంగును మురారి తోడవడం చూసిన ముకుందా కోపంగా వారి వైపు చూస్తుంది.