Krishna Mukunda Murari: ఆ టాబ్లెట్ వేసుకోవడానికి ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకుంటుంది. కాకపోతే నందిని కేర్ ని రేపటి నుంచి ముకుందానే చూసుకుంటుంది అని చెబుతారు. కృష్ణ నాకు తలనొప్పిగా ఉంది అని వంటిది లోకి వెళ్లి కాఫీ తాగుతుండగా రేవతి వచ్చి కృష్ణని మెచ్చుకుంటుంది. నందిని విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని చెబుతుంది.

ముకుందా మురారి దగ్గరకు వచ్చి ఏంటి మురరి రమ్మన్నావు.. నామీద నీకు ఎప్పటికైనా ప్రేమ కలిగిందా అని ముకుందా అనగానే.. నీ మీద ప్రేమ కలగడం కాదు అసలు నీకు ఉన్నది ప్రేమే కాదు ఉన్మాదం అని మురారి అంటాడు.. అలా మాట్లాడుకుంటూ ఉండగా.. నా ప్రేమను ప్రశ్నించే అర్హత నీకు లేదు అని ముకుందా అంటుంది. అసలు నేను నీ పెళ్లి రోజు కనిపించాను కాబట్టి నువ్వు నాతో మాట్లాడవు.. అదే అసలు నేను అక్కడ కనిపించకుండా ఉండి ఉంటే నువ్వు పెళ్లి చేసుకునే దానివి కదా అని మురారి ప్రశ్నిస్తాడు.

కాదు చచ్చిపోయి దానిని అని ముకుంద అంటుంది. నన్ను ఏమైనా అనుకోని నా ప్రేమను తప్పుపడితే ఊరుకోను మురారి అని ముకుందా అంటుంది . హా.. ఏం చేస్తావు చేసి చూపించు అని మురారి కోపంగా అంటాడు. ఆ మాటలకు ముకుందా అక్కడి నుంచి దుకేయలని అనుకుని.. మిద్దె మీద నుంచి దూకేస్తుండగా మురారి ముకుందా అంటూ తన చేతిని గట్టిగా పట్టుకుని పైకి లాగుతాడు.
నామీద నీకు నమ్మకం లేనప్పుడు నన్ను ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నావు. నేను చచ్చిపోతాను అంటూ మళ్ళీ ముకుందా దూకేస్తుండగా నీ ప్రేమ నాకు అర్థమైంది అని ముకుందా తో మురారి అంటాడు. అంతేకాకుండా మోకాళ్ళ మీద నిలబడి క్షమించమని వేడుకుంటాడు. ఇక ఆ ఫ్రెష్ స్టేషన్లో రూమ్ లోకి వెళ్ళగానే కృష్ణ ఏమైంది చేశారా అని కృష్ణ పిచ్చి ప్రశ్నలతో మురారిని విసిగిస్తుంది. దాంతో మురారి కృష్ణ పై అరుస్తాడు ఆ తరువాత కృష్ణని లాలించి బుజ్జగిస్తాడు.