Krishna Mukunda Murari: మురారి మీద ఉన్న తన ప్రేమను చూపించుకోవడం కోసం ముకుందా మురారి బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక తనకి రింగ్ ని తన ప్రేమకి గుర్తుగా ఇవ్వాలనుకుంటుంది ముకుంద. మురారి దగ్గరకు వచ్చిన ముకుందా ఈ రోజు రాత్రి 12 గంటలకి నేను నీతో కేక్ కట్ చేస్తాను రెడీగా ఉండు అని ముకుందా అంటుంది. ఆ మాట వినగానే మురారి కి కృష్ణ ముందుగానే 12 గంటలకు కేక్ కట్ చేయిస్తానని చెబుతుంది. ఆ మాటలు తలుచుకుంటూ నిద్రపోయినా మురారి కి మెలకువ వచ్చి గబగబా ముకుంద దగ్గరకు వెళ్ళినట్టు ముకుందా ఊహించుకున్నట్టుగానే.. మురారి తన దగ్గరకు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినట్టు మురారి చేతను కేక్ కట్ చేయించినట్లు.. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ క్షణాలలో ముకుందా మురారి వేలికి రింగ్ తోడుకుతుంది ఇక ఈ రింగ్ తో నీకు నాకు మరోసారి నిశ్చితార్థం అయింది అని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ముకుంద అది ఊహాని తెలిసి మురారి ఇంకా రాలేదు ఏంటని ఎదురుచూస్తూ ఉంటుంది ముకుంద ఈ ఊహ నిజమవ్వాలి దేవుడా అని అనుకుంటూ మురారి ఎక్కడున్నాడో వెతుక్కుంటూ తన గది వరకు వెళ్తుంది ముకుంద. ఆ వెంటనే అక్కడే సన్నివేశాన్ని చూసి షాక్ అవుతుంది ముకుంద.

కృష్ణ క్యాండిల్ లైట్ బర్త్డే అరేంజ్మెంట్స్ చేస్తుంది మురారి కోసం ఇల్లంతా స్పెషల్ గా డెకరేట్ చేసి ఉంచుతుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు ఏకాంతంగా మురారి బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. కృష్ణ మురారి ఆనందంగా కేక్ ను కట్ చేస్తారు ఇక చాలా వద్ద అనే సంశయంలో ఉండిపోతాడు. ఇక కృష్ణ చొరవ తీసుకొని మురారి కి కేక్ తినిపిస్తుంది. అని చెక్ చేస్తుంది ఏం లేదు కదా ఎందుకు డల్ గా ఉన్నారు అని కృష్ణ అడుగుతుంది అలా మాటల్లో పెట్టి మురారి ముక్కు మీద కేక్ పూస్తుంది. కృష్ణ హే కృష్ణ అంటూ ఇద్దరూ ఆటపట్టించుకుంటూ ఉండడం ముకుందా చూసి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక మురారి కృష్ణ ఒకరికొకరు బాగా దగ్గరవుతారు కృష్ణ మురారి తనని గట్టిగా పట్టుకోవడం ఆస్వాదిస్తూ సైలెంట్ అవుతుంది. మురారి కాస్త దూరంగా తనకి జరుగుతాడు.

Nuvvu Nenu Prema: ప్రాణాలతో బయటపడిన పద్మావతి. కృష్ణ నిజస్వరూపం విక్కీకి తెలిసిపోయిందా..
మురారి నిద్రపోతూ ఉండగా వాళ్ల పెద్దమ్మ భవాని తన గది వరకు వస్తుంది. మురారిని చూస్తూ దూరంగా బాధపడుతూ నిలబడుతుంది. గాడ్ బ్లెస్స్ యు అంటూ భవాని దూరం నుంచి ఆశీర్వదిస్తుంది. ఈ పెద్దమ్మ లేకుండా ఇప్పటివరకు ఏ పుట్టినరోజు జరుపుకోలేదు. ఈ పెద్దమ్మ ఆశీస్సులు ఉంటాయి అని భవాని దూరంగానే ఆశీర్వదిస్తూ ఉంటుంది. అప్పుడే మురారి నిద్రలో పెద్దమ్మ నన్ను క్షమించు నువ్వు లేకుండా ఈ పుట్టినరోజు చేసుకోవడం నావల్ల కాదు అని మురారి నిద్రలో కలవరిస్తడం చూసి భవాని కళ్ళు చమ్మర్చుతాయి.

ముకుంద తన గదిలో కూర్చుని మురారి కృష్ణకు దగ్గర అవడానికి వీల్లేదు. ఎలాగైనా సరే నేను మురారిని నా సొంతం చేసుకోవాలి. మురారికి నా ప్రేమ అర్థం అవడం లేదేమో అని అనుకున్నాను కానీ మురారి మారిపోయాడు లేదంటే కృష్ణ ప్రభావంతో మురారి మారిపోయాడో నాకు అర్థం కావడం లేదు. ఏది ఏం చేసినా సరే మురారిని నేను సొంతం చేసుకోవాలి. మిగతా వారి గురించి నాకు అనవసరం మురారిని సొంతం చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నేను చనిపోయే కొన్ని క్షణాల ముందు అయినా మురారిని సొంతం చేసుకోవాలి అని ముకుందా సైకోగా ఆలోచిస్తూ మురారిని కృష్ణకు దూరం చేయాలి అని పథకాలు రచిస్తూ ఉంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ నీ పుట్టిన రోజు వేడుకలను హాల్లో ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేసి ఉంటుంది. ఇక రేవతి కూడా ఎప్పుడు మురారిని కలవరించే వాళ్ల పెద్దమ్మ ఈరోజు ఎందుకు రాదు. నేను వెళ్లి నిలదీస్తాను అంటూ తన గదికి వెళ్ళబోతుండగా, పెద్ద అత్తయ్య వస్తారు తప్పకుండా వస్తారు అని కృష్ణా అనగానే మీతో చెప్పారా అని మురారి అడుగుతాడు. ఆ లోపు భవాని ఒకే తీసుకొని కిందకు వస్తుంది మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.