Krishna Mukunda Murari: ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా చేయడం మొదలు పెట్టాను అత్తయ్య ఆపరేషన్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని కృష్ణ భవానీతో చెబుతుంది. ఆ మాటలకు ముకుందా కూడా షాక్ అవుతుంది. అసలు ఏంటి ఈ మేటర్.. నందిని విషయంలో ఎందుకు భవాని అత్తయ్య ఎంతగా కంగారుపడుతుంది కృష్ణని చూసి అని అనుకుంటుంది. ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశానని అది సక్సెస్ అవుతుంది అని భవానితో సూటిగా స్పష్టంగా చెబుతోంది. కృష్ణ ఏదో సీక్రెట్ గా మీతో మాట్లాడుతుందా అని అనుమానం వచ్చిన ముకుందా అడుగుతుంది. అలాంటిది ఏమీ లేదు అని అంటుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఏదో జరుగుతుంది అది నేను కచ్చితంగా తెలుసుకోవాలి అని ముకుందా అనుకుంటుంది.

కృష్ణ బైరాగిలాగా వారి మురారిని ఆట పట్టిస్తుంది. దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తూ నేను బైరాగిణి అంటూ మురారిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కృష్ణ. కానీ అసలు బైరాగే లేడని మురారి రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు. మీరే మొన్న నాట పట్టించారు కదా అందుకే నేను కూడా బైరాగిలాగా మారి మిమ్మల్ని ఆటపట్టిద్దామనుకున్నాను.. అది కుదరడం లేదు అని కృష్ణ అంటుంది.

ఆ తరువాత వెంటనే తనకు నడుము నొప్పిగా ఉన్నట్టు యాక్ట్ చేసి అలా మురారిని ఆటపట్టిస్తూ ఉంటుంది. నడుము నొప్పిని నడవలేక పోతున్నాను అంటూ మురారి హెల్ప్ తీసుకొని నడుస్తుంది. ఆ గ్యాప్ లో ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగి డ్యూయెట్ వేసుకుంటారు. సరే కృష్ణ నువ్వు జాగ్రత్తగా కూర్చో నేను వెళ్లి అమ్మను తీసుకువస్తాను. తను నీకు బామ్ రాస్తుంది అని మురారి బయటికి వెళ్తాడు. ఇక కృష్ణ పైకి లేచి బెడ్ మీద డాన్స్ చేస్తుంది అప్పుడే మురారి వచ్చి ఇదంతా ఆక్షన్ నేను నిజమనుకున్నాను అని మురారి అంటాడు. నేను బైరాగి లాగా యాక్ట్ చేసి భయపడితే మీరు భయపడలేదు కదా అందుకే నాకు నడుము నొప్పి అని చెప్పి యాక్షన్ చేస్తున్నాను అని కృష్ణ అంటే.. ఆగు అంటూ మురారి కృష్ణని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఆ గదిలో గోలగోల చేస్తూ ఉంటారు. ఇక కాంప్రమైజ్ అవుతాడు. మురారి మనసులో మాత్రం గౌతమ్ పెళ్లి ముల్లులా గుచ్చుతూ ఉంటుంది. ఒకసారి పెద్దమ్మ దగ్గరకు వెళ్లి ఒక విషయంలో క్లారిటీ తీసుకోవాలి అని అనుకుంటాడు.
Brahmamudi: కళావతిని తన పుట్టింటికి తీసుకు వెళ్ళనున్న రాజ్.. కళావతి మనసులో స్థానం కోసమైనా ఇదంతా..??

భవాని, ఈశ్వర్ , ప్రసాద్ ముగ్గురు కూర్చుని మురారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఏదో టెన్షన్ లో ఉన్నాడని అను భవాని అంటుంది. అదేం లేదు వదిన అని అంటుండగా.. మురారి అక్కడికి వస్తాడు. పెద్దమ్మ నందిని పెళ్లి ఆదివారం అని చెప్పారు కానీ ఏ ముహూర్తం చెప్పలేదు అని మురారి అడుగుతాడు. ఆదివారం ఉదయమా, సాయంత్రమా అని అడిగితే అదేది కాదు మధ్యాహ్నం ఒంటిగంటకు అని వాళ్ళ పెద్దమ్మ చెబుతుంది. సరే అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ముకుందా అక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పండి అత్తయ్య అని అడుగుతుంది. కొన్ని రోజులు పోతే నీకే మొత్తం అర్థమవుతుంది అని భవాని సమాధానం చెబుతుంది.
Nuvvu nenu prema: కృష్ణ మోసం అరవిందకు తెలుస్తుందా?విక్కీ పద్మావతిల ప్రేమ గురించి తెలుస్తుందా?

కృష్ణ దగ్గరకు వెళ్లి మురారి ఆదివారం రోజు గౌతమ్ పెళ్లి చేయలేనని చెబుతాడు. నీకు ఒక మాట ఇచ్చాను కదా ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించు అని మురారి అంటాడు. అసలు ఏమైందో చెప్పమనగానే అసలు విషయం చెబుతాడా లేదంటే నాకు ఆ రోజు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెబుతాడు. ఇక ఆ మాటలకు కృష్ణ అయినా మేము అడిగితే పనులు ఎందుకు చేస్తారులే మీ పెద్దమ్మ అడిగితే చేస్తారు అంటూ బుంగమూతి పెట్టి అలుగుతుంది. సరే ఇంతకీ గౌతమ్ ముహూర్తం ఎప్పుడో చెప్పమని అడిగితే ఆ ముహూర్తం కూడా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అని కృష్ణ చెబుతుంది. అయిపోయాను పో అని మనసులో అనుకుంటాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో పెళ్లికూతురుల ముస్తాబైన ముకుందా మురారితో కలిసి సెల్ఫీ దిగుతుంది. కృష్ణ బెడ్ మీద నుంచి లెగుస్తూనే మీరు నన్ను మోసం చేశారు అంటూ మురారి కాలర్ పట్టుకుంటుంది. అసలు కృష్ణ మురారి కాలర్ పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు.