Krishna Mukunda Murari: కృష్ణ మురారి పుట్టిన రోజు వేడుకలను హాల్లో ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేసి ఉంటుంది. రేవతి తన కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది అప్పుడే ముకుందా వస్తుండగా తను ఒకవేళ అక్కతో చెబుతున్నాడు నా కొడుకుకి నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి హక్కు నాకు లేదా అంటూ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది రేవతి అందులో ముకుందా కూడా అక్కడికి వచ్చి హ్యాపీ బర్త్డే మురారి అని చెబుతుంది ఇక మురారి కూడా ముకుందా కి షేక్ హ్యాండ్ ఇచ్చి ముకుంద కి థాంక్యూ చెబుతాడు. ఇక రేవతి కూడా ఎప్పుడు మురారిని కలవరించే వాళ్ల పెద్దమ్మ ఈరోజు ఎందుకు రాదు. నేను వెళ్లి నిలదీస్తాను అంటూ తన గదికి వెళ్ళబోతుండగా, పెద్ద అత్తయ్య వస్తారు తప్పకుండా వస్తారు అని కృష్ణా అనగానే మీతో చెప్పారా అని మురారి అడుగుతాడు. ఆ లోపు భవాని ఒకే తీసుకొని కిందకు వస్తుంది.

భవాని రావడం కోసం కృష్ణ తన గదికి వెళ్లి అక్కడ గోడ మీద ఉన్న ఒక ఫోటో తీసి యశోద కన్నయ్య కలిసి ఉన్న ఫోటో పెడుతుంది.ఈ రోజు కన్నయ్య పుట్టినరోజు యశోద రాకుండా ఉంటుందా తప్పకుండా వస్తుంది అని అంటూ కిందకి వెళ్ళిపోతుంది కృష్ణ. భవాని ప్రేమగా మురారి నీ దగ్గరికి తీసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. ప్రతి సంవత్సరం మీరే ముందు చెప్పేవాళ్ళు కదా అక్క 12 గంటలకు వెళ్లి ఈసారి లేట్ అయింది కదా అని రేవతి అనగానే, లేదు నేను రాత్రి మురారి గదికి వెళ్ళను అని రాత్రి జరిగిన సంఘటనను అందరితో పంచుకుంటుంది.

మురారి నిద్రపోతూ ఉండగా వాళ్ల పెద్దమ్మ భవాని తన గది వరకు వస్తుంది. మురారిని చూస్తూ దూరంగా బాధపడుతూ నిలబడుతుంది. గాడ్ బ్లెస్స్ యు అంటూ భవాని దూరం నుంచి ఆశీర్వదిస్తుంది. ఈ పెద్దమ్మ లేకుండా ఇప్పటివరకు ఏ పుట్టినరోజు జరుపుకోలేదు. ఈ పెద్దమ్మ ఆశీస్సులు ఉంటాయి అని భవాని దూరంగానే ఆశీర్వదిస్తూ ఉంటుంది. అప్పుడే మురారి నిద్రలో పెద్దమ్మ నన్ను క్షమించు నువ్వు లేకుండా ఈ పుట్టినరోజు చేసుకోవడం నావల్ల కాదు అని మురారి నిద్రలో కలవరిస్తడం చూసి భవాని కళ్ళు చమ్మర్చుతాయి ఆ భవాని అందరితో చెబుతుంది. ఎంతైనా మీరు అని ఆ వెంటనే మురారి అక్షంతలు తీసుకొని వాళ్ల పెద్దమ్మకు ఇచ్చి ఆమె కాళ్ళకు నమస్కారం చేస్తాడు నిండు నూరేళ్లు నువ్వు సంతోషంగా మురారి అని వాళ్ళ పెద్దమ్మ దీవిస్తుంది. చూశారా అక్క కన్నతల్లికి కాళ్ళకే నమస్కారం చేయడం లేదు పెద్దమ్మకు చేసి వదిలేసాడు అని అనగానే ఇక మురారి రేవతి అక్షంతిని ఇచ్చి నమస్తే చేస్తాడు. మీ పెద్దమ్మ కన్నా బాగా నిన్ను ఎవరు దీవించగలరు ఆవిడ దీవించినట్లే నువ్వు సంతోషంగా ఉండాలి అని రేవతి అంటుంది.

మురారిని వాళ్ళ పెద్దమ్మ కేక్ కట్ చేయమని చెబుతోంది. వాళ్ల పెద్దమ్మకు తినిపిస్తాడు ఆ తరువాత మురారి వాళ్ల పెద్దమ్మ తినిపిస్తుంది. ఇక అందరికీ కేక్ తినిపిస్తూ ముకుంద కూడా మురారి తన నోటికి అందిస్తూ కేక్ తినిపించబోక చుట్టూ ఉన్న పరిసరాలను మనుషులను గుర్తుతెచ్చుకొని మురారి ముకుంద నోటి నుంచి ఆ కేక్ ని తీసి తన చేతిలోకి పెడతాడు. ఆ పాటికే రేవతి కోపంగా చూస్తూ ఉంటుంది. ముకుంద చేతిలో పెట్టిన కేక్ ని వెనకనుంచి విసిరి నేల మీదకు విసిరేస్తుంది.

పెద్ద అత్తయ్య ఈ బొకేనేనా మురారి పుట్టినరోజుకు మీరు ఇచ్చే గిఫ్ట్ అని కృష్ణ అడగగానే లేదు లేదు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. అంతే కాకుండా మీరు కూడా నాతో మాట్లాడొచ్చు అంటూ అంతకుముందు తన విధించిన శారదను వెనక్కి తీసుకుంటున్నాని అందరు ముందు చెబుతుంది భవాని. దాంతో అందరూ సంతోషిస్తారు త్వరగా రెడీ అవ్వండి మనందరం గుడికి వెళ్దామని చెబుతుంది భవాని. ఇక ఆ గుడిలో సాక్షిగా మురారి చేతికి ఉంగరం తొడగాలనుకుంటుంది ముకుంద.
ఇక గదిలోకి వెళ్ళ గా మురారి కృష్ణను గట్టిగా పట్టుకుని దగ్గరికి తీసుకొని తనతో డ్యూయెట్ సాంగ్ వేసుకుంటాడు. ఇద్దరు కలిసి కపుల్స్ డాన్స్ చేస్తారు. ఇలా ఎంతగా డాన్స్ చేసిన నా ఆనందానికి సరిపోవడం లేదు కృష్ణ మొన్న వేసినట్టు మాస్ స్టెప్పులు వేద్దాం అని మురారి అంటాడు. ఇద్దరూ కలిసి డాన్స్ వేస్తారు మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.