Krishna Mukunda Murari: ముకుంద పెళ్లికూతురులా ముస్తాబై మూరారిని తన గదికి రమ్మని మెసేజ్ చేస్తుంది. ఈ సమయంలో నేను నీ గదికి రావడం సంస్కారం కాదు ముకుంద ఎందుకు రమ్మందా అని మురారి వెళ్తాడు.. నందినీకి తీసుకువచ్చిన పెళ్లి చీరను నువ్వెందుకు కట్టుకున్నావు అంటూ మురారి నిలదీస్తాడు. పెళ్లికూతురులో ఉన్న తనని చూసి వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకు బయటే నిలబడ్డావు అని మురారిని ముకుందా అడుగుతుంది. ఈ టైంలో నేను నీ గదికి రావడం సంస్కారం కాదు. అందుకే ఇక్కడే నిలబడిపోయాను అని మురారి అంటాడు.

నాకు పెళ్లయిందని నీకు పెళ్లయిందని ఈ మెట్ట వేదాంతం చెప్పుకుంటూ కూర్చుంటే మన జీవితం అయిపోతుంది నా ప్రేమను పువ్వుల మచిలీ పాదాల మీద పోయడం తప్ప నాకు ఇంకొక ఆలోచన ధ్యాస లేదు నన్ను అర్థం చేసుకో మురారి ప్లీజ్ అంటూ ముకుందా బాధపడుతుంది ఇక ఫోన్ తీసుకొచ్చి ముకుందా మురారితో కలిసి సెల్ఫీ దిగుతుంది. ఇంకొక విషయం ఇది నందిని కోసం నువ్వు సెలెక్ట్ చేసిన చేరే కానీ నేను ఇలాంటి చీరనే ఇంకొకటి నందిని కోసం తీసుకున్నాను. అది నీ మీద నాకున్న ప్రేమ అర్థం చేసుకో మురారి అంటూ ముకుందా తలుపులు వేసుకొని బాధపడుతుంది.

కృష్ణ బెడ్ మీద నుంచి లెగుస్తూనే మీరు నన్ను మోసం చేశారు అంటూ మురారి కాలర్ పట్టుకుంటుంది. అసలు కృష్ణ మురారి కాలర్ పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియాక మురారి కంగారు పడుతూ ఉంటాడు. గౌతమ్ సర్కిపెళ్లి వేసే విషయంలో మీరు నాకు మాట ఇచ్చారు కానీ చివరిగా ఆ అమ్మాయి ఎవరో తెలిసాకా ఆ అమ్మాయితో గౌతమ్ సార్ కి పెళ్లి చేయనని మధ్యలో వదిలేసి వచ్చారు. ఇది మీకు న్యాయమేనా అంటూ మురారిని నిలదీస్తుంది. కృష్ణ సారీ ఏసీబీ సార్ నాకు నిద్ర వస్తుంది అంటూ నిద్రపోతుంది. ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్లీ నిద్రలేచి ఏంటి నా కలలోకి మీరు వచ్చారా నిజంగా మీరు చెప్పేదంతా జరిగిందా అంటూ కృష్ణ అమాయకంగా అడుగుతుంది. కలలోకి కూడా నన్ను తీసుకువెళ్లి అక్కడ కూడా నాతో గొడవ పడుతున్నావా అని మురారి అడుగుతాడు. ఎక్కడ గౌతమ్ సర్ పెళ్లి చేయరేమోనని నాకు భయమేసింది ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది. నీకు ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటాను కృష్ణ ఎప్పటికీ మాట తప్పను అలాగే మా పెద్దమ్మకి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటాను అని మురారి అనుకుంటాడు.

భవాని అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయని ముకుందని అడుగుతుంది. జరుగుతుంది అత్తయ్య అని ముకుందా చెబుతుంది. ఈరోజు కళ్యాణ మండపం వెతకడానికి మురారి నేను వెళ్తాము అని ముకుందా చెబుతుంది. మీరు ఏ పనులు చేసినా కానీ సీక్రెట్ మైంటైన్ చేయండి అని భవాని మరొకసారి ముకుంద కి గుర్తు చేస్తుంది. మురారి ఈ టెంపరరీ భార్యతో ఇంకా ఎంతసేపు రూమ్ లో నుంచి బయటకు రాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. ముకుందా ఇక మురారి కృష్ణ నడుచుకుంటూ వస్తుండగా కృష్ణ స్లిప్ అవుతుంది. మురళి గట్టిగా తనని పట్టుకుంటాడు. ఆ విజువల్ చూసి ముకుందా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో గౌతమ్ పెళ్లి షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు ఉన్నాడే అని మురారి అంటాడు రేపు మీరు పెళ్లికూతురు బ్యాగ్రౌండ్ తెలిసిన తర్వాత మీరు ఆ పెళ్లి చేయనని అంటారేమోనని కంగారుపడుతున్నాడు అని కృష్ణ అంటుంది. మేమిద్దరం కృష్ణార్జునలమైతే జరిగేది సుభద్ర పరిణయం అని మురారి అంటాడు. ఆ మాటకి కృష్ణ గౌతమ్ ఇద్దరూ సంతోషిస్తారు.