Krishna Mukunda Murari: కృష్ణ కూరగాయలు కట్ చేస్తూ ఉండగా భవాని తన దగ్గరకు వచ్చి నందు విషయంలో నేను నిర్ణయాన్ని మార్చుకోమని చెబుతుంది . నందుకి తల్లిని నేను.. తన విషయంలో ఏం చేయాలో నాకు తెలుసు అని భవాని అంటుంది. నందిని ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచి నన్ను నమ్మింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నాకు ఇదో పరీక్ష అని కృష్ణ అంటుంది.. భవాని మనసులో కృష్ణను డీల్ చేయడం చాలా కష్టం అని అనుకుంటుంది.

కృష్ణ ఏమనింది వదిన అని తన ఇద్దరు మరదలు వచ్చి అడగగా.. ఈ విషయంలో కృష్ణ కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. మీరేం కంగారు పడకండి తనని ఎలాగైనా ఓ దారికి తీసుకువచ్చేదాకా నేను ఊరుకోను అని భవాని అంటుంది. ఇక ఈ ఇంటి కుటుంబ పరువు తో పాటు ఈ ఇంటిగుట్టు కాకుండా చూస్తూనే బాధ్యత నాది ఎలాగైనా సరే మనందరం కలిసి ఉండాలి అని భవాని వాళ్లతో అంటుంది.

కృష్ణ ఈ రోజు నువ్వు సెలవు పెట్టు అని మురారి అడుగుతాడు. హమ్మో గౌతమ్ సార్ ఊరుకోరు అని కృష్ణ అంటుంది. సారీ సార్ అని కృష్ణ అంటుంది. నాకు సెలవు పెట్టాలని ఉంది కానీ కుదరదు. కావాలంటే సాయంత్రం త్వరగా వస్తాను అని అంటుంది. ఇక మురారి కృష్ణ వెళ్లిపోగానే తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆఫీస్ కి వెళ్దామని బయలుదేరుతుండగా తన కార్ డోర్ ఓపెన్ చేయగానే తన కారులో ముకుంద కూర్చుని ఉంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ కోసమని ఓ చీర తీసుకొని వస్తాడు. ఆ చీర కోసం వెతుకుతుండగా ఎక్కడా కనిపించదు. ఇక ఆ చీర ముకుందా కట్టుకొని వచ్చి పురారికి కనిపిస్తుంది. కృష్ణ కోసం తీసుకొచ్చిన చీర ముకుంద కట్టుకుని వచ్చి మురారి కి జలక్కిస్తుంది.