Krishna Mukunda Murari: కృష్ణ మురారి మాట్లాడుకుంటూ ఉండగా.. మురారి ఫోన్ కి ముకుందా కాల్ చేస్తుంది. ముకుందా ఫోన్ చేసిందని మాట్లాడమని మురారి కి ఫోన్ ఇస్తుంది కృష్ణ. మురారి ఫోన్ లిఫ్ట్ చేయగానే కృష్ణ కి ఫోన్ ఇవ్వమని ముకుందా అంటుంది.. ముకుంద కృష్ణని తన రూమ్ కి రమ్మని పిలుస్తుంది ఏమైంది? ముకుందా ఏం అనింది అని మురారి ఆత్రుతగా అడుగుతాడు .. ఏం లేదు సార్ తన రూమ్ కి రమ్మని ముకుంద పిలిచింది అని కృష్ణ చెబుతుంది.
కృష్ణ ముకుంద దగ్గరకు వెళ్ళగానే.. ఎందుకు మీరు హనీమూన్ ట్రిపుకు వెళ్లకుండా ఆగిపోయారు. ఒకవేళ మురారినే వద్దన్నాడు అంటే చెప్పు. నేను మురారితో మాట్లాడి కన్విస్ చేస్తాను అని ముకుందా అడుగుతుంది. లేదు నేనే వద్దన్నాను అని కృష్ణ ముకుంద కి చెబుతుంది. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో చూడాలని మురారి ఆ రూమ్ బయట నిలబడి .. ముకుంద అడిగే ప్రశ్నలను.. కృష్ణ చెప్పే సమాధానాలను వింటూ నిలబడతాడు. అయ్యో కృష్ణ నువ్వు నన్ను ముకుందా దగ్గర సేవ్ చేస్తున్న అని అనుకుంటున్నావు. కానీ నువ్వు మాట్లాడే మాటలు ముకుందానికి ఇంకాస్త కోపాన్ని తెప్పిస్తాయి. నేను ఈరోజు అయిపోయాను అని మురారి మనసులో అనుకుంటాడు.
Intinti Gruhalakshmi: అందరి ముందు తన పార్ట్నర్ కి రోజా పువ్వు ఇచ్చిన తులసి.. నందు గుండెల్లో రాయి..
Krishna Mukunda Murari: మురారికి దూరమవుతున్న కృష్ణ.. అసలు విషయం తెలుసుకున్న ముకుంద.!
కృష్ణ వాళ్ళ తయారైనవతి దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి అత్తయ్య . మీరు ఇంతలా బాధపడతారని నేను అనుకోలేదు అంటూ కృష్ణ రేవతిని హత్తుకుని గట్టిగా ఏడుస్తుంది. నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. కృష్ణ కానీ మీరిద్దరూ హనీమూన్ కి వెళ్లకపోయినా పర్వాలేదు.. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సఖ్యతగా ఉంటే చాలు అని అంటుంది. రేవతి ఇక రేవతి మాట్లాడిన మాటల్లో తలుచుకుని కృష్ణ ఏడుస్తూ మురారి దగ్గరకు వెళుతుంది. నావల్ల రేవతి అత్తయ్య ఎంతో బాధపడుతుంది అని కృష్ణ ఏడుస్తూ మురారిని హత్తుకుంటుంది. నువ్వు ఏం బాధపడకు కృష్ణ నీ ధ్యాసంతా నీ చదువు మీద పెట్టు.. నువ్వు హౌస్ సర్జన్ అవ్వాలి. పెద్ద డాక్టర్ అవ్వాలి. మీ అమ్మ మీ నాన్న కన్న కలల్ని నువ్వే నెరవేర్చాలి అని మురారి కృష్ణకు ధైర్యం చెబుతాడు.. మురారి కృష్ణను హత్తుకోవడం చూసి ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది మురారిని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది.
Avunu Valliddaru Ista Paddaru: కళావతికి నిజం చెప్పిన ఢిల్లీ.. మనోజ్ ను పంపడానికి పూజ ప్లాన్..
ముకుంద దగ్గరకు వెళ్ళినా మురరిని.. నీకు నువ్వే సాటి మురారి నారి నారి నడుమ మురారి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అని మురారి ముకుందను అడుగుతారు . నువ్వేం చేస్తున్నావ్ నీకు తెలుస్తుందా అని ముకుందా మురారిని ప్రశ్నిస్తుంది. నాకు స్పష్టంగా తెలుస్తుంది. అని మురారి అంటాడు.. నీ ప్రవర్తన చాలా కష్టంగా ఉంది.
నువ్వు మోసం, దగా , అన్యాయం చేశావు అని అనగానే.. ఆపు ముకుందా ఆపు ఎందుకలా నిందలు వేస్తున్నావు అని మురారి అడుగుతారు. నిజాలు చెబుతున్నాను అని నాకు అన్యాయం చేసి నీ భార్యకు న్యాయం చేస్తున్నావని ముకుందా అంటుంది. చాలు ఆపు అని మురారి కోపంగా అరుస్తాడు. ఏ సంబంధం లేకుండానే నీ భార్యను నీ గుండెలకు హత్తుకున్నావా అని ముకుందా ప్రశ్నిస్తుంది.
మురారి దగ్గరకు వచ్చిన ముకుందా నీ భార్యతో చాలా సఖ్యతగా ఉంటున్నావు అని ముకుందా ప్రశ్నిస్తుంది అసలు మా ఇద్దరిదీ పెళ్లి కాదు మా ఇద్దరిదీ అగ్రిమెంట్ మ్యారేజ్ తను ఒక సంవత్సరం తర్వాత నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అంటూ అసలు నిజాన్ని మురారి చెప్పేస్తాడు ఆ మాట వినగానే ముకుందా సంతోషిస్తూ ప్రేమకు ఉన్న గొప్పతనం ఏంటో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఈ నిజాన్ని ప్రేమికుల రోజున చెప్పి నువ్వు నాకు ఇంకా దగ్గరయ్యావు థాంక్యూ మురారి అంటూ ముకుందా మురారిని హత్తుకుంటుంది మిగతా విశేషాలు రేపటి భాగంలో చూద్దాం.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!