Krishna Mukunda Murari: మురారి కృష్ణ కోసమని ఓ చీర తీసుకొని వస్తాడు. ఆ చీర కోసం వెతుకుతుండగా ఎక్కడా కనిపించదు. మురారి ఆ చీర గురించి ఆలోచిస్తూ ఉండగా.. ముకుందా ఆ చీర కట్టుకొని వచ్చి మురారికి కనిపిస్తుంది. కృష్ణ కోసం తీసుకొచ్చిన చీర ముకుంద కట్టుకుని వచ్చి మురారి కి జలక్కిస్తుంది. ఏంటి మురారి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని ముకుందా అడుగుతుంది..

నాకోసమే కదా నువ్వు ఈ చీర కొనుక్కొచ్చావు. నీకు చీరల సెలక్షన్ బాగా తెలుసు.. నాకు ఏ కలర్ సూట్ అవుతుందో ఏ డిజైన్ సెట్ అవుతుందో నీకు బాగా తెలుసు.. నా కోసమే కదా ఈ చీర తెచ్చావు అని ముకుందా అడుగుతుండగా.. మురారి మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు నీకోసం తీసుకురాలేదంటే మళ్ళీ ఎదో ఒక గొడవ అవుతుంది అని మౌనంగా ఉండిపోతాడు. నిన్ను పెద్దమ్మ పిలుస్తున్నారు అని గొంతు వినిపించగా అక్కడి నుంచి త్వర త్వరగా వస్తాడు మురారి.

ఏమైంది పెద్దమ్మ ఎందుకు పిలిచారు అని మురారి అడగగా.. టైం ఎంత అయింది నీ భార్య ఇంకా ఇంటికి రాలేదు తన గురించి పట్టించుకునే పని లేదా అని భవాని అనగానే నా భార్యను నేను పికప్ , డ్రాప్స్ చేసుకోవాలంటే.. ఈ ముకుంద నన్ను డ్రైవర్ అని అనేవి దాంతో తను ఒక్కటే వెళ్లి వస్తుంది అని మురారి అంటాడు అప్పుడే కృష్ణ గౌతమ్ సర్ బైక్ మీద ఇంటికి వస్తుంది బాబాయ్ పైనుంచి నందిని గౌతమ్ కళ్ళను మాత్రమే చూస్తుంది నువ్వు వైపు గౌతం నందిని ఎక్కడ అని ఆ ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటాడు..

అసలు నువ్వు ఒకరి బైక్ ఎక్కి ఎందుకు వచ్చావు అని భవాని అడగగా అక్కడ చాలా టైం అయిందని .. ఆ రోడ్డు అంతా చీకటిగా ఉంటుందని గౌతమ్ సార్ లిఫ్ట్ ఇస్తానంటే బైక్ ఎక్కి వచ్చానని కృష్ణ అంటుంది. ఇంకోసారి నువ్వు ఇలా ఎవరి బైకు ఎక్కి ఇంటికి రాకూడదు. మీ అంతటికి నువ్వే ఇంటికి రావాలి అందుకు పనిష్మెంట్ గా నీకు ఈరోజు భోజనం తినకుండా ఉండాలి అని భవాని పనిష్మెంట్ ఇస్తుంది. మురారి కూడా కృష్ణపై ఫైర్ అవుతాడు .కిందకు వచ్చిన కృష్ణ ప్లేట్లో భోజనం పెట్టుకుంటుండగా ముకుందా వచ్చి మరో గొడవ చేస్తుంది. ఈ భోజనం నాకు కాదు నందిని కోసమని కృష్ణ చెబుతుంది.