Krishna Mukunda Murari: పూజ పూర్తయిందని అందరికీ ప్రసాదం ఇస్తారు పంతులుగారు. ఏసిపి సార్ ఇదిగోండి మీ పర్సంటే కృష్ణ మురారి కి పర్సు ఇవ్వబోతుండగా.. మురారి ఎడం చేయి చాపుతాడు. అదేంటి ఇస్తున్నారు కుడి చేయి ఇవ్వమని కృష్ణ అంటుంది. ఇక చేతులు చేయి అడ్డం పెట్టుకొని మురారి ఇస్తాడు. ప్రసాదం అందరు తీసుకున్న తరువాత పంతులు గారు మీ భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలని ఈ పసుపు కొమ్మును చెట్టుకు కట్టమని కృష్ణకి పంతులుగారు ఇస్తారు. ఇక ఆ పసుపు కొమ్ములు ఎలాగైనా ముకుందా తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది ముకుంద. కృష్ణ ఆ పసుపు కొమ్ము చెట్టుకి కట్టేస్తే మురారి తన సొంతమై పోతే నేను తట్టుకోలేను. ఎలాగైనా కృష్ణ దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా ముకుంద కి మెరుపులాంటి ఆలోచన వస్తుంది.

కృష్ణ అక్కడ వాయనం ఇస్తున్నారు. ఎంత అదృష్టవంతురాలు కృష్ణ ముత్తయిదువులకి వాయనం ఇస్తున్నారు త్వరగా వెళ్లి తెచ్చుకో అని ముకుందా అంటుంది. నువ్వు వెళ్లి తీసుకో అని ముకుందా సలహా ఇస్తుంది. ఈ పసుపు కొమ్ము నాకు ఇవ్వమని ముకుందా తీసుకుంటుంది. గుడిలో ఉన్న చెట్టుకు కట్టి కృష్ణ వెళ్లిపోగానే మురారి నేను ఒకటి అవ్వాలని ముకుందా దండం పెట్టుకుంటుంది. ముకుంద పసుపు కొమ్ముడు చెట్టుకి కట్టడం దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇక తన దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా ముకుందా అని మురారి ముకుందను తిడతాడు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నాకు నీ ప్రేమ కావాలి అందుకోసం ఏమైనా చేస్తాను అని ముకుందా అంటుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి ముందు అడ్డంగా దొరికిపోయిన కృష్ణ, పద్మావతి ఏం చేయనుంది…
అందులో కృష్ణ అక్కడికి వస్తుంది. ఇద్దరూ వచ్చేసరికి ముకుంద ఆ ముడుపులు చెట్టుకు కట్టి నిలబడి ఉంటుంది. కృష్ణ వచ్చి ముకుంద ఆ పసుపు కొమ్ము చెట్టు ఎవరికీ కట్టారు అని అడగగానే నేనే కట్టాను అని ముకుందా చెబుతుంది. ఆమాటకి మురారి, కృష్ణ ఇద్దరు షాక్ అవుతారు. ఆ వెంటనే ముకుందా నవ్వుతూ నేను కాదు నీ ఏసీబీ సారే కట్టారు అంటూ కవర్ చేస్తుంది. ఆ మాటకి మురారి కోపంగా ముకుంద వైపు చూస్తాడు అయితే ఓకే అని అంటుంది.
Brahmamudi: రాజ్ ఆలోచనలో మార్పు వచ్చిందా.. స్వప్నని రాహుల్ శాశ్వతంగా వదిలించుకుంటాడా..
మురారి పుట్టినరోజు తెలుసుకొని ఆఫీసర్ గుడికి వస్తాడు. సర్ ఈరోజు మురారి పుట్టినరోజు అని మీకు తెలుసా అని కృష్ణ అనగానే.. తెలుసమ్మ కృష్ణ అందుకే మురారి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ని మరి లిఫ్ట్ చేస్తున్నాను అని అంటారు. మీ ఇద్దరూ ఇలా పుట్టినరోజు చేసుకోవడమే కాదు, మీ ఇద్దరి గుర్తుగా ఓ బిడ్డని మా అందరికీ గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన చెప్పడంతో మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను అంటూ కృష్ణ సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో మురారి తన పెద్దమ్మ వాళ్ళని ఓ రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు. ఇక మురారి ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడ కూర్చుంటాడు. ఎలాగైనా ఆ రింగ్ తీసేసి ముకుందకు ఇచ్చేయాలని నానా తంటాలు పడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ ఉంగరాన్ని తీయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మురారి కానీ ఆ రింగ్ ఇంకాస్త టైట్గా బిగుసుకొని బయటకు రాకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఉండాలని మురారి జాగ్రత్తలు పడుతూ ఉంటాడు. కానీ అనుకోకుండా వాళ్ల పెద్దమ్మ తనకి భోజనం వడ్డిస్తూ ఉండగా ఆలు పెద్దమ్మ అని చేయి చూపిస్తాడు అంతే ఇక వాళ్ళ అమ్మ వెంటనే ఆ చేతికి ఉన్న రింగ్ చూసి ఈ ఉంగరం ఎక్కడిది మురారి అని ప్రశ్నిస్తుంది రేవతి. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.