Krishna Mukunda Murari: ఆపు ముకుందా ఆపు ఎందుకలా నిందలు వేస్తున్నావు అని మురారి అడుగుతాడు. నిజాలు చెబుతున్నాను అని నాకు అన్యాయం చేసి నీ భార్యకు న్యాయం చేస్తున్నావని ముకుందా అంటుంది. చాలు ఆపు అని మురారి కోపంగా అరుస్తాడు. ఏ సంబంధం లేకుండానే నీ భార్యను నీ గుండెలకు హత్తుకున్నావా అని ముకుందా ప్రశ్నిస్తుంది.

నీ భార్యతో చాలా సఖ్యతగా ఉంటున్నావు అని ముకుందా ప్రశ్నిస్తుంది.. అసలు మా ఇద్దరిదీ పెళ్లి కాదు. మా ఇద్దరిదీ అగ్రిమెంట్ మ్యారేజ్.. తను ఒక సంవత్సరం తర్వాత నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అంటూ.. అసలు నిజాన్ని ముకుంద కి మురారి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే ముకుందా సంతోషిస్తూ ప్రేమకు ఉన్న గొప్పతనం ఏంటో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఈ నిజాన్ని ప్రేమికుల రోజున చెప్పి నువ్వు నాకు ఇంకా దగ్గరయ్యావు.. థాంక్యూ మురారి అంటూ ముకుందా మురారిని హత్తుకుంటుంది..

మురారి తనకి దగ్గర అవుతాడన్న ఆనందంలో ముకుందా ఇంట్లో అందరికీ టిఫిన్ చేసి వడ్డిస్తుంది. ఆ మార్పు చూసి రేవతిలో కంగారు మొదలవుతుంది. కచ్చితంగా ఇది ఆదర్శ వస్తున్నాడు అన్న సంతోషం అయితే కాదని.. కచ్చితంగా వేరే కారణం ఉందని రేవతి అర్థం చేసుకుంటుంది..

ఇక రేపటి ఎపిసోడ్లో మురారిని మీరు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది.. ఆమెతో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారా అని అడుగుతుంది. మురారి ఆఫీస్ కి రెడీ అయి వెళ్తుండగా ముకుందా మురారి కి ఎదురు వచ్చి నువ్వు నాకు ఎప్పటికీ దగ్గరగా ఉంటావని నాకు అర్థమైంది… ఈరోజు వాలంటైన్స్ డే కాబట్టి అందరి ముందు నీకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతాను అని ముకుందా అంటుంది. ఆ మాటలకు మురారి కంగు తింటాడు..
