Krishna Mukunda Murari: కృష్ణ ప్లేటులో భోజనం పెట్టుకుని నందిని దగ్గరకు వెళ్తుంది. నందిని రా భోజనం తినిపిస్తానని నందినీకు తినిపిస్తుండగా ఇందాక నువ్వు ఎవరితో కలిసి వచ్చావు కృష్ణ అని అడగగా.. మా గౌతమ్ సార్ తో కలిసి వచ్చాను అని కృష్ణ చెబుతుంది. అప్పుడే మాటల మధ్యలో అతన్ని చూస్తుంటే నాకు సిద్దు గుర్తుకు వచ్చాడు అని నందిని చెబుతుంది. అసలు సిద్దు ఎవరు అని కృష్ణ అడుగగా.. అతని పేరు నాకు గుర్తుకు రాగానే తలలో నరాలు చిట్లిపోతున్నాయని నందిని అంటుంది.

ఇక తన గదిలోకి వెళ్ళగానే కృష్ణ ఆకలేస్తుంది ఏసీబీ సార్ అంటూ రూమ్లో అటు ఇటు తిరుగుతుంది. అయితే అప్పుడే మురారి పద నేను నిన్ను బయటికి తీసుకువెళ్తాను అని మురారి అంటాడు మా పెద్దమ్మ ఇంట్లో అని అందుకని బయటకు వెళ్ళకూడదు అని చెప్పలేదు కదా అని మురారి అంటాడు అని ఇద్దరు కలిసి బైక్ మీద బయటకు వెళ్తారు తినడానికి ఒక్క రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసి లేదు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదైనా హోటల్ జరిపించండి అని కృష్ణ అంటుంది తినేసి వస్తూ ఉండగా కృష్ణ కి ఐస్ క్రీమ్ కూడా ఇప్పిస్తాడు మురారి ఇక ఇంటికి రాగానే ఏంటి ఇలాగే వెళ్లిపోతావా అంటూ తన పెదాలకు అంటిన ఐస్క్రీమ్ని మురారి తుడుస్తూ ఉంటాడు అది చూసిన ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది.

కృష్ణ మురారి లోపలికి రావడంతోనే ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నిస్తుంది కృష్ణ ముకుందా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుంది అయినా ఎప్పుడు చూసినా మా భార్య భర్తల విషయంలో ఎందుకు నువ్వు కల్పించుకుంటున్నావు పక్క రూమ్లో ఈ భార్యాభర్తలు ఉన్నారా ఏం చేస్తున్నారు అనే విషయాలే తప్ప నీకు వేరే విషయాలు పట్టినట్టు ఉన్నాయి అని కృష్ణ ముకుందని కడిగిపారేస్తుంది..

మాటలతో హోల్డ్ యువర్ టంగ్ అని ముకుంద అంటుండగా.. ఆ మాత్రం ఇంగ్లీష్ నాకు వచ్చు నన్నాఫ్ యువర్ బిజినెస్ అని నేను అనగా కానీ నేను అనను నాకు ఆ సంస్కారం ఉంది అని కృష్ణ అంటుంది. మురారి జోలికి వస్తే ఊరుకోను మేమిద్దరం భార్యాభర్తలం ఎక్కడికైనా వెళ్తాం ఏమైనా చేస్తాం అసలు నీకెందుకు నువ్వు ఆదర్శ్ భార్యవి అలాగే ఉండు అంతేకానీ మా ఇద్దరి విషయంలో కల్పించుకోకు అని కృష్ణ అంటుంది. మురారి కృష్ణ ధైర్యంగా ఏసీబీ సార్ నా భర్త అని చెప్పడం చూసి ఆనందంతో పొంగిపోతాడు . ఇక ముకుందా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మురారి నిలబడి అలాగే ఉండటంతో కృష్ణ మురారి చేయని పట్టుకొని ముందుకు తీసుకు వెళుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ అని అరుస్తూ నందిని కిందకు వచ్చి పడిపోతుంది ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటారు.