NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారికి శాశ్వతంగా దూరం కానున్న ముకుందా.? రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights
Share

Krishna Mukunda Murari: మురారి ఎలాగైనా ఆ రింగులు తీసేయాలని నానా తంటాలు పడుతూ ఉంటాడు. వాష్ రూమ్ దగ్గర నిలబడి ఆ రింగ్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ముకుందా వస్తుంది. ఈ రింగ్ తియ్యకు మురారి, ఈ రింగ్ నీకు పెట్టినప్పటి నుంచి నేను నీకు మానసికంగా దగ్గర అయిపోయాను. మురారి నువ్వు కృష్ణతో కాపురం చేసి ఉంటే నేను ఆదర్శ్ తో కలిసి ఉంటే నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసి ఉండేదాన్ని. కానీ మనం వేరువేరుగా పెళ్లిళ్లు చేసుకున్న ప్రశాంతంగా లేము. ఆదర్శ్ తిరిగి వస్తాడు రాడు తెలీదు ఇక నువ్వు కృష్ణని నీతోనే ఉండమని చెప్పే ధైర్యం చేయలేవు. అందుకే మన ప్రేమను కాపాడుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను అని ముకుందా అంటుంది.

Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights
Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights

Krishna Mukunda Murari: దాచాలనుకున్న నిజాన్ని తనే బయటపెట్టిన మురారి.! రేపటికి సూపర్ ట్విస్ట్

మురారి తన పెద్దమ్మ వాళ్ళని ఓ రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు. ఇక మురారి ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడ కూర్చుంటాడు. ఎలాగైనా ఆ రింగ్ తీసేసి ముకుందకు ఇచ్చేయాలని నానా తంటాలు పడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ ఉంగరాన్ని తీయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మురారి కానీ ఆ రింగ్ ఇంకాస్త టైట్గా బిగుసుకొని బయటకు రాకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఉండాలని మురారి జాగ్రత్తలు పడుతూ ఉంటాడు. కానీ అనుకోకుండా వాళ్ల పెద్దమ్మ తనకి భోజనం వడ్డిస్తూ ఉండగా చాలు పెద్దమ్మ అని చేయి చూపిస్తాడు. అంతే ఇక వాళ్ళ అమ్మ వెంటనే ఆ చేతికి ఉన్న రింగ్ చూసి ఈ ఉంగరం ఎక్కడిది మురారి అని ప్రశ్నిస్తుంది రేవతి. మురారి కాస్త తడబడినా కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఆ ఉంగరం ఇందాక నాకోసం వచ్చినా సుపీరియర్ సర్ బర్త్ డే గిఫ్ట్ గా ప్రెజెంట్ చేశారని మురారి చెప్పి తప్పించుకుంటాడు. ఇక అందరూ భోంచేసి బిల్ కట్టబోతుండగా మురారి పర్సులో డబ్బులు అన్ని కృష్ణ కాళీ చేస్తుంది ఇక వాళ్ళ పెద్దమ్మ ఆ బిల్ పే చేసి అక్కడ నుంచి వచ్చేస్తారు.

Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights
Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights

Nuvvu Nenu Prema: పద్మావతి ముందు అడ్డంగా దొరికిపోయిన కృష్ణ, పద్మావతి ఏం చేయనుంది…

ఇక ఇంటికి రాగానే కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని మురారి ఓపెన్ చేస్తాడు. ఇక ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే అందులో ఒక పర్స్ ఒక చిన్న లెటర్ వెయ్యినూటపదహర్లు డబ్బులు ఉంటాయి. ఈ పర్సు, డబ్బులు లెక్క కాదు. ఈ లెటర్ లో ఏదో రాసి ఉంటుంది అని అని మురారి అనుకుంటాడు కొంపతీసి కృష్ణ ఐ లవ్ యు అని రాసిందా అని చూస్తాడు తీరా చూస్తే ఆ లెటర్లో ఏ సి పి సార్ ఎప్పటికీ మీరే నా దేవుడు మీ కృష్ణ అని రాసి ఉంటుంది. ఇక మురారి ఎలాగైనా కష్టపడి ఆ రింగ్ తీయడానికి నానా అగచాట్లు పడతాడు మొత్తానికి ఆ రింగ్ తన వేలు నుంచి తీసి దూరంగా విసిరి పడేస్తాడు దరిద్రం వదిలిపోయిందని మనసులో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు.

Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights
Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights

Brahmamudi: రాజ్ ని కావ్య విషయంలో నిలదీసిన ధాన్యలక్ష్మి..

భవాని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని ఆశ్రమం పనులు చూసిన తరువాతే మళ్ళీ ఇంట్లోకి వస్తానని చెబుతుంది మురారిని త్వరగా రమ్మను అని కృష్ణతో చెప్పడంతోనే మురారి గబగబాకు ఎందుకు దిగుతూ వస్తున్న, తను స్లిప్పే కింద పడిపోతుంటే కృష్ణ గట్టిగా పట్టుకుంటుంది. ఇక మురారి సంతోషంగా అక్కడికి వస్తాడు తన చేతికి ఉంగరం లేదని తెలిసేలాగా, ఆ చేతిని స్ట్రెస్ చేస్తూ రకరకాల ఆక్టివిటీస్ చేస్తూ ఉంటాడు మురారి . ముకుందా మురారి చేతికి ఉంగరం లేదని గమనించి మనసులో బాధపడుతుంది. నువ్వు ఇంతకు తెగించావో మురారి అని మనసులో బాధపడుతుంది.

Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights
Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights

Malli Nindu Jabili మే 15 ఎపిసోడ్: మల్లి తో మైండ్ గేమ్స్ ఆడుతున్న మాలిని…మాలిని ప్లాన్ ముందు చేతగాని వాడిలా అరవింద్!

ఇక కృష్ణ ఆశ్రమంలో స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఒప్పుకుంటుంది డాక్టర్గా సేవలందిస్తానని ఆ హాస్పటల్లో నేను ఒక భాగమవుతానని కృష్ణ చెప్పడంతో అందరూ సంతోషిస్తారు.  మురారి మనసులో ముకుందని ఇంతటి ఘాతుకానికి ఒడిగడితే నేను ఏమైనా చేయొచ్చు కదా కృష్ణతో నా ప్రేమని తనకి అర్థమయ్యేలా చెప్పి ఒప్పిస్తాను. అప్పుడు ముకుందా ఆటోమేటిక్గా నాకు దూరం అవుతుంది అని మనసులో అనుకుంటాడు.

Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights
Krishna Mukunda Murari Serial 16 May 2023 Today 158 Episode Highlights

Naga Panchami Serial మే 10: మోక్షను సర్పగండం నుండి కాపాడమని సాంబయ్యకు దండం పెట్టిన వైదేహి…పెళ్లి కూతురైన పంచమి.

ఇక రేపటి ఎపిసోడ్లో భవాని హాస్పిటల్ కట్టించడానికి ఆశ్రమానికి వెళ్తున్నానని ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. సరిగ్గా అదే సమయానికి ముకుంద వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ముకుందని తనతో పాటు తీసుకువెళ్తానని తనకు విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేస్తానని ఆయన చెబుతాడు. ఆదర్శ లేడు కాబట్టి విడాకులు త్వరగానే వస్తాయని ఆయన చెబుతారు. రేపటికి సూపర్ ట్విస్ట్ ఇస్తారు.


Share

Related posts

Brahmamudi: రాజ్ ను అడ్డంగా ఇరికించిన కావ్య..మళ్ళీ రోడ్డున పడ్డ స్వప్న…

bharani jella

నాగార్జున ఎన్నిసార్లు అడిగినా రాజ‌మౌళి అందుకు ఒప్పుకోవ‌ట్లేదా?

kavya N

Karthika Deepam November 28 Today Episode:విషమించిన దీప ఆరోగ్యం.. కొడుకు, కోడలు బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య..!

Ram