Krishna Mukunda Murari: ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి కూర్చుండగా.. మురారి కృష్ణ వస్తారు. అసలు నాతో చెప్పకుండా నేను పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కృష్ణను తీసుకొని బయటకు ఎందుకు వెళ్లావు అని మురారిని భవాని నిలదీస్తుంది. ఈ మధ్య నువ్వు నా మాటకు కూడా విలువ ఇవ్వడం లేదు . కృష్ణకి కాదు ఈసారి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని భవాని అంటుండగా.. కృష్ణ అని అరుచుకుంటూ వచ్చిన నందిని కింద పడిపోతుంది.

ఏమైంది నందిని అంటూ కృష్ణ కంగారు పడుతూ తన స్కేతస్కోప్ తో చూస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాలి ఏసీబీ సార్ అని అంటుంది. హాస్పిటల్ కి తీసుకు వెళ్ళగానే గౌతమ్ అక్కడికి వస్తాడు. వీళ్ళందర్నీ పంపించేయమని గౌతమ్ అక్కడున్న స్టాఫ్ కి చెబుతాడు. ఇక నందిని అలాంటి పరిస్థితుల్లో చూసిన గౌతమ లోలోపల రగిలిపోతాడు. ఒక్కసారి గతంలోకి వెళ్లి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటాడు.

అప్పుడే కృష్ణతో నేను ఇచ్చిన టాబ్లెట్ వల్లే ఇలాంటి రియాక్షన్ వచ్చింది అని గౌతమ్ కృష్ణతో చెబుతాడు. కానీ నేనే ఈ టాబ్లెట్ ఇచ్చానన్న విషయం నువ్వు మీ ఇంట్లో ఎవరికీ చెప్పకు.. నేను ఆ టాబ్లెట్ ఎందుకు ఇచ్చానో నీకు ఈ రెండు మూడు రోజుల్లోనే అర్థమవుతుంది అని గౌతమ్ చెబుతాడు. ఇక నందిని కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళండి అని గౌతమ్ పంపించేస్తాడు. అప్పుడే నందిని సిద్దు సిద్దు అని కలవరిస్తుంది. తనని చూడగానే సిద్దు అని పలకరిస్తుంది .ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను నువ్వు గుర్తుపట్టావంటే నీ ప్రేమ ఏంటో నాకు అర్థం అవుతుంది. ఇక నిన్ను కాపాడుకునే బాధ్యత నాది అని మనసులో అనుకుంటాడు గౌతమ్.

ఇక హాస్పిటల్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన కృష్ణకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది భవాని. ఆ తరువాత తల ఒకరు తన ఒక మాట అంటారు కృష్ణని .. కృష్ణ ఏడుస్తూ చేతులు జోడించి నమస్కరించి నేను కావాలని చేయలేదని చెబుతుంది. అయినా అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ వినరు. ఇక రేపటి ఎపిసోడ్ లో నందిని ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం కృష్ణ . అందుకే కృష్ణ కి ఇంట్లో ఉండే హక్కు లేదు తనని ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని భవాని అంటుంది.