Krishna Mukunda Murari: రేవతి తన కోడల్ని అందరూ తక్కువ చేసి మాట్లాడడం చూసి బాధపడుతూ ఉంటుంది. తనకి సపోర్ట్ గా నేను ఉంటాను అని అనుకుంటూ ఇంట్లో సామాన్లు అన్ని సర్దుతూ ఉంటుంది. అప్పుడే తనకి నందిని పెళ్లి కి రాయించిన శుభలేఖ చూసి ఆశ్చర్య పోతుంది. ఇక తను వెంటనే ఆ శుభలేఖను తీసుకెళ్ళి కృష్ణకు ఇస్తూ.. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇదిగో అంటూ ఆ శుభలేఖలు ఇస్తుంది అది చూడగానే కృష్ణ ఆశ్చర్య పోతుంది. ఇంకా నేను నందిని అమెరికా తీసుకెళ్లారేమో అని అనుకున్నాను. మన ఎవ్వరికి తెలియకుండా కిరణ్ తో తన పెళ్లి చేయాలనుకుంటున్నారని ఇప్పుడు అర్థమైంది. ఈ విషయాలన్నీ మురారి కి తెలుసా తెలీదా అని రేవతి అంటుంది ఆలోచనలో పడుతుంది కృష్ణ.

ఇక ఎంత కాలమని నేను కృష్ణ కోసం పోరాడాలి అని కృష్ణ అంటుంది. గురించి అని మురారి అడగగా అది జరిగేలా లేదు అని కృష్ణ అంటుంది. నేను మాట ఇచ్చాను కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ పెళ్లి చేస్తాను అని మురారి అనగానే.. మీ పెద్దమ్మని ఎదిరిస్తారా అని కృష్ణ ప్రశ్నిస్తుంది. గౌతమ్ సర్ ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది మన నందిని నే.. అనగానే మురారి ఉన్నచోటే కుప్పకూలిపోతాడు.

ఏంటి కృష్ణ నువ్వు మాట్లాడేది ఈమధ్య కదా గౌతమ్ సార్ ఏమైంది అని మురారి అంటాడు. లేదు ఇది ఎప్పుడో జరిగింది. మీరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడే గౌతమ్ నందిని ఇద్దరు ప్రేమించుకున్నారు. వాచ్మెన్ కొడుకుని తక్కువ స్థాయి వాడని ఇలా చేశాడు. నందిని కి మతిస్థిమితం తప్పడం జరిగినప్పుడు మీరు లేరు. ఈ విషయాల్లో మీ నాన్న మీ బాబాయి వాళ్ళు సహాయం చేశారు అని కృష్ణ చెబుతుంది.
Nuvvu nenu prema: విక్కీకి కృష్ణ గురించి నిజం తెలిసిపోతుందా? పద్మావతి ప్రేమను బయటపెడుతుందా?
నేను కావాలని గౌతమ్ సార్ ని ఇంటికి తీసుకువచ్చాను దాంతో మా మధ్య కోల్డ్ వార్ మొదలైంది. అందులో భాగంగానే ఈరోజు నందిని దాచిపెట్టారు అని కృష్ణ ఉన్న విషయాన్ని మూరారితో చెబుతూ.. నాకు అందుకే అంత కోపం వచ్చింది అని అంటుంది. నందిని గౌతమ్ సార్ ని పెళ్లి చేసుకుంటే మామూలు మనిషి అవుతుంది అని కృష్ణ గట్టిగా చెబుతుంది. మీ వాళ్ళు నందిని కి మతిస్థిమితం పోయేలాగా చేశారు. ఇప్పుడు గౌతమ్ సార్ ని పెళ్లి చేసుకుంటే తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఇప్పుడు మీరు గౌతమ్ సార్ తో నందిని పెళ్లి చేస్తారా అని కృష్ణ అడుగుతుంది. మురారి కాసేపు ఆలోచనా లో పడతాడు. నందిని కోసం ఇంత చేస్తున్నావని తెలిసినా కూడా నేను వాళ్ళ పెళ్లి చేయలేకపోతే మూర్ఖుడిని అవుతాను నేను ఇప్పుడు నీకు మాట ఇస్తున్నాను వాళ్ళిద్దరు పెళ్లి కచ్చితంగా చేస్తాను అని మురారి కృష్ణకు మాట ఇస్తాడు.

Bramhamudi : అపర్ణకు షాక్ ఇచ్చిన రాజ్.. స్వప్న ఎంట్రీతో కావ్య కష్టాలు వస్తాయా?
కృష్ణకిచ్చిన మాట నిలబెట్టుకోవాలా పెద్దమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అనే సంశయంలో మురారి నలిగిపోతూ ఉంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి నాకు ఇచ్చిన మాట ఏం చేశారు అని మురారిని అడుగుతుంది మరోవైపు భవాని వచ్చి నాకిచ్చిన మాట ఏం చేశావు మురారి అని అడుగుతుంది ఇక సెంటిమెంట్ డైలాగులతో మురారిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది భవాని. వాళ్ళిద్దరి వాదనలను మురారి మౌనంగా వింటూ ఉండటం తప్ప ఏమీ చేయలేడు ఇక రేపటి ఎపిసోడ్లో మురారి పెళ్లి దగ్గరకు వెళ్తూ తన కార్ని ఫాలో అవ్వమని కృష్ణకి చెబుతాడు ఇక ఆటోలో ఫాలో అవుతున్న కృష్ణ అనుహ్యంగా ఆ కార్ ను ఫాలో అవడం మిస్ అవుతుంది. ఎలా నందిని పెళ్లి ఆపుతుందో చూడాలి.