Krishna Mukunda Murari: నందిని దగ్గర నుంచి వస్తున్న గౌతమ్ ని హ్యాపీ తన కూతురికి ఎలా ఉంది అని భవాని అడుగుతుంది. ప్రస్తుతం తను ఓకే అని ఇంటికి తీసుకువెళ్లొచ్చు అని గౌతమ్ చెబుతాడు. మీ హాస్పిటల్ వాళ్ళే కదా ఆ మెడిసిన్ ఇచ్చింది అని అనగానే.. నాకు వేరే కేసు ఉంది అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. ఈ కేసు విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కృష్ణుని అడగండి అని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్..

ఇక గౌతమ్ తన రూమ్ లోకి వెళ్ళగానే.. గతంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాడు. భవాని తన తలకి గన్ పెట్టి తనని బెదిరించిన సంగతి గుర్తు చేసుకుంటాడు. అంతేకాకుండా పరువు కోసం తన ప్రేమని పణంగా పెట్టాల్సి వచ్చిందని.. ఒకవేళ నందిని కోసం ఎదురు వెళ్తే గనక నన్ను తోపాటు నా కుటుంబాన్ని కూడా చంపేస్తారు అంటూ ఒక్కొక్క సీక్రెట్ చేస్తూ ఉంటారు ..

ఇక కృష్ణ నందిని కి టాబ్లెట్ ఇవ్వడం కోసం ఇప్పటివరకు ఇదంతా జరిగింది. నీ వల్లే నీకు కచ్చితంగా శిక్ష పడాలి అంటూ.. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెబుతుంది. కానీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ దొంగలాగా కాదు.. గౌతమ్ సార్ అంతు తేల్చి నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఎక్కడి నుంచి వెళ్తాను అని కృష్ణ అంటుంది. అయితే వెంటనే నీ సీనియర్ కి ఫోన్ చేయమని ఇంట్లో వాళ్ళు చెబుతారు కానీ గౌతమ్ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా అదే వస్తుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా నందిని దగ్గరకు వెళ్తుంది. సిద్దు ఎక్కడ.. సిద్దు వెళ్లిపోయాడా.. వీళ్ళందరూ పంపించేశారా అని సిద్దు గురించి మాట్లాడుతున్న మాటలను.. ముకుందా వింటుంది.. ఇక అదే విషయాన్ని భవాని దగ్గరకు వచ్చి చెబుతుంది. అత్తయ్య అసలు ఎవరు ఈ సిద్దు అని భవానిని ముకుందా అడుగుతుంది.. మరోవైపు గౌతమ్ సార్ మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నానని నందిని విషయంలో ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ఏడుస్తూ చెబుతుంది కృష్ణ మురారి కి..