Krishna Mukunda Murari: మురారి కి ఒక వైపు భవాని మరోవైపు కృష్ణ వచ్చి నాకు ఇచ్చిన మాట ఏం చేశారు అని మురారిని అడుగుతుంది. మరోవైపు భవాని వచ్చి నాకిచ్చిన మాట ఏం చేశావు మురారి అని అడుగుతుంది ఇక సెంటిమెంట్ డైలాగులతో మురారిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది భవాని. వాళ్ళిద్దరి వాదనలను మురారి మౌనంగా వింటూ ఉండటం తప్ప ఏమీ చేయలేడు. వాళ్ళిద్దరూ కలిసి మురారిని మీద ప్రశ్నలు సంధించడంతో ఆపండి అని అనడంతో అది ఊహాని ఆ ఊహలో నుంచి బయటకు వస్తాడు మురారి. ఇద్దరిలో ఎవరికి న్యాయం చేయాలో తేల్చుకొని పరిస్థితిలో మురారి ఉంటాడు.

రేవతి కృష్ణ దగ్గరకు వస్తుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా, ఒకవేళ నందినీకి గనుక గౌతమ్ పిచ్చి పెళ్లి చేస్తే నీ భవిష్యత్తు అంధకారం అవుతుంది. నీకు కాపురం కృష్ణకు రేవతి సలహా ఇస్తుంది. మురారికి నీకు మధ్యన ఏవైనా సమస్యలు వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. వాళ్ళతో నువ్వు పోరాడలేవు నందిని అంటే నాకు జాలి సానుభూతి ఉంది. కానీ మనం వీళ్ళని ఎదిరించి ఏమి చేయలేము అని రేవతి అంటుంది. నా గురించి మీరు ఆలోచించకండి. ఏసిపి సార్ కు నాకు మధ్య ఎలాంటి విభేదాలు రావు. ఇక నేను అనుకున్నట్టే గౌతమ్ సార్ కి ఇచ్చిన నందిని పెళ్లి చేస్తాను అప్పుడే తను సంతోషంగా సుఖంగా ఉంటుంది అని కృష్ణ అంటుంది.

ఇక ఆ గదిలో నుంచి బయటకు వస్తున్న రేవతి ఎదురుగా తన భర్త తన వదిన కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం చూసి వాళ్ళు తనని ప్రశ్నించేలోపే, తనే ముందుగా ప్రశ్నించాలని అనుకుంటుంది. ఏమైంది ఇక్కడ కూర్చున్నారు ఈ సమయంలో ఏమైనా సమస్య అని రేవతి ప్రశ్నిస్తుంది. అలాంటిది ఏమీ లేదు అని చెబుతారు. అయినా నేను ప్రశ్నించాల్సింది పోయి నువ్వే ప్రశ్నించి భలే తెలివిగా మాట్లాడావు అని రేవతి నీ భవాని అంటుంది .ఇన్ డైరెక్ట్ గా రేవతికి చురకలు వేస్తుంది భవాని.
Brahmamudi: స్వప్నను చూసిన రాజ్ వాళ్ళ అమ్మ.. రేపటికి సూపర్ ట్విస్ట్

మురారి తన గదిలో దిగాలుగా కూర్చుని ఉంటాడు అప్పుడే కృష్ణ వచ్చి ఏంటి మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూన్నట్టు ఉన్నారు. మీ పెద్దమ్మకి నీకు మధ్యన ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను ఒకవేళ ఏదైనా గొడవ జరిగినా కూడా తప్పంటే మామూలుగా వేసుకుంటాను అని కృష్ణ మురారికే మాటే ఇస్తుంది కృష్ణ నిన్ను అంత తేలిగ్గా అంటుంటే ఊరుకుంటానా అని మురారి అంటాడు. అయినా నీకీ పంతం ఎందుకు అని మురారి అడిగితే ఎలాగో నాలుగు రోజుల తర్వాత వెళ్లిపోవాలి ముందుగా వెళ్లిపోయిన నందిని పెళ్లి చేసానన్న సంతృప్తితో వెళ్లిపోతే చాలు అని కృష్ణ అంటుంది కానీ నువ్వు వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదు కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు ఇక ఉదయం నిద్ర లేచిన తర్వాత కృష్ణ భవాని ఇద్దరు దేవుడి ముందు ఎవరి కోరికలు వారు విన్నవిచ్చుకుంటారు.
Nuvvu nenu prema : పద్మావతి పెళ్లి కృష్ణ తో జరుగుతుందా..విక్కీకి కృష్ణ బాగోతం తెలిసిపోతుందా?
మురారి పెళ్లి దగ్గరకు వెళ్తూ తన కార్ని ఫాలో అవ్వమని కృష్ణకి చెబుతాడు. మురారి తనతో మాట్లాడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎవరికో డైరెక్షన్స్ ఇస్తున్నాడని తెలుసుకున్న ముకుందా తన చెవిలో నుంచి బ్లూటూత్ తీసి పక్కన పడేస్తుంది. ఇక ఆటోలో ఫాలో అవుతున్న కృష్ణ అనుహ్యంగా ఆ కార్ ను ఫాలో అవడం మిస్ అవుతుంది. కృష్ణ ఎలా నందిని పెళ్లి ఆపుతుందో చూడాలి.