NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నిజం తెలుసుకున్న రేవతి..బాధపడిన మురారి.. ముకుంద ఏం చేయనుంది…

krishna-mukunda-murari-serial-2-june-2023-today-173-episode-highlights
Advertisements
Share

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో, ముకుంద తనకి మురారి కావాలని, ఇన్ డైరెక్ట్ గా రేవతీతో చెప్పేస్తుంది. రేవతి ముకుంద కి అలాంటి ఆశలు పెట్టుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

Advertisements

ఈరోజు ఎపిసోడ్ లో,మురారి కృష్ణ ఇద్దరు బయటికి వెళ్తారు. అక్కడ ఒక ప్రేమ జంట ఒక సమస్యతో కొట్టుకుంటూ ఉంటే, కృష్ణ మురారి వాళ్ల దగ్గరికి వెళ్లి సర్ది చెప్పాలని చూస్తారు. కృష్ణ ఆ అబ్బాయితో ప్రేమించడానికి సరిపోదు, బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఎలా కుదురుతుంది అని అంటుంది. మురారి ఆ అమ్మాయితో నువ్వు ఈ విషయం ఇప్పుడు కాదు మొదట్లోనే అతనికి చెప్పాలి ఇప్పుడు చెప్పి నేను ప్రేమించట్లేదు ఫ్రెండ్షిప్ అంటే ఎలాగూ అని అంటాడు. వాళ్ళిద్దరూ కొంచెం ముందుకు నడిచి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దర్నీ చూస్తూ కృష్ణ తను మురారి వెళ్తున్నట్టుగానే ఫీల్ అవుతుంది.

Advertisements
krishna-mukunda-murari-serial-2-june-2023-today-173-episode-highlights
krishna mukunda murari serial 2 june 2023 today 173 episode highlights

Krishna Mukunda Murari: ముకుంద కి రేవతి వార్నింగ్.. ముకుంద తర్వాతి ప్లాన్ అమలు చేయనుందా….

మధు స్రిప్ట్

మధు కథలు రాసుకుంటూ ఉంటాడు. ఏం రాస్తున్నారు అని అడుగుతుంది మధు భార్య, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాస్తున్నాను అని చెప్తాడు. నీ మట్టి బుర్రకి అద్భుతమైన స్క్రిప్ట్ కూడానా అని అంటుంది.నీ తలేమో పెద్దగా బ్రెయిన్ ఏమో చిన్నగా ఉంటుంది. అని మధు అంటాడు. మా పెరట్లో కోడుంది, పకోడీ ఒక గంప కింద ఉంటుంది.ఆ గంపని ఒక పిల్లి పీకేస్తుంది.ఆ కోడి తప్పించుకొని వెళ్ళిపోతుంది.అని అలేఖ్య అంటుంది.నన్నే కోడంటావా అని లేస్తాడు మధు.అలేఖ్య పూలకుండి తీసుకొచ్చి ఏంటి ఊరికే ఎక్కువ చేస్తున్నావ్ అని అంటుంది. అదే ఊరికి ఏ స్క్రిప్ట్ లో ఇలాంటి సిచువేషన్ వస్తే ఎలా నా అని ప్రాక్టీస్ చేస్తున్నాను అని అంటాడు మధు. స్క్రిప్ట్ గురించి నిజంగా ఏమో అనుకున్న అని అంటుంది. చాలా డబ్బులు వచ్చిన తర్వాత, కృష్ణ చేసిన పర్ఫామెన్స్ కి చాలా డబ్బులు కుప్పలుగా వస్తూ ఉంటాయి రేపు అని అంటాడు మధు. అయితే నాకు 50,000 ఇవ్వండి అని అంటుంది అలేఖ్య. దీనికి భరణం తీసుకొని వెళ్ళిపోతావా అని అంటాడు. మేకప్ వేసుకోవడానికి అని, అంటుంది అలేఖ్య. కదా మరి డబ్బులు కప్పలు తిప్పలు వస్తే, అని అన్నావ్ ఏంటి, అంటుంది అలేఖ్య. ఇంట్లో ఆదర్శ, మురారి ఎంతో,నువ్వు కూడా అంతే కావాలంటే అడిగి డబ్బులు తీసుకో అని అంటుంది అలేఖ్య. సరే అంటాడు మధు.

krishna-mukunda-murari-serial-2-june-2023-today-173-episode-highlights
krishna mukunda murari serial 2 june 2023 today 173 episode highlights

Nuvvu Nenu Prema: మొదటిసారి తన లవ్ స్టోరీ చెప్పిన పద్మావతి.

మురారి కి షాక్ ఇచ్చిన ముకుంద..

మురారి ఇంటికి వస్తాడు.ముకుంద దారికి అడ్డుగా నిలబడి,మురారి నీతో ఒక మాట చెప్పాలి అని అడుగుతుంది.పెళ్లైన స్త్రీ తన భర్తకు మాత్రమే చెప్పాలి నాకు కాదు అని అంటాడు. నా మనసు ఎప్పుడు నీతో ముడిపడిపోయింది, నీకే చెప్పాలి అని అంటుంది ముకుంద. అసలే నేను ఆఫీస్ చిరాకు లో ఉన్నాను వెళ్లాలి అని అంటాడు మురారి. చిరాక్ అంతా ఇంటి దగ్గరికి తీసుకువస్తున్న వ్, ఇక్కడ నీ ప్రేయసి ఉంది కదా ఆ చిరాకు తీర్చడానికి అని అంటుంది ముకుంద. అసలు ఎందుకు నాకోసం ఎదురు చూస్తున్నావు అని అంటాడు మురారి. ఎందుకే ఎదురుచూస్తున్నాను నీకు తెలియదా అని అంటుంది. నీకు ఒక విషయం చెప్పాలి నేను చెప్పేది వింటే నీ మనసు అల్లకల్లారం అయిపోతుంది మురారి అని అంటుంది ముకుందా, ఏంటి అంటాడు మురారి. ఇంట్లో ఏం జరుగుతుందో చూచాయిగా పసిగట్టింది మీ అమ్మగారు. మురారి షాక్ అవుతాడు. ఇవాళ ఆవిడ అంతటి ఆవిడే,చెప్పింది.మన ప్రేమ గురించి రాత పైకి తెలిసిపోయింది అని అంటుంది ముకుంద.ఏంటి ఆటపడిస్తున్నావ్ నన్ను.నువ్వు వాడే ఆటలకి నేనేం చేయలేను. అయినా ఆవిడ అంతా తెలిసిపోయింది అని అంటుంది ముకుందా, ఏం మాట్లాడుతున్నావ్ ఎవరు చెప్పారు అని అంటాడు మురారి. ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఆ ఒక్కరు నేనే, అంటుంది ముకుంద.మా అమ్మకు నువ్వు చెప్పావా అంటాడు మురారి.తప్పలేదు అని అంటుంది ముకుంద.ఆవిడ నన్ను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంది. ఎందుకంటే మనం ప్రేమికులు అన్న సంగతి నేను చెబితే కాదు, ఆవిడకి ముందే తెలిసిపోయింది. అవునా అని అడిగితే అవును అని చెప్పాను. ఎలా చెప్పావు అవును అని, ఆవిడ ఎలా తట్టుకుంటుంది అని అంటాడు మురారి. కాదు అని మన మధ్య ఏమీ లేదని చెప్పచ్చు కదా అంటాడు మురారి. ఆవిడకి తెలిసిపోయిన నిజాన్ని నిజం అని చెప్తే మాత్రం ఏమవుతుంది అని అంటుంది ముకుంద.

krishna-mukunda-murari-serial-2-june-2023-today-173-episode-highlights
krishna mukunda murari serial 2 june 2023 today 173 episode highlights

నీకేమైనా మతి పోయిందా ముకుందా ఆవిడ అనుమానం అనుమానం మిగిలిస్తే కనీసం మనకొక విలువైన ఉండేది. నీ ఇంట్లో నీకు విలువ ఉంటుంది మురారి నాకే విలువ లేకుండా పోతుంది అందుకే జరిగిందా దాంట్లో నా తప్పేం లేదని, నువ్వు నీ కుటుంబం కోసం నన్ను ప్రేమంటే ఆగం చేయమన్నా అవని ఇప్పుడు నేను ఒంటరిగా బతకడానికి కారణం నువ్వేనని, నేను చెప్పేసాను మురారి అని అంటుంది ముకుంద. తప్పు నా మీద ఎందుకు వేసుకోవాలి అని అంటుంది. అయితే కృష్ణ గురించి కూడా చెప్పావా, మాది అగ్రిమెంట్ పెళ్లి అని వెళ్ళిపోతుందని చెప్పావా, అది నా పని కాదు, కాబట్టి నాకు సంబంధించిన విషయం మాత్రమే చెప్పాను. అసలు మన గురించి ఎందుకు చెప్పావు ముకుందా, మా అమ్మ నేను ఎలా ఫేస్ చేయాలి ఏ ముఖం పెట్టుకుని ఎదురుపడాలి అని అంటాడు మురారి. నువ్వేం నేరం గారం చేయలేదు మురారి ప్రేమించావు అంతే కదా అంటుంది ముకుందా. ఆ ప్రేమని దక్కించుకోవడానికి నేను ఇంకా ఇక్కడ ఉన్నాను. కృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎలాగో మనం కలుస్తామని నమ్మకం నాకుంది. ముకుందా పదేపదే వెళ్లిపోతుంది కృష్ణ అని అనమాకు వినడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వినడానికి నీకు ఇబ్బందిగా ఉంటే అనుభవిస్తున్న నా పరిస్థితి ఏమిటి అని అంటుంది ముకుంద. అనుభవించడం నరకంగా ఒంటరిగా అనుభవిస్తున్న నా పరిస్థితి ఏమిటి. చాలు ఇప్పటికీ ఇంట్లో పెట్టించి చిచ్చు చాలు, ఇక నన్ను ఎలాగైనా బతకనివ్వు అని దండం పెట్టి మురారి వెళ్ళిపోతాడు.

krishna-mukunda-murari-serial-2-june-2023-today-173-episode-highlights
krishna mukunda murari serial 2 june 2023 today 173 episode highlights

Brahmamudi june 2nd Episode : రాహుల్ – స్వప్న పెళ్ళికి ముహూర్తం సిద్ధం చేసిన కుటుంబ సభ్యులు

మధు, ప్రసాదుల, మధ్య ఫన్నీ

ప్రసాదు మందు కొడుతూ ఉంటాడు. ప్రసాద్ భార్య వచ్చి పెద్దక్కుంటే బాగుండేది, అక్క లేకపోవడం వల్ల మీరు మీ అబ్బాయి ఇద్దరు ప్రతిరోజు మంద కొడుతున్నారు అని అరుస్తుంది. మధు వచ్చి ఒక 10,లక్షలు ఇవ్వు నాన్న అని అడుగుతాడు. నీ ముఖానికి 10 వేలు కూడ దండగ అని అంటాడు. ఇంతకు దేనికి రా అని అడుగుతాడు. మురారిని ఐపీఎస్ సాధించావు వాళ్లని మేజర్ ను చేశావు, నాకు పదిలక్షలు అడిగితే వేలిస్తావా అని అంటాడు మధు.వాళ్లతో నీకు పోలిక ఏంట్రా వాళ్ళ లాగా నువ్వు చదువుకున్నట్లు అయితే నాకీ పరిస్థితి ఉండేది కాదు కదా అంటాడు. వాళ్ల లాగా నేను చదువుకున్నట్టు ఉన్నట్టయితే, నిన్ను అడిగే పరిస్థితి నాకే వచ్చేది కాదు కదా, అని అంటాడు మధు. ప్రసాదు 500 ఇచ్చి ఇవి తీసుకో అని అంటాడు. 500, నా గురించి నీకు తెలియదు,నేను షార్ట్ ఫిలిం తీసి,ప్రయోజకుడయి నేనే నీకు డబ్బులు ఇస్తాను. అప్పటిదాకా ఈ డబ్బులు ఉంచుకో అని అడ్వాన్స్గా ఈ 500 తీసుకో అని ప్రసాద్ కి ఇస్తాడు మధు. ఇద్దరు కాసేపు ఫన్నీగా నవ్వుకొని వెళ్లిపోతారు.

krishna-mukunda-murari-serial-2-june-2023-today-173-episode-highlights
krishna mukunda murari serial 2 june 2023 today 173 episode highlights

మురారి,జరిగినదంతా ఆలోచిస్తూ ఉంటారు. ముకుంద అన్న మాటలు కృష్ణ అన్న మాటలు అన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు కృష్ణ ఎందుకు అలా మాట్లాడావు అని అంటాడు. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు నిన్న మొన్నటిదాకా దర్శన పుస్తకంలో ఉండే దానివి ఇప్పుడు మూసేసిన పుస్తకం లా కనిపిస్తున్నావు నీ మాటలు అర్థం నాకు అర్థం కావట్లేదు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నన్నువదిలి వెళ్ళిపోగలవా నువ్వు.అని మనసులో అనుకుంటూ ఉంటాడు.రేవతి,ముకుందా అన్న మాటలే ఆలోచిస్తూ ఉంటుంది.నాకు మురారి కావాలి అని ముకుంద ఇండైరెక్టుగా రేవతిని అడిగినవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి ఏంట అత్త ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా అని అంటుంది రేవతి. అత్త ఎందుకు అలా ఉంది అని మనసులో అనుకుంటుంది కృష్ణ. మురారి బాధపడుతూ, సాంగ్ వేసుకుంటూ ఉంటారు.

కృష్ణ తనకి ప్రపోజ్ చేసిన విషయం తనతో వానిలో తడిచి మాట్లాడిన విషయం, అన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు మురారి. కృష్ణ కూడా, వైసిపి సార్ మనసులో నేనే ఉన్నాను అనుకున్నాను కానీ, ఇప్పుడు ఆయన మనసులో ఎవరో ఉన్నారని తెలిసింది. నా ప్రేమ నాలోని సమాధి చేసుకోవాల్సి వచ్చింది. గడువు పూర్తి కాగానే ఎసిపిశానని పంపించేస్తారా అసలు నేను ఇప్పుడు ఈయనతో ఎలా ఉండాలి అని అనుకుంటూ మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటుంది. మరి ఇద్దరూ బాధపడుతూ, ఒకరికొకరు ఎదురవుతారు. ఏంటి కృష్ణ ఇంత లేట్ అయింది అనిఅడుగుతాడు మురారి.సర్జరీ ఉందని చెప్పాను కదా అంటుంది కృష్ణ. అయినా అత్తయ్య ఏంటి ఎలా ఉంది అని అడుగుతుంది. మురారి ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు కృష్ణ అని అంటాడు. అవునవును, ఉదయం నేను ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయితో చెప్పింది కరెక్టేనా, మరి నేను చెప్పింది కూడా కరెక్టేనా అని అంటాడు. నీకు కరెక్ట్ అయింది ఇంకొకరికి రాంగ్ అవ్వచ్చు కదా అంటుంది కృష్ణ. మీరు అడిగిన దానికి జవాబు చెప్పకుండా నిలబడతారేంటి అంటుంది. నాకు రాంగ్ అనిపించింది ఇంకొకరు కరెక్ట్ అయి ఉండొచ్చు కదా అంటాడు మురారి.

 

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ నీ డ్రెస్ సెలెక్ట్ చేయమని మురారి అడుగుతాడు. డ్రెస్ కోసం కబోర్డ్ తీస్తుంది కృష్ణ. మురారి చూసి కంగారుపడి అయ్యో డైరీ అందులోనే ఉంది అనవసరంగా కృష్ణ డ్రస్సులు చేయమని అనుకోని కృష్ణ దగ్గరికి వెళ్లి, ఏదో ఒకటి వేసుకుంటానులే అని అంటాడు. నన్ను సెలెక్ట్ చేయమని మళ్లీ ఏంటి సార్ మీరు నేను ఇస్తాను ఉండండి అని ఒక్కొక్కటి డ్రెస్సులు తీస్తూ ఉంటుంది… చూడాలి డైరీ కృష్ణ చూస్తుందే చూడదో…


Share
Advertisements

Related posts

మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. చిరంజీవి సినిమా వాయిదా!?

kavya N

Thaman: క్యాన్సర్ పేషంట్ కి బిగ్ హెల్ప్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..!!

sekhar

Madhuranagarilo September 27 ఎపిసోడ్ 168: సుందర్ గురించి రాధతో చెప్పేసిన శైలజ…శ్యామ్ తో పెళ్లి కోసం మధురను మోసం చేసిన సంయుక్త!

siddhu