Krishna Mukunda Murari: ఈశ్వర్ ప్రసాద్ ఇద్దరు కూడా డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెబుతారు ఆయన ఎంతసేపటికి రాకపోవడంతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో ముకుందా వచ్చి కృష్ణా మురారి ఎక్కడికి వెళ్లారు అని అడిగితే బయటకు వెళ్లారు అని చెబుతారు. ఇక ముకుందా కృష్ణ మురారి మీద లేని కల్పించి చెబుతుంది. ఓ పక్క అత్తయ్యకు బాగోలేదన్న కూడా వీళ్ళిద్దరూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏం చెక్క బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కృష్ణ పై లేనిపోని విషయాలన్నీ చెబుతుంది. వాళ్ళిద్దరూ మాత్రం మురారిని తప్పు పడతారు. అదేంటి నేను కృష్ణని టార్గెట్ చేస్తుంటే వీళ్ళు ఎందుకు మురారిని తప్పుగా అనుకుంటున్నారు అని ముకుందా మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari: భవానికి ట్రీట్మెంట్ చేసిన కృష్ణ.! ఆ విషయం తెలిస్తే సూపర్ ట్విస్ట్.?
మరోవైపు మురారిని తీసుకుని బయటకు వెళ్లిన కృష్ణ భవాని ట్రీట్మెంట్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ మెడిసిన్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక అందరూ చూస్తుండగానే కృష్ణ భవానికి వైద్యం చేస్తుంది. ఆ సమయంలో కూడా కృష్ణ ఎవరితో మాట్లాడకుండా బీపీ చెక్ చేసి వెంటనే సిలైన్ పెట్టి భవానికి ట్రీట్మెంట్ చేస్తుంది. కృష్ణ ఇచ్చిన మెడిసిన్ కి భవానిలో చలనం కనిపిస్తుంది కాసేపటి తరువాత మెలుకు వచ్చిన భవాని లేవటానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడే తన ఎదురుగా టాబ్లెట్లు వేసుకుని జ్యూస్ తాగండి పెద్ద అత్తయ్య అని రాసి ఉన్న బోర్డు తనలో తనే చూసి విసుక్కుంటుంది భవాని. కానీ మాట్లాడే ఓపిక లేక ప్రశాంతంగా నిద్రపోతుంది. కాసేపటి తరువాత ఈశ్వర్ ప్రసాద్ పిలిపించిన డాక్టర్ వస్తారు భవానిన్ని చెక్ చేసి తను చాలా నార్మల్ గా ఉంది. అని చెబుతారు అయినా తనకి వైద్యం చేశారు కదా. ఎవరు చేశారు అని అడిగితే ఒక జూనియర్ డాక్టర్ చేసింది అని ముకుందా అంటుంది. జూనియర్ డాక్టర్ అయినా కూడా ఒక సీనియర్ డాక్టర్ లాగా భవాని గారికి ట్రీట్మెంట్ ఇచ్చింది అని ఆ డాక్టర్ చెబుతాడు. ఇక ఇవే మెడిసిన్ కంటిన్యూ చేయండి . రెండు రోజుల్లో భవాని గారు నార్మల్ అవుతారు అని ఆ డాక్టర్ చెబుతారు. ఇక తన కోడలు చేసిన వైద్యం మంచిదని మరో డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడంతో రేవతి గాల్లో తేలిపోతుంది.
Brahmamudi : స్వప్న వెనుక ఉన్నది రాహుల్ అని తెలిసిపోతుందా? కావ్య ను రాజ్ భార్యగా ఒప్పుకుంటాడా?

Nuvvu nenu prema: అను, ఆర్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. విక్కీ పెళ్లిని ఫంక్షన్ లో అనౌన్స్ ?
ఇక గదిలోకి వచ్చిన కృష్ణ కి మురారి థాంక్యూ చెబుతాడు. నీవల్లే తప్పు జరిగిందని మా పెద్దమ్మ అన్న కూడా ఈరోజు నువ్వు పెద్ద మనసు చేసుకొని తనకి వైద్యం చేసావు థాంక్యూ కృష్ణ అని మురారి అంటాడు. గొప్ప వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళు చేసిన సాయం మర్చిపోయి ఎదుటివారు చేసిన సాయాన్ని గుర్తిస్తూ ఉంటారు సాయం చేసిన వాళ్ళు వాళ్ళు చేసిన సాయాన్ని మర్చిపోతారని నేను అడిగానని మీరు నందిని గౌతమ్ పెళ్లి చేశారు. కానీ మీరు ఆ సాయాన్ని మర్చిపోయి ఈరోజు మీ పెద్దమ్మకి సహాయం చేశానని నన్ను మెచ్చుకుంటున్నారు. కానీ నేను కేవలం వైద్యం మాత్రమే చేశాను అని కృష్ణ అంటుంది. నా రెస్పాన్సిబిలిటీగా చేశాను అని నువ్వు ప్రేమగా ఎప్పుడు చెబుతావు అని ఎదురుచూస్తున్నాను కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు. ఆ మాట చెబితే నాకు చాలా ఆనందం కదా అని కూడా అనుకుంటాడు మురారి.

ఎన్ని రోజులని మీ మనసులో మీరే మీ పెద్దమ్మని తలుచుకుని బాధపడుతూ ఉంటారు ఏసీబీ సార్. ఒక్కసారి మీ పెద్దమ్మకు ఫోన్ చేయండి అని కృష్ణ సలహా ఇస్తుంది. తన సలహా మేరకు మురారి ఒకసారి వాళ్ళ పెద్దమ్మకు ఫోన్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోసారి చేయమని కృష్ణ అంటుంది. అప్పుడు కాల్ కట్ చేసింది అని కృష్ణతో మురారి అంటాడు మీరే కాల్ చేస్తున్నారు అని మీ పెద్దమ్మకు తెలిసింది కదా, ఇంకోసారి కాల్ చేయమని కృష్ణ అంటుంది. ఈసారి బ్లాక్ లిస్టులో పెట్టింది అని మురారి ముభావంగా చెబుతాడు. అయితే ఈ విషయాన్ని నేనే తెలుస్తాను అని కృష్ణ భవాని దగ్గరకు బయలుదేరుతుంది . కానీ తనకి గన్ గురిపెట్టిన సీన్ గుర్తు వచ్చి యావ్ అనే అరుస్తూ ఒక్కసారిగా మురారి ఒడిలో పడుతుంది కృష్ణ. కృష్ణ అరుపు వినిపించిన ముకుందా వెంటనే వాళ్ళ గదిలోకి తొంగి చూస్తుంది మురారి ఒడిలో కూర్చున్న కృష్ణని చూసి కోపంతో రగిలిపోతుంది ముకుంద. ఇక ఇద్దరి మధ్యన జరిగే గిలిగింతలు చూసిన ముకుంద ఏం చేస్తుందో తరువాయి భాగంలో చూద్దాం.