NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఈ పెళ్లోద్దన్న నందిని మురారి ఆపెస్తాడా.? కృష్ణ గౌతమ్ నందిని పెళ్లి చేసిందా.? సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights
Share

Krishna Mukunda Murari: మురారి పెళ్లికి కావలసిన ఏర్పాట్లు అన్ని సక్రమంగానే జరిగాయి అని భవాని అడుగుతుంది. ఆ పెద్దమ్మ అని మురారి ముభావంగానే చెబుతాడు. పెళ్లికి వచ్చినా పెళ్లి కొడుకుకి ఎక్కడ ఏమాత్రం లోటు జరగకుండా చూసుకునే బాధ్యత మీదే వాళ్లకి చక్కగా మర్యాదలు జరగాలి మీరు కళ్యాణమండపం కి వెళ్ళండి. నేను వెళ్లి నందిని తీసుకు వస్తాను అని భవాని అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ముకుంద నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అని భవాని చెబుతుంది. అప్పుడే కృష్ణ తన గదిలో నుంచి కిందకు వస్తుంది. అది గమనించిన వాళ్ళందరూ సైలెంట్ గా ఉండిపోతారు. నేను మౌనంగా ఉంటే వీళ్ళు నాకు విషయం తెలిసిపోయిందని అనుకుంటారు. అందుకే నేను యాక్టివ్ గా ఉండాలని కృష్ణ మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights

Krishna Mukunda Murari: భవాని కృష్ణ మధ్యన మురారి నందిని పెళ్లి ఎవ్వరితో చేయనున్నాడు.??

ఏమైంది ఏసీబీ సార్ ఎలా ఉన్నారు ఏదో చెయ్యి కూడా నీ పని చేస్తున్నట్టుగా ఉన్నారే అని కృష్ణ మురారిని ఇన్ డైరెక్ట్ గా ప్రశ్నిస్తుంది. అదేం లేదు అని మురారి చెప్పగానే జ్వరం కూడా లేదే ఏదో చేయకూడని పని చేస్తున్నట్టు అలా ఉన్నారేంటి అని కృష్ణ సూటిగా ప్రశ్నిస్తుంది. మీకు నచ్చిన పని చేస్తున్నారా లేదంటే నాకు నచ్చిన పని చేస్తున్నారా అని అంటుంది. మంచి పని చేస్తే చాలు కదా అని ముకుందా అనగానే.. అయినా ఇప్పుడు నిన్ను మురారి డ్రాప్ చేయాలా ఏంటి అని కృష్ణని ప్రశ్నిస్తుంది ముకుందా ఏ సి పి సార్ నాతో వాళ్ళ పెద్దమ్మ చెప్పిన పని చేయడానికి వెళుతున్నాను అన్నారు. మధ్యలో నువ్వెందుకు పెళ్లి ఆగిపోవడానికి నల్ల పిల్లి లాగా అని కృష్ణ ఇన్ డైరెక్ట్ గా ముకుంద మీద పంచ్ పనిచేస్తుంది.

Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights

పెద్ద అత్తయ్య ఈ రోజే నా ఆపరేషన్ పూర్తవుతుంది. నేను సక్సెస్ అవ్వాలని నన్ను దీవించండి. ఈరోజు నేను అనుకున్న పని నా ఆపరేషన్ అయిపోతుంది. అందులో నేను సక్సెస్ అవ్వాలని దీవించండి అని కృష్ణ భవాని కాళ్లకు నమస్కారం చేస్తుంది. ఇక ఆ తర్వాత తను అక్కడ నుంచి కృష్ణ వెళ్ళిపోగానే తనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూశారా ఇండైరెక్టుగా నాకు వార్నింగ్ ఇస్తుందా.. నందినీకి మనం పెళ్లి చేస్తున్నామని కృష్ణకు తెలిసిపోయిందా అని ప్రశ్నించగానే.. కృష్ణకు ఆ విషయం తెలిస్తే, తను ఇంత ప్రశాంతంగా అయితే ఉండదు వదిన అని ఈశ్వర్ అంటాడు. తను ప్రతి చిన్న విషయాన్ని గొడవ చేస్తుంది ఇక నందినీకి పెళ్లంటే ఊరుకుంటుందా అని ఈశ్వర్ అంటాడు. ఏది ఏమైనా సరే మీరందరూ జాగ్రత్తగా ఉండాలి నందిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లాలి. నాకు కావాల్సింది అదే. అలాగే మన ఇంటి పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతినకూడదు అని భవాని అంటుంది.

Nuvvu nenu prema : పద్మావతి పెళ్లి కృష్ణ తో జరుగుతుందా..విక్కీకి కృష్ణ బాగోతం తెలిసిపోతుందా?

మురారి పెళ్లి దగ్గరకు వెళ్తూన్న తన కార్ ను కృష్ణ ఫాలో అవుతుంది. మురారి తనతో మాట్లాడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని ముకుందా తన చెవిలో నుంచి బ్లూటూత్ తీసి పక్కన పడేస్తుంది. మురారి కి కోపం వచ్చి ముకుందా తన ఇయర్ ఫోన్స్ తీసుకోకుండా జాగ్రత్త పడతాడు తన వైపు గుర్రుగా కోపంగా చూస్తాడు మురారి. ఇక ఆటోలో ఫాలో అవుతున్న కృష్ణ అనుహ్యంగా ఆ కార్ ను ఫాలో అవడం మిస్ అవుతుంది.

Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights

Brahmamudi: రాజ్ ని మర్యాదలతో ముంచెత్తిన కనకం ఫ్యామిలి,రాహుల్ కు షాక్ ఇచ్చిన స్వప్న..
మురారి కార్ని ఫాలో అవుతుండగా.. డ్రైవర్ మిస్ అవుతాడు. ఇక చేసేది ఏమీ లేక దీనంగా గౌతమ్ దగ్గరకు వెళుతుంది. అప్పటికే గౌతమ్ కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ పెళ్లి జరగదులే కృష్ణమ్మ ఇంకా వదిలే నావల్ల నువ్వు నీ సంసారం ఇబ్బందుల్లో పడకుండా అంతే చాలు ఈ పేదవాడికి నందిని దక్కదు ఒకవేళ దక్కిన కూడా ఆ భవాని మమ్మల్ని బ్రతకనివ్వదు అని గౌతమ్ చెబుతాడు లేదు గౌతం సర్ మీ పెళ్లి చేసే బాధ్యత నాది తప్పకుండా చేస్తాను అని కృష్ణ అంటుంది ఇప్పటికీ నీకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది కృష్ణమ్మ నువ్వే చెప్పావు కదా ఏసీబీ సార్ నందిని పెళ్లి చేస్తున్నారని ఆల్రెడీ వాళ్ళు కళ్యాణమండపం నీకు కూడా వెళ్ళిపోయారు అని గౌతమ్ అంటాడు. కానీ నందిని వాళ్ళ దగ్గర లేదు నందిని ఎక్కడ ఉందో మనం తెలుసుకుని తనని వెతికి పట్టుకుంటే కనుక మనకి మన పని సులువు అవుతుంది. నువ్వు నందిని పెళ్లి చేసుకోవచ్చు అని కృష్ణ సలహా ఇస్తుంది.

Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights
Krishna Mukunda Murari Serial 20 april 2023 Today 136 Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో పెళ్లికూతురుగా ముస్తాబయి నందిని కళ్యాణమండపంకి తీసుకువస్తుంది భవాని స్నేహితురాలు .ఇక పెళ్లికూతురుగా నందిని చూడగానే భవాని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే నందిని నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అని వాళ్ళ అమ్మతో చెబుతుంది ఆ మాటలు విన్న మురారి మనసు కరిగి గౌతమ్ కి ఇచ్చి నందిని తో పెళ్లి చేస్తాడా అనేది చూడాలి. మరోవైపు నందిని వెతకడం కోసం వెళ్లిన గౌతం కృష్ణ కి నందిని అప్పటికే కళ్యాణమండపం కి వెళ్ళిందని తెలుసుకుంటారు. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

రికార్డులు తిరగరాసే సినిమా అంటూ పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ వైరల్ కామెంట్..!!

sekhar

`బింబిసార‌`పై ఫ‌స్ట్ రివ్యూ.. క‌ళ్యాణ్ రామ్ హిట్ కొడ‌తాడా..?

kavya N

Nuvvu Nenu Prema: అందరి ముందే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని విక్కీ చెప్పబోతుండగా పద్మావతి ఏం చేసిందంటే.??

bharani jella