Krishna Mukunda Murari: ఇక ఆ ఫ్లవర్స్ అందరూ పక్కన పెట్టేయకండి. ఎవరి ఫ్లవర్ వాళ్లే పట్టుకోండి .ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరుకి లవ్ ప్రపోజ్ చేయండి అని కృష్ణ ఐడియా ఇస్తుంది. అందరూ ఇక అదే ఐడియా ని ఫాలో అవ్వాలి అనుకుంటారు. ముందుగా కృష్ణ రేవతి తన భర్తని పిలుస్తుంది వాళ్ళిద్దరూ ప్రేమ గురించి అద్భుతంగా చెబుతారు. హ్యాపీ వాలెంటైన్స్ డే అని ఒకరికి ఒకరు చెప్పుకుంటారు.

ఆ తరువాత చిన్నతయ్య చిన్న మాయని పిలుస్తుంది.. వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకరు హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతారు. ఆ తర్వాత అలేఖ్యను తన భర్తని పిలుస్తారు అని చెబుతాడు. దానికి కోపంగా తన భర్త కాలు మీద వేసి తొక్కుతుంది.. ఇక కృష్ణ మురారి కూడా వాళ్ల ప్రేమని ఒకరికి ఒకరు వ్యక్తపరుచుకున్నారు. ప్రపంచాన్ని మర్చిపోయి కళ్లతో ఒకరి మనసులో ఉన్న భావాలను మరొకరు పంచుకుంటారు. మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తాను ప్రేమిస్తాను అని మురారి కృష్ణ కి మాట ఇస్తాడు. హ్యాపీ వాలెంటైన్స్ డే అని కృష్ణ చెప్పగానే విష్ యు ద సేమ్ అని మురారి చెబుతాడు.

ఇక కృష్ణ భవానిని స్టేజి మీదకి రమ్మని పిలుస్తుంది. నేను రానని గొడవ చేసేసరికి మురారి వాళ్ళ పెద్దమని స్టేజ్ పైకి పిలుస్తాడు. మేజర్ గారిని నేనే అనుకుని నాకు ప్రపోజ్ చేయండి అని కృష్ణ అడుగుతుంది. మీరు ఉన్నప్పుడు నాకు తెలియలేదు. కానీ ఇప్పుడిప్పుడే నాకు ప్రేమ గురించి తెలుస్తుంది . నేను కుటుంబాన్ని ప్రేమిస్తాను కుటుంబంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేలాగా చూసుకుంటాను. హ్యాపీ వాలెంటైన్స్ డే ఆల్ ఐ లవ్ యు అని కుటుంబానికి చెబుతుంది. భవాని ఇక ఆ తరువాత కృష్ణ ముకుందని కూడా రమ్మని పిలుస్తుంది..

ఇక కృష్ణని అడ్డం పెట్టుకొని మురారి కి డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తుంది ముకుంద. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడ్డానని ఆ ప్రేమ నాకు దక్కుతుందని ఇప్పటికే అర్థమైందని హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతుంది. ముకుందా వ్యవహారం మీద తేడాగా ఉందని అనుకున్నా రేవతి.. మురారి ఫ్రెండ్ గోపిని పిలిచి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది.
గోపి నీకు ముకుందా మురారి పరిచయం గురించి తెలుసు నువ్వు వాళ్ళిద్దరూ గురించి నాకు చెప్పు. నీకు అంతా తెలుసు.. నా మీద ఒట్టేసి నిజం చెప్పమని అడుగుతుంది. నాకేం తెలియదు పిన్ని అని అంటూనే మురారి ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు. ఈ విషయం నేను చెప్పానని మురారికి తెలిస్తే తను ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తాడు అని గోపి అంటాడు. నువ్వు నాకు చెప్పిన విషయాన్ని నేను విన్న విషయాన్ని మురారిని ఎప్పటికీ అడగను అసలు ఏం జరిగిందో చెప్పమని రేవతి అడుగుతుంది. ముకుందా మురారి పెళ్ళికి ముందు కలుసుకున్నారని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెబుతాడు.
గోపి ఇక ముకుందకు పెళ్లి ఫిక్స్ అవ్వడానికి తెలియదని ఆదర్శం పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి.. మురారి నీ ముకుందా అప్పుడే వెళ్లి మనిద్దరం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. కానీ మురారి ఇంటి పరువు పోకూడదని తన ప్రేమని త్యాగం చేస్తాడు. అదేవిధంగా తన జీవితంలోకి మరో అమ్మాయిని రానివ్వనని మురారి ముకుంద కి ప్రామిస్ చేస్తాడు. కానీ అనుకోకుండా మురారి కి కృష్ణతో పెళ్లి అవుతుంది. కృష్ణ తో సఖ్యతగా మురారి ఉండటం చూసి ముకుందా తట్టుకోలేక పోతుంది. తన ప్రేమను నిలబెట్టుకోవడం కోసం ఇలా చేస్తుంది పిన్ని అని గోపి ఉన్న నిజాన్ని రేవతికి చెప్పేస్తాడు.