Krishna Mukunda Murari: గౌతమ్ కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ పెళ్లి జరగదులే కృష్ణమ్మ ఇంకా వదిలే నావల్ల నువ్వు నీ సంసారం ఇబ్బందుల్లో పడకుండా అంతే చాలు ఈ పేదవాడికి నందిని దక్కదు. ఒకవేళ దక్కిన కూడా ఆ భవాని మమ్మల్ని బ్రతకనివ్వదు అని గౌతమ్ చెబుతాడు లేదు గౌతం సర్ మీ పెళ్లి చేసే బాధ్యత నాది తప్పకుండా చేస్తాను అని కృష్ణ అంటుంది. ఇప్పటికీ నీకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది కృష్ణమ్మ నువ్వే చెప్పావు కదా ఏసీబీ సార్ నందిని పెళ్లి చేస్తున్నారని ఆల్రెడీ వాళ్ళు కళ్యాణమండపం నీకు కూడా వెళ్ళిపోయారు అని గౌతమ్ అంటాడు. కానీ నందిని వాళ్ళ దగ్గర లేదు నందిని ఎక్కడ ఉందో మనం తెలుసుకుని తనని వెతికి పట్టుకుంటే కనుక మనకి మన పని సులువు అవుతుంది. నువ్వు నందిని పెళ్లి చేసుకోవచ్చు అని కృష్ణ సలహా ఇస్తుంది.
పెళ్లికూతురుగా ముస్తాబయి నందిని కళ్యాణమండపంకి తీసుకువస్తుంది భవాని స్నేహితురాలు .ఇక పెళ్లికూతురుగా నందిని చూడగానే భవాని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే నందిని నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అని వాళ్ళ అమ్మతో చెబుతుంది ఆ మాటలు విన్న మురారి మనసు కరిగి గౌతమ్ కి ఇచ్చి నందిని తో పెళ్లి చేస్తాడా అనేది చూడాలి.
నందిని ఎక్కడుందో నాకు ఇప్పుడు అర్థమైంది ముకుంద వాళ్ళ ఇంట్లో నందిని దాచి పెట్టారు కదా గౌతమ్ సర్ మనం వెంటనే వెళ్లి నందిని వెతుకుదాం తను కచ్చితంగా మనకు దొరుకుతుంది అని కృష్ణ చెబుతుంది. అక్కడే ఉంటుంది అని నీకు ఎలా తెలుసు అని కృష్ణని గౌతమ్ ప్రశ్నిస్తాడు. పదండి చూద్దామని అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ నందిని ఉండదు కానీ ఆ ఇంటికి డెకరేషన్ చేసి ఉండడం చూసి కచ్చితంగా ఈ దరిదాపుల్లో ఎక్కడో నందిని పెళ్లి చేస్తున్నారు. మనం నందిని పెళ్లి ఎక్కడ చేస్తున్నారో తెలుసుకుంటే మనం ఈ పెళ్లిని ఆపొచ్చు మనకి ఇంకా ఒక గంట సమయం ఉంది ఈలోపు మనం నందిని పట్టుకోవాలి. నాకు తెలిసిన అంకుల్ చేత ఏసిపి సార్ నెంబర్ ని ట్రేస్ చేయించి లొకేషన్ కనుక్కుంటాను అని కృష్ణ అంటుంది. కానీ ఆ ప్రయత్నం కూడా వృధాగా మారుతుంది. ఎలాగైనా సరే కృష్ణ లొకేషన్ తెలుసుకొని గౌతమ్ సార్ ని రేపటి ఎపిసోడ్ లో అక్కడికి తీసుకు వస్తుంది. కృష్ణ గౌతమ్ రావడం చూసి మురారి భవాని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక నందిని పెళ్లి గౌతమ్ తో జరుగుతుందా లేదంటే భవాని చూసి అతనితో జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!