Krishna Mukunda Murari: కృష్ణ గబా గబా హాస్పిటల్ కి వెళ్తుండగా వాళ్ళ అత్తయ్య రేవతి పిలిచి కృష్ణకు ధైర్యం చెబుతుంది. నీకు ఈ ఇంట్లో ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ అమ్మగా నేను నీకు తోడుంటానని నీ ప్రతి బాధని నాతో పంచుకోమని సలహా ఇస్తుంది రేవతి.. నందిని విషయంలో నువ్వు చేస్తున్న కరెక్టే పార్టీ ఆడదానిగా నీకు అండగా ఉంటాను అని రేవతి మనసులో అనుకుంటుంది. కృష్ణ తనకి టిఫిన్ తినిపించిన రేవతిని గట్టిగా హత్తుకుంటుంది.

రేవతి కృష్ణ కి ఆల్ ద బెస్ట్ పంపించేస్తుంది. అమ్మ కృష్ణ ఎక్కడ అంటూ మురారి అడగగానే తను గౌతమ్ సార్ ని కలవడానికి హాస్పటల్ కి వెళ్లిందని రేవతి చెబుతుంది. ఆ మాటలను చాటుగా విన్న ముకుందా మురారి వెళుతున్న కా డోర్ ఓపెన్ చేస్తుంది. అంతేకాకుండా కృష్ణ తనంతట తానే వెళ్లిపోతుంది. ఇక మన ప్రేమకు ఎవరు అడ్డు లేరు అని ముకుందా అనగానే.. ఆదర్శ్ తిరిగిరాకుండా నువ్వు నాతో కలిసి తిరుగుతుంటే జనాలు నీకు ఏమని పేరు పెడతారో నువ్వే ఆలోచించుకో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక గౌతమ్ సార్ రూమ్లో తన కోసం ఎదురుచూస్తున్న కృష్ణ ఆ ఫోటోలో ఎవరున్నారా అని చూడబోతుండగా.. సరిగ్గా సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు మురారి. సడన్ గా తనని కదిలించేసరికి పెద్దగా అరుస్తుంది కృష్ణ. అదేంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. ఏసీబీ సార్ అని పిలవకుండా గౌతమ్ సార్ గౌతమ్ సార్ కలవరించడం చూసి మురారి మనసులో అనుమానం కలుగుతుంది. సరే కాఫీ తాగుదాం రమ్మని మురారి కృష్ణను పిలిచినా కూడా రాను అని తగేసి చెబుతుంది .దాంతో నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురారి.

ఇక పరిమళా కనిపించడంతో మేడం ఒక్కసారి గౌతమ్ సార్ కి ఫోన్ చేయండి . నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్ ఎప్పుడు వస్తారు.. ఎన్నింటికి వస్తారు అంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తుంది పరిమళపై.. అసలు గౌతమ్ లేకపోతే రాకపోతే పిచ్చిది అయ్యేలాగా అనిపించినా కృష్ణ ప్రవర్తన చూసి.. వెంటనే మురారి కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. నీ భార్యను పట్టించుకోవా అని మురారినే తిడుతుంది పరిమళ. మీ సంసారం కూలిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని సలహా కూడా ఇస్తుంది. దాంతో మురారి కృష్ణ పై తనకి ఎలాంటి అనుమానం లేదని కేవలం తను టెన్షన్ లో ఉంది మాత్రమే అని సర్ది చెబుతాడు పరిమళకి మురారి.
ఇక రేపటి ఎపిసోడ్ లో ఏంటి కృష్ణ ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా అని ముకుందా అడగగానే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ చూపించాల్సిన ఆధారాలు నా దగ్గర లేవు. అందుకని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా.. పెద్ద అత్తయ్యని క్షమించమని అడగమని రేవతి కృష్ణకు సలహా ఇస్తుంది. క్షమాబిక్ష నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని కృష్ణ అంటుంది. ఇక భవాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.