Krishna Mukunda Murari: ముకుంద వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మురారి దగ్గరికి వెళ్లి మాట్లాడమని చెబుతుంది. ఇప్పటివరకు నేను మురారితో ఎంతో చెప్పి చూశాను ఇప్పుడు పెద్దవాళ్లు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి మీరు మాట్లాడండి నాన్న ఎలాగో కొన్ని రోజుల్లో కృష్ణ వెళ్లిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ కాబట్టి. ఇక కృష్ణ వెళ్ళిపోగానే మురారి నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరే ఒప్పించాలి అని ముకుందా వాళ్ళ నాన్నతో చెబుతుంది. అందుకు ఆయన సిద్ధపడతాడు. సరే నేను మాట్లాడతాను అని ముకుందతో అంటాడు.

ఇక ముకుందా వాళ్ళ నాన్న మురారి కోసం కృష్ణను హాస్పిటల్ దగ్గర దింపడానికి వచ్చారని తెలిసి అక్కడికి వస్తాడు ఆయన కూడా. ఇక ముకుందా వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేసరికి మురారి కృష్ణ ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూ చాలా క్లోజ్ గా కనిపిస్తారు. కృష్ణ నిజంగా తన భర్తకు సేవలు చేస్తున్నట్టే మురారికి సేవలు చేస్తూ కనిపిస్తుంది. ఇక కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సీన్లోకి మురారి వాళ్ళ నాన్న ఎంటర్ అవుతారు మురారి ఒక్కసారిగా ముకుంద వాళ్ళ నాన్నను చూసి షాక్ అవుతాడు అని అనుకుంటాడు ఏంటి మురారి నా కూతురు జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆయన అడుగుతారు.

Nuvvu Nenu Prema: ఆండాళ్ కు అడ్డంగా దొరికిపోయిన సిద్దు.. పద్మావతి ఎలా కాపాడనుంది..
మీ అమ్మాయి గురించి నన్ను అడుగుతున్నారు ఏంటి అని మురారి ప్రశ్నిస్తాడు. ఈరోజు మా అమ్మాయి జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా అని ఆయన కూడా అంటారు. నేను ఆ రోజు పెళ్లి టయానికి వచ్చాను కాబట్టి నన్ను అందరూ నిందిస్తున్నారు ఒకవేళ నేను ఆ పెళ్లిలో కనక కనిపించకపోతే ఆ పెళ్లి అప్పుడే అయిపోయి ఉండేది. అప్పుడు దోషులుగా మీరు నిలబడేవారు. నేను అక్కడికి రావడం వల్లే ముకుంద మీరు నన్ను దోషుగా నిలదీస్తున్నారు. కృష్ణది నీది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా కృష్ణ వెళ్లిపోయిన తర్వాత పెళ్లి చేసుకోమని ఆయన సూటిగా అడుగుతారు మీరు కూడా ఆ మాట ఎలా మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు అని మురారి అంటాడు అయినా పరాయి భార్యను నా భార్యగా ఎలా చేసుకుంటాను కృష్ణ కి తన తండ్రి లేరు ఆయన ఒక్కరే కాదు తనకి ఎవరూ లేరు ఒకవేళ కృష్ణ నా నుంచి వెళ్ళిపోవాలని అనుకున్న కూడా నేను వెళ్ళనివ్వను తనకి జీవితాంతం నేను తోడుగా ఉంటాను అని మురారి ఆయనతో చెబుతారు ఇప్పటివరకు నీలో ఓ మంచి మనిషిని చూశాను. కానీ పరాయి వాళ్ళ భార్యను ఏ విధంగా చూడాలో, పెళ్లి బంధం పై నీకున్న విలువని తెలిశాక నేను నీకు సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను మురారి. నువ్వు కనుక ఇది చేస్తే ముకుంద నీ నుంచి దూరం అవ్వడం ఖాయం అని అంటారు. ముకుంద ఇప్పటికీ నీ ప్రేమ కోసం ఎదురుచూస్తుంది పైగా కృష్ణ వెళ్లిపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది నువ్వు ఏదో ఒకటి చేసి మీ మీద ఉన్న ప్రేమను విరిగిపోయేలా చెయ్యి నువ్వు తన మనసుని విరిచేసే విధంగా ప్రవర్తించు. తను అక్కడ నుంచి మా ఇంటికి వస్తుంది . మా ఇంటికి వచ్చిన తర్వాత కొన్నాళ్లు ఆదర్శ్ కోసం నేను ఎదురు చూస్తాను. అప్పటికీ ఆదర్శ కనక తిరిగి రాకపోతే నేను ముకుంద కి మరో పెళ్లి చేస్తాను అని ఆయన చెబుతారు. చివరిగా మురారి కి చేతులు జోడించి నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

కృష్ణ హాస్పటల్లో ఏ పేషెంట్ ని చూసిన కూడా వాళ్లలో మురారినే కనిపిస్తాడు. ఏ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తున్న కూడా కృష్ణకి వాళ్ళల్లో మురారి కనిపిస్తాడు. అలా గమనించి తన గుండెల మీద పడుకొని హార్ట్ బీట్ ని చెక్ చేస్తూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇది నువ్వు నా మనసుకి కన్ఫ్యూజన్ ఇస్తూన్నావు. నువ్వు ప్రేమతో నాకు ఫ్దగ్గరవుతున్నావా.. లేదు అంటే ఎందుకు నాకు దగ్గరవుతున్నా వు అని కావడం లేదు అని మురారి మనసులో అనుకుంటాడు. మురారిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి కృష్ణ చెక్ చేస్తూ ఉంటుంది. ఆ క్లోజ్ మూమెంట్స్ లో ఇద్దరు ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. హాస్పిటల్లో ఏ పేషెంట్ ను చూసిన కృష్ణకి అలాగే కనిపించేసరికి ఇక తన కాబిన్ కి వెళ్తుంది. అక్కడ కూడా మురారి తన పక్కనే ఉన్నాడని అనిపిస్తుందిగా కృష్ణ ఇంకాస్త క్లోజ్ అవుతూ ఉంటుంది.

ముకుంద వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గురించి మురారి ఆలోచిస్తూ ఉంటారు. ఎలా మనసులో తనపై ఉన్న ప్రేమను విరిచేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మురారి ఎలాగైనా ముకుందని తనకు దూరం లో ఆలోచనలో నిమగ్నమై ఉంటాడు.