Krishna Mukunda Murari: నువ్వు కృష్ణని చూసినంత ప్రేమగా నా కోడలు ఎందుకు చూడడం లేదు అని భవాని అడుగుతుంది. నీకు కృష్ణ అంటేనే ఎక్కువ ఇష్టం ముకుందపై నువ్వు ఎందుకు ప్రేమ చూపించడం లేదు అని భవాని గట్టిగా నిలదీసి అడుగుతుంది. రేవతి అలాంటిది ఏం లేదు అక్క అని చెబుతుంది .కృష్ణ మురారి కలిసి ఉండడం చూసి ముకుంద కూడా ఫీల్ అవుతుంది కదా ఆ బాధ ఎక్కువగా ఉంది .ఆ కంగారులో పడి ఎక్కువగా మాట్లాడేస్తున్నాడేమో కానీ ముకుందా కృష్ణ నాకు ఇద్దరు కూతుర్లతో సమానం . ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువగా చూడను అని రేవతి చెబుతుంది.

ముకుంద అత్తయ్య మీకు ఒక గుడ్ న్యూస్.. ఆదర్శ్ భార్యగా నన్ను ఢిల్లీ రమ్మన్నారు అని అనగానే వెంటనే ప్రతాప్ ముకుంద కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని భవాని అంటుంది.. చిన్న మామయ్య రెండు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి అని ముకుందా చెబుతుంది. రెండవది దేనికి అమ్మా అని అడగగానే నాకు మురారి కి అని ముకుందా అంటుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ముకుందా వైపు చూస్తారు. హోమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి అంటే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కావాలి అందుకోసం మురారిని తోడు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను ఒకవేళ మురారి వద్దంటే చెప్పండి నేను మా నాన్నని తోడు తీసుకుని వెళ్తాను అని ముకుందా అంటుంది ఇక అందరూ ఒప్పుకుంటారు కానీ రేవతి మాత్రం ససేమిరా ఒప్పుకోదు కానీ భవాని చెప్పడంతో రేవతి మౌనంగా ఉండిపోతుంది .

ముకుంద సంతోషంతో పొంగిపొర్లు పోతూ ఉంటుంది. అప్పుడే మురారి తన దగ్గరకు వెళ్లి ముకుంద వైపు చూస్తూ నిలబడిపోతాడు. ముకుందా మురారితో మన ఇద్దరం ఎంచక్కా ప్రేమ పక్షుల్లాగా ఎగిరిపోవచ్చు అని అంటుంది. ఎంతసేపటికి నీ నుంచి మనిద్దరం కలిసి ఉండొచ్చు అనే మాటలు తప్ప.. ఆదర్శిని కలవబోతున్నాను అన్న ఆనందం లేదు.

ఆదర్శ్ కోసమే ఈ ప్రయత్నం అని కానీ సమాధానం రావడం లేదు. ఒక్కసారి నువ్వు ఎంతకు దిగజారిపోయే ప్రవర్తిస్తున్నావో ఆలోచించు అప్పుడు నీకే అర్థమవుతుంది . నువ్వేం చేస్తున్నావో అని ముకుందా ను అంటాడు మురారి. దాంతో ముకుంద కన్నీళ్లు పెట్టుకుంది .

ఇక కృష్ణ తన గదిలోకి వెళ్లి మురారి ఊరు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉంటుంది. అది చూసినా రేవతి అయ్యో పిచ్చి పిల్ల నువ్వు కూడా మురారితోపాటు ఢిల్లీ వెళ్ళమని సలహా ఇస్తుంది. రేవతి కానీ ఇప్పుడు ఎందుకు అత్తయ్య వెళ్లడం అని కృష్ణ అంటుంది. అప్పుడే మురారి కూడా అక్కడికి వస్తాడు. మురారితో కూడా కృష్ణుని ఢిల్లీ తీసుకు వెళ్ళమని చెబుతోంది. రేవతి తను కూడా అదే మాట అంటాడు. అసలు మీరిద్దరూ భార్యాభర్తలు యేనా.. లేదంటే మా అందరి ముందు భార్యాభర్తల్లాగా నటిస్తున్నారా అని రేవతి ప్రశ్నిస్తుంది. ఆ మాటకి షాక్ అవుతూ మురారి కృష్ణ ఇద్దరూ రేవతి వైపు చూస్తారు.
