Krishna Mukunda Murari: మురారితో కూడా కృష్ణుని ఢిల్లీ తీసుకు వెళ్ళమని చెబుతోంది. రేవతి తను కూడా అదే మాట అంటాడు. అసలు మీరిద్దరూ భార్యాభర్తలు యేనా.. లేదంటే మా అందరి ముందు భార్యాభర్తల్లాగా నటిస్తున్నారా అని రేవతి ప్రశ్నిస్తుంది. ఆ మాటకి షాక్ అవుతూ మురారి కృష్ణ ఇద్దరూ రేవతి వైపు చూస్తారు. అర్జెంటుగా కృష్ణకి మరొక టికెట్ బుక్ చెయ్యి నీతో పాటు కృష్ణ కూడా వెళ్లాలి. లేదంటే నేను అస్సలు ఒప్పుకోను అని రేవతి అంటుంది. రేవతి కోరిక మేరకు మురారి కృష్ణకు కూడా టికెట్ బుక్ చేస్తాడు.

ముకుంద రెడీ అయ్యి వచ్చి హాల్లో మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ల పెద్దతే రాగానే ఆశీర్వాదం తీసుకొని నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని అంటుంది. ఇక మురారి రాగానే బయలుదేరుదామా అని అంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి నేను రెడీ వెళ్దామా అని అంటుంది. నువ్వేంటి అని అనగానే.. నేను కూడా వస్తున్నాను కదా ఢిల్లీ అని కృష్ణ అంటుంది. అయితే మీరిద్దరూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి నేను రాను అని ముకుందా అంటుంది. నేనే కృష్ణని మీతో పాటు రమ్మని చెప్పాను అని రేవతి అంటుంది నేను ఆదర్శ్ కోసం బ్రతకడానికి అని ఢిల్లీ వెళ్తుంటే.. వీరిద్దరూ ఎంజాయ్ చేయడం కోసం ఢిల్లీ వస్తున్నారు.

వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తుంటే నేను నాకు ఆనందం మా సంతోషం లేదని అనుకుంటూ కూర్చోనా మీ ఉద్దేశం అని ముకుందా ఫైర్ అవుతుంది.. ఇంట్లో వాళ్ళందరి పైన రేవతి అత్తయ్యకు నేను అంటే మొదటి నుంచి ఇష్టం లేదు. నన్ను చాలా చులకనగా చూస్తుంది అని ముకుందా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది.. రేవతి గురించి ఆ మాటలకి కోపం వచ్చిన భవాని నా ముందే నా తోటి కోడల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడితే నేను ఊరుకుంటాను అని అనుకుంటున్నావా.
అయినా ఇప్పుడు కృష్ణ వస్తే తప్పేంట అని భవాని అంటుంది మా అమ్మని నువ్వు అన్ని మాటలు అనడం కరెక్ట్ కాదు ముకుందా అని.. మురారి కూడా ముకుందపై ఫైర్ అవుతారు. ఇందాకటి నుంచి ఊరుకుంటూ ఉన్నాను.. ఇప్పుడు నేనే చెబుతున్నాను నీతో పాటు నేను ఢిల్లీ రాను అని మురారి తేల్చి చెప్పేస్తాడు.
ముకుందా కి దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఒకటయ్యి నన్ను చులకనగా చూస్తున్నారు. ఆదర్శ వచ్చేవరకు ఈ ఇంట్లో నాకు ఒక చిన్న చోటు ఇవ్వండి చాలు.. నాకు కుదిరితే ఓ ముద్ద తిండి పెట్టండి. లేదంటే అది కూడా వద్దు ఫస్ట్లు ఉంటాను అంటూ ముకుంద నానా యాగి చేస్తుంది ఇంట్లో.. ముకుంద పరిస్థితి ఉండే కొద్ది దారుణంగా తయారవుతుందని కృష్ణ మురారితో పర్సనల్గా చెబుతుంది
తనని అలా వదిలేయడం కరెక్ట్ కాదు అని ముకుంద ను పట్టించుకోవాలని అందరితో కలిసి మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రం తనకి ఇవ్వాలని అప్పుడే తను ఆదర్శ్ లేడని లోటులో నిలిచి బయటకు వస్తుందని కృష్ణ అంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో మురారి కృష్ణ కోసం డాక్టర్ కోట్ స్కతస్కోప్ కూడా తీసుకొని తనకి సర్ప్రైజ్ ఇస్తాడు. ముకుంద మురారిని ఒకంట గమనిస్తూనే ఉంటుంది. .కృష్ణ కి మురారి సర్ప్రైజ్ ఇవ్వడం చూసి ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది..